Amaranthus : ఎముకల బలానికి…గుండె ఆరోగ్యానికి…తోటకూర

అధిక రక్తపోటుతో బాధపడుతున్న తీసుకోవటం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. కొవ్వును తగ్గిస్తుంది. తక్షణ శక్తిని అందించటంలో ఉపకరిస్తుంది.

Amaranthus

Amaranthus  : పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభించే ఆకు కూరల్లో తోటకూర ప్రధానమైనది. తోటకూర ను ప్రతి రోజూ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలైన తోటకూర అందుబాటులో ఉంటుంది. పెరుగు తోటకూర, కొయ్య తోటకూర, చిలుక తోటకూర, ఎర్ర తోట కూర ఇలా తోటకూరలో వివిధ రకాలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో తోటకూర పెరటి పంటగా పెంచుతుంటారు.

తోటకూరను ఎక్కువగా అనారోగ్య సమస్యలతో బాధపడుతన్నవారు, బాలింతలు, రక్తపోటుతో బాధపడుతున్నవారు తీసుకోవటం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. తోట కూర మంచి విరోచనకారి కావటం వల్ల జీర్ణశక్తి పెంపొందుతుంది. బరువు తగ్గాలనుకునే వారు తమ ఆహారంలో తోటకూర చేర్చుకోవటం వల్ల బరువు సులభంగా తగ్గవచ్చు. ఇందులో ఉండే అధిక పీచు జీర్ణశక్తిని పెంచుతుంది. తోటకూరలో క్యాల్షియం, ఎ,బి1, బి2, బి6,సి,కె విటమిన్లు, ఐరన్, రిబోప్లేవిన్, పొటాషియం, జింక్, ఖనిజలవణాలు ఉంటాయి. వంద గ్రాముల తోటకూర తింటే 716 క్యాలరీల శక్తి లభిస్తుంది.

అధిక రక్తపోటుతో బాధపడుతున్న తీసుకోవటం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. కొవ్వును తగ్గిస్తుంది. తక్షణ శక్తిని అందించటంలో ఉపకరిస్తుంది. తోటకూరలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జుట్టురాలటం, చుండ్రు వంటి సమస్యలను నివారించటంలో దోహదం చేస్తుంది. పాల ద్వారా శరీరానికి ఎంత కాల్షియం అందుతుందో తోటకూర తీసుకోవటం ద్వారా శరీరానికి అంతే మొత్తంలో కాల్షియం అందుతుంది. అంతేకాదు జీర్ణశక్తిని పెంపొందించడంలో తోటకూర చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే పీచు పదార్థాల కారణంగా శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ బయటకు నెట్టివేయబడుతుంది.

ఇందులో ఉండే పొటాషియం కారణంగా గుండె ఆరోగ్యాన్ని పదిలంగా చేస్తాయి . అలాగే ఎముకలు బలంగా ఉండేలాగా తోటకూర సహాయపడుతుంది. ఒక కప్పు తోట కూర తీసుకుంటే అయిదు కోడి గుడ్లు, రెండు కప్పుల పాలు, ఇరవై గ్రాముల మాంసం, అయిదు యాపిల్స్ తో సమానంగా చెప్పవచ్చు. గుండె బలహీనంగా ఉన్నవారు, నరాల బలహీనంగా ఉన్నవారు తోటకూర మంచి ఔషదమని చెప్పవచ్చు. కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. మధుమేహ వ్యాధిగస్తులకు తోటకూర చక్కటి ఔషధం. ఇది నెమ్మదిగా జీర్ణమవుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని స్థిమితంగా ఉంచడంలో తోటకూర దోహదపడుతుంది. వారానికి రెండు,మూడు సార్లు తోటకూర తినడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు.