Hot Water2
Hot Water : శరీరానికి నీరు ఎంతో అవసరం. ప్రతి రోజూ ఉదయం పరగడుపున నీటిని తాగటం వల్ల మన శరీరంలో ఉన్న మలినాలు తొలగిపోయి ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటారు. చాలామంది ఫ్రిజ్ వాటర్ తాగేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇది ఏమాత్రం ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదు. చల్లని నీటిని తాగటం వల్ల ఆరోగ్యానికి హానికలుగుతుంది. చల్లిని నీటిని తాగటం వల్ల అనేక వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదం ఉంటుంది. మహిళలు రోజుకు 2.6 లీటర్లు, పురుషులు 3.7 లీటర్లు చొప్పున తాగడం మంచిదని చెబుతున్నారు. ప్రతి రోజూ పరగడుపున చల్లని నీటి కన్నా వేడి నీటిని తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు.
ప్రతి రోజూ ఉదయం పరగడుపున ఒక గ్లాసు వేడి నీటిని తాగటం వల్ల మన శరీరంలో మెటబాలిజం రేటు పెరుగుతుంది. అదే విధంగా శరీరంలో ఎలాంటి మలినాలు లేకుండా బయటకు వెళ్తాయి. అల్పాహారానికి ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అదేవిధంగా మలబద్ధకం కూడా తగ్గుతుంది. ఫైల్స్ సమస్యతో సతమతమయ్యేవారు ప్రతి రోజూ ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగడం వల్ల ఈ సమస్య నుంచి పూర్తిగా ఉపశమనం పొందవచ్చు.
జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలతో బాధపడేవారికి వేడినీరు ఉపశమనం కలిగిస్తుంది. ప్రతి రోజూ గోరువెచ్చని నీటిని తాగటం వల్ల శ్వాసనాళాలు శుభ్రపడి శ్వాసక్రియకు ఎలాంటి ఆటంకం లేకుండా దోహదపడుతుంది. అధిక శరీర బరువుతో బాధపడేవారు తొందరగా వారి శరీర బరువు తగ్గడానికి గోరువెచ్చని నీరు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి రోజూ ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగటం వల్ల మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోయి తొందరగా శరీర బరువు తగ్గడానికి కారణమవుతుంది.
డయాబెటీస్, గుండె, ఉదర సంబంధిత వ్యాధులతో బాధపడేవారు వేడి నీళ్లు తాగడం ఎంతో మంచిదని వైద్యులు తెలుపుతున్నారు. కడుపు నొప్పి, అజీర్తి తదితర జీర్ణ సమస్యలు, ఇతరాత్ర ఉదర సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి వేడినీరు మంచి ఔషదంగా చెప్పవచ్చు. వేడి నీరు తాగడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది.
వేడి నీరు గొంతు సమస్యలను దరి చేరనివ్వకుండా కాపాడుతుంది. వేసవి కాలంలో సైతం డిహైడ్రేడ్ సమస్య తీర్చేందుకు వేడి నీరు ఉపయోగపడుతుంది. కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఆర్థరైటీస్ సమస్యలు రాకుండా బాగా పనిచేస్తాయి. వైరస్‌లు ప్రమాదకర బ్యాక్టరీయాలను తరిమే శక్తి వేడి నీళ్లకు ఉంటుంది.
ఉదయం నిద్రలేవగానే.. కాలకృత్యాలు తీర్చుకోడానికి ముందే రెండు లేదా మూడు గ్లాసుల గోరు వెచ్చని నీరు తాగండి. వేడి నీటిని ఒకేసారి గడగడ తాగకుండా కొద్దికొద్దిగా తాగటం మంచిది. ఎక్కువ వేడిగా ఉన్న నీళ్లు తాగడం వల్ల నాలుక, నోరు కాలడం, గొంతులో కణాలు దెబ్బతినడం వంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి గోరు వెచ్చని నీళ్లను మాత్రమే తీసుకోవటం ఉత్తమం.