Winter (1)
Skin Beauty : సాధారణంగా చలికాలంలో అధిక చలి తీవ్రత కారణంగా చర్మ సౌందర్యాన్ని పూర్తిగా కోల్పోవాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే మన చర్మ సౌందర్యాన్ని కాపాడటం కోసం మనం ఎన్నో రకాల మాయిశ్చరైజర్ క్రీములను ఉపయోగిస్తూ ఉంటాము. అయినప్పటికీ కొందరి చర్మం ఎంతో డ్రైగా మారి చర్మం పగులుతూ చాలా నొప్పిని కలిగిస్తుంది. మరి ఈ విధమైన సమస్యలతో బాధపడేవారు చలికాలంలోనూ చర్మం అందంగా ఉండాలంటే తప్పకుండా ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే.
చలికాలంలో వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి దూరంగా ఉండటానికి ప్రతిరోజు ఉదయం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, ఒక టేబుల్ స్పూను తేనె కలుపుకొని తాగడం వల్ల ఆయా సమస్యల నుంచి దూరం కావచ్చు. విటమిన్ ఇ ఉన్నటువంటి క్రీములను మాయిశ్చరైజర్ గా వాడటం వల్ల మన చర్మం ఎప్పుడు పొడిబారకుండా తేమగా ఉంటుంది. సహజంగా చలి వల్ల కలిగే ఈ రకమైన సమస్యను తగ్గించేందుకు ఎక్కువశాతం నీరు తాగుతారు. ఇదీ ఒక రకంగా ఉపయోగపడుతుంది. అయితే ఆరంజ్, తేనె వాడినట్లైతే ఈ సమస్యపైన ఎక్కువ ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో మొక్కజొన్న పిండి, పెరుగు కలిపిన మిశ్రమాన్ని ప్రతిరోజు శరీరానికి అప్లై చేసి ఆరిన తర్వాత శుభ్రపరచినట్లైతే శరీరం మిల మిలలాడుతుంది.
ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు మన చర్మతత్వానికి సరిపడే నూనెలతో బాగా మర్దనా చేయటం వల్ల మన చర్మానికి కావల్సినంత తేమ అందుతుంది. చలికాలంలో చలి తీవ్రత కారణంగా జీర్ణక్రియ శక్తి పూర్తిగా తగ్గిపోతుంది. ఈ క్రమంలోనే రాత్రి పూట అన్నం కాకుండా చపాతి, పుల్కా వంటి వాటిని తీసుకోవాలి. ఇక రాత్రి భోజనం అనంతరం ప్రతి రోజు ఏదైనా ఒక పండును తీసుకున్నప్పుడే మన చర్మ సౌందర్యాన్ని కాపాడుకోగలం. దీంతో పోషకాలు లభిస్తాయి. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా విటమిన్ సి, ఇ ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం సురక్షితంగా ఉంటుంది.
ఆరంజ్ పండ్లను తినేసి తొక్కలను బయట విసిరివేయకుండా, వాటిని ఎండలో ఎండబెట్టి పౌడర్‌గా చేసుకొని ఆ పౌడర్‌ని నీటిలో కలిపి ముఖానికి, చేతులకు రాసుకొని కొద్దిసేపు తర్వాత శుభ్రం చేసినట్లైతే పొడిబారిన చర్మం ఇట్టే మాయమైపోతుంది. అదేవిధంగా అర టీ స్పూన్ నిమ్మరసంలో ఒక గ్లాసు వేడి నీటిని, ఒకటి లేక రెండు టీ స్పూన్ తేనె కలిపి ఉదయానె పరగడుపుతో తాగినట్లైతే మేని మిలమిలలాడడమేకాకుండా, శరీరంలో వున్న క్రొవ్వు పదార్థాలు తగ్గి నాజూకుగా తయారవుతారు.
జిడ్డు చర్మం వున్నవారు రోజ్ వాటర్‌లో దూదిని ముంచి ముఖానికి రాసినట్లైతే చర్మం నిగ నిగలాడుతుంది. మచ్చలు, గాయాలు వంటి సమస్య ఉన్నవారు టమోటో గుజ్జుతో పాటు పెరుగు కలిపిన మిశ్రమాన్ని, సమస్య ఉన్నచోట రుద్ది ఆరిన తర్వాత శుభ్రపరచినట్లైతే గాయాలు మాయమైపోతాయని బ్యూటీషియన్లు చెప్తున్నారు. పెదాలను మృదువుగా ఉంచేందుకు లిప్ బామ్ మరియు పెట్రోలియం జెల్లి వంటి వాటిని తరచూ రాస్తుండాలి. ఇవి మంచి మాయిశ్చరైజర్ గా కూడా పనిచేస్తాయి.
చలికాలంలో చర్మంతోపాటు జట్టు సంరక్షణ కూడా చాలా అవసరం. లేకపోతే చుండ్రు, జిడ్డు సమస్యలు అధికమై జట్టుబలహీనమై, జీవం కోల్పోయి పీచులా తయారవుతుంది. అందుకనే.. జుట్టు పట్టుకుచ్చులా జాలువారాలంటే శిరోజాల రక్షణకు నీరు తగినంత తీసుకోవడం ద్వారా శిరోజాలు పొడి బారకుండా ఉంటాయి. శిరోజాలు చిట్లడానికి చలికాలం అనువైన వాతావరణం కాబట్టి జుట్టు కొసలను తరచూ కత్తిరించుకుంటూ ఉండాలి.
తేమను అందించే మాయిశ్చరైజర్స్ వాడాలి. అందుకు బాడీ లోషన్, శరీరానికి వెన్న వంటి ఉపయోగించడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది.చల్లగాలులు శరీరానికి తగలకుండా పూర్తిగా కవర్ చేసేలా స్వెటర్లు, గ్లౌజుల, సాక్సులు వంటివి తొడుక్కోవాలి. చర్మ సంరక్షణకోసం ఎక్కువగా పండ్లను, వెజిటేబుల్స్ ను తీసుకోవాలి. ఇంకా బాదాం, ఆలివ్ ఆయిల్స్ తో బాడీని మసాజ్ చేసుకోవడం వల్ల దురద, పొడబారడం వంటి సమస్యల నుండి బయట పడవచ్చు.
శీతాకాలంలో పాదాల పగుళ్ళు మరింత ఎక్కువగా కనబడుతాయి. కాబట్టి పాదాలపై ప్రత్యేక శ్రద్ద అవసరం. వారానికి ఒక సారి పాదాలను ఎక్స్ ఫ్లోట్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి. ఫూట్ క్రీమ్, పెట్రోలియం జెల్లి వంటివి రాసుకొని కాళ్ళకు ఎప్పుడూ సాక్సులతో కవర్ చేసి ఉంచుకోవాలి.