Foreigners in Indian marriage
Foreigners in Indian marriage : దగ్గర బంధువులో, స్నేహితులో, తెలిసిన వారినో త్వరగా ‘పెళ్లి చేసుకోండ్రా.. పప్పన్నం పెట్టండ్రా’ అని సరదాకి ఆట పట్టిస్తుంటారు. పెళ్లికి వేడుకకి వెళ్లడం అందరికి భలే సరదా. మన భారతదేశంలో పలు సంప్రదాయాల్లో జరిగే వివాహ వేడుకలు చూడ ముచ్చటగా ఉంటాయి. ఈ వేడుకల్ని చూడటానికి మన వాళ్లే కాదు ఫారినర్స్ కూడా మొగ్గుచూపుతారు. ఇండియన్ మ్యారేజ్ చూడటానికి వాళ్లు డబ్బు కట్టి రావడానికి ఇష్టపడతారు. ఆశ్చర్యపోతున్నారా? చదవండి.
Jagaptahi Babu : ప్రేమించడం సరదా.. డైవర్స్ వస్తే పార్టీలు చేసుకుంటున్నారు.. ఈ జనరేషన్ పెళ్లిళ్లపై జగపతి బాబు వ్యాఖ్యలు..
భారత్‌లో పెళ్లిళ్లు ఎంతో వేడుకగా జరుగుతాయి. అందమైన వివాహ వేడుకల్ని చూడటానికి, వేడుకల్లో పాల్గొనడానికి విదేశీ పర్యాటకులు మొగ్గు చూపుతున్నారు. కొన్ని నివేదికల ప్రకారం జాయిన్ మై వెడ్డింగ్ (https://www.joinmywedding.com/) అనే వెబ్ సైట్‌లో పెళ్లి వివరాలను నమోదు చేసుకుంటే విదేశీ పర్యాటకులు $350 (29,086.75 ఇండియన్ కరెన్సీలో) అంతకంటే ఎక్కువ మొత్తం చెల్లించి మరీ భారతీయ వివాహ వేడుకలకు హాజరౌతారట. వారు ఇంతగా మొగ్గు చూపడానికి మరో కారణం ఏంటంటే భారతీయ వంటకాలు, వ్యక్తులు, నృత్యాలు, పాటలు, ఆచారాలు, దుస్తులు ఇవన్నీ కూడా వారిని అట్రాక్ట్ చేస్తున్నాయట.
Viral News : వెడ్డింగ్ కేక్ వల్ల వారి పెళ్లి రద్దైంది.. ఇదేం విడ్డూరం? చదవండి
ఇదే మంచి అవకాశంగా భారత్‌లో పెళ్లి చేసుకుంటున్న జంటలు తమ వివాహ వివరాలను వెబ్ సైట్‌లో పొందుపరిస్తే సరి. ఆ సైట్ ఫాలో అయ్యే విదేశీ పర్యాటకులు అదే సమయానికి భారత్‌లో ఉంటే పూర్తి వివరాలు తెలుసుకున్న అనంతరం డబ్బులు చెల్లించి మరీ వివాహానికి హాజరవుతారు. ఈ ఐడియా ఏదో బాగుందే. ఈ సొమ్ముతో పెళ్లి ఖర్చులు వెనకేసుకున్నట్లు ఉంటుంది.. పెళ్లిలో ఫారినర్స్ సందడి కూడా ముచ్చటగా ఉంటుంది.