Papaya : బరువు సులభంగా తగ్గాలనుకునే వారికి…. బొప్పాయి బెటర్

బ్లడ్‌ ప్రెషర్‌ను నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. శరీరంలో పేరుకు పోయిన అదనపు కొవ్వులను కరిగించటంలో ఉపకరిస్తుంది.

Papaya

Papaya : అధిక బరువు సమస్య ఇటీవలి కాలంలో అందరిని ఇబ్బంది పెడుతుంది. బరువు తగ్గేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఏమాత్రం ఫలితం ఉండటంలేదు. మారిని జీవనశైలి, ఆహారపు అలవాట్లు, కరోనా సమయంలో ఇంటిపటునే ఉంటూ అదనంగా ఆహారం తీసుకోవటం , ఎలాంటి శారీరక వ్యాయామాలు చేయకపోవటం వంటివన్నీ అధిక బరువు పెరిగేందుకు దోహదమయ్యాయి. ఈక్రమంలో బరువును తగ్గించే పండ్లలో బొప్పాయి బాగా ఉపకరిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

బరువు తగ్గించటంలో బొప్పాయి బాగా పనిచేస్తుందని అధ్యయనాల్లో రుజువైంది. బొప్పాయిలో ఉండే ఫైబర్ ఆకలిని తగ్గిస్తుంది. జీర్ణక్రియ సాఫీగా ఉండేలా చేయటంలో దోహదపడుతుంది. కేలరీలు తక్కువగా ఉండటంతో బరువును నియంత్రిస్తుంది. బొప్పాయి పండును బ్రేక్‌ఫా్‌స్టలోనూ, స్నాక్స్‌గానూ తీసుకోవచ్చు. తీపిగా ఉండే ఈ పండులో అనేక పోషకాలు మెండుగా ఉన్నాయి. ఇందులోని కె-విటమిన్‌ వల్ల ఎముకలు బలానికి ఉపకరిస్తుంది. బొప్పాయిలో తక్కువ పీచుపదార్థంతో పాటు నీటిశాతం అధికంగా ఉంటుంది. ఇందులోని పపాయన్‌ ఎంజైమ్‌తో జీర్ణక్రియ సులువుగా జరుగుతుంది. తక్కువ కేలరీలుండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారు హ్యాపీగా ఈ పండును తినవచ్చు.

బ్లడ్‌ ప్రెషర్‌ను నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. శరీరంలో పేరుకు పోయిన అదనపు కొవ్వులను కరిగించటంలో ఉపకరిస్తుంది. దీని వల్ల వేగంగా బరువు తగ్గటానికి అవకాశం ఉంటుంది. శరీరంలో రోగనిరోధక వ్యవస్ధ బలపడుతుంది. ఒక మీడియం సైజు బొప్పాయిలో 120 కేలరీలుంటాయి. 30 గ్రాముల కార్బోహైడేట్ర్స్‌ ఉంటే ఇందులోనే 5 గ్రాముల పీచు పదార్థం, 18 గ్రాముల చక్కెర, రెండు గ్రాముల ప్రొటీన్లు ఉంటాయి. ఇది శరీరంలోని చక్కెర శాతాన్ని నియంత్రిస్తుంది. డయాబిటిస్‌ బారిన పడినవారు ఈ పండును తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

చర్మానికి బొప్పాయి చేసే మేలు అంతాఇంతాకాదు. శరీరంపై ఏర్పడే గాయాలను త్వరగా మాన్పే శక్తి ఉంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ స్కిన్‌ డామేజ్‌ కాకుండా కాపాడతాయి. చర్మం కాంతిమంతంగా ఉండేందుకు సహకరిస్తుంది. విటమిన్‌ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటికి మేలు కలిగిస్తుంది. జుట్టు ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తిని పెంచే అద్భుతమైన ఫలమిది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌తో పాటు ఫ్లేవనాయిడ్స్‌, పాలీఫినాల్స్‌ వల్ల దగ్గు, జలుబు లాంటివి దరిచేరకుండా ఉంటాయి. అయితే కొంత మందికి బొప్పాయి ఏమాత్రం పడదు. అలాంటి వారు దానిని తినకపోవటమే మంచిది.