Anxiety
Anxiety : చాలా మందిలో అప్పుడప్పుడు కొంచెం ఆందోళనగా అనిపించడం అన్నది సాధారణం. కొద్దిపాటి ఆందోళన అయితే పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు. ప్రతినిత్యం ఆందోళనతో గడుపుతుంటే మాత్రం ప్రమాదం ముంచుకొస్తుందని గ్రహించాలి. ఈ సమయంలో దైనందిన జీవితం పై తీవ్రమైన ప్రభావం ఉంటుంది. ఆ సందర్భంలో దీని నుండి బయటపడాల్సిన అవసరం ఉంది. అనేక మంది దీర్ఘకాలిక ఒత్తిడి, ఆందోళనతో బాధపడుతుంటారు. ఆందోళన, ఉద్రిక్తత, భయము, ఊపిరి ఆడకపోవడం, ఛాతీ నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. ప్రపంచంలోని అత్యంత సాధారణ మానసిక ఆరోగ్య సమస్యలలో ఆందోళన ఒకటి. కొంతమందిలో ఆందోళన అనేది థైరాయిడ్ వంటి వాటివల్ల సంభవించవచ్చు. ఆందోళనకు అసలు కారణం ఏమిటన్న విషయాన్ని గుర్తించటం మంచిది. తద్వారా ఆందోళన, ఒత్తిడిలను అధిగమించడానికి అవకాశం ఉంటుంది.
వ్యాయామం ; రెగ్యులర్ వ్యాయామం మీ శారీరక ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది. వ్యాయామాలు ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తాయి, ఇవి మానసిక స్థితిని పెంచడానికి సహాయపడతాయి. వీటి ప్రభావం ఒక్కోసారి గంటల తరబడి కొనసాగుతాయి. కాబట్టి సాధారణ ఉపశమనాన్ని పొందేందుకు ఇది గొప్ప మార్గం.
మద్యం అలవాటు తగ్గించటం ; ఆల్కహాల్ ఒక సహజ నిస్పృహకలిగిస్తుంది. ఇది శరీరాన్ని శాంతింపజేస్తుంది, అయితే దాని ప్రభావం తగ్గిన తర్వాత ,మునుపటి కంటే ఎక్కువ ఆత్రుతగా ఉంటారు. అధికమోతాదులో మద్యం సేవించటం వల్ల డిప్రెషన్‌కు దారి తీస్తుంది. మానసిక సమస్యలతో పోరాడుతున్నట్లయితే, ఆల్కహాల్ సేవించటం మానుకోవటం ఉత్తమం.
దూమపానం వదిలేయండి ; ఆల్కహాల్ లాగానే, ధూమపానం ఆందోళనల నుండి ఉపశమనం కలిగించే సమయం తక్కువగా ఉంటుంది. తరువాత ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తాయి. ధూమపానం వల్ల ఆందోళన రుగ్మత వచ్చే ప్రమాదం పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
కాఫీ,టీలు వద్దు ; కాఫీ,టీలలో ఉండే కెఫీన్ భయం ఆందోళనకు దారితీస్తుంది. దీనివల్ల ఆందోళన రుగ్మతను మరింత తీవ్రతరం అవుతుంది. కొంతమందిలో తీవ్ర భయాందోళనలను కూడా ప్రేరేపిస్తుంది. ఆందోళన స్వల్పంగా ఉంటే, కెఫిన్‌ను తగ్గించటం మంచిది. కెఫిన్‌ను పూర్తిగా నివారించడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
నిద్ర ; నిద్రలేమి తరచుగా ఆందోళనతో ముడిపడి ఉంటుంది. నిద్ర లేకపోవడం వల్ల మీ నరాలు దెబ్బతింటాయి. చిరాకుగా, ఉద్రేకం కలుగుతాయి. ఇవన్నీ ఆందోళన రుగ్మతకు దోహదం చేస్తాయి. ప్రశాతంగా విశ్రాంతి తీసుకోవడానికి సమయాన్ని వెచ్చించండి. దీని వల్ల ఆందోళన తగ్గించుకోవచ్చు.
ధ్యానం ; ధ్యానం అస్తవ్యస్తమైన ఆలోచనల నుండి మనస్సును మరల్చటంలో ధ్యానం సహాయపడుతుంది. నరాలను శాంతపరుస్తుంది. ఒత్తిడి, ఆందోళనను పోగొట్టటంలో ధ్యానం సహాయపడుతుంది. దీని వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. రోజుకు 30 నిమిషాలు ధ్యానం చేయటం వల్ల ఆందోళన నుండి బయటపడవచ్చు.
మంచి ఆహారం ; మనం తినే ఆహారం మన మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. చక్కెర అధికంగా ఉండే ఆహారం ఏమాత్రం మంచిది కాదు. దీని వల్ల ఆందోళన మరింత తీవ్రమవుతుంది. పండ్లు, కూరగాయలు మరియు లీన్ ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాన్నితీసుకోవటం వల్ల ఒత్తిడి ఆందోలనను తగ్గించుకోవచ్చు.