How to make Gur ki Chai and why it is a must have in winters
Jaggery Tea : చలికాలంలో ఉదయాన్ని టీ తాగాలను చాలా మంది కోరుకుంటారు. రోజుకు ఒక్కసారైనా టీ తాగలనుకునే వారు చలికాలంలో మాత్రం రెండు మూడు సార్లు టీలను తాగేస్తుంటారు. చలికాలంలో టీలు ఎక్కువగా తాగే వారు అందులో తీపికోసం చక్కెరకు బదులుగా బెల్లాన్ని వాడుకోవటం మంచిది. బెల్లంతోపాటుగా, ఏలుకలు, అ్లం, లవంగం కూడా టీలో వేసుకోవచ్చు. శీతాకాలంలో బెల్లంతో తయారు చేసే టీని రోజూ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
చలికాలంలో బెల్లం టీ తాగటం వల్ల ప్రయోజనాలు ;
అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు రోజూ బెల్లం టీని తాగాలి. దీంతో బరువు తగ్గుతారు. శరీరంలోని కొవ్వు కరుగుతుంది. దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు. చలికాలంలో జీర్ణక్రియ నెమ్మదిగా ఉంటుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవదు. కానీ బెల్లం టీని రోజూ తాగితే జీర్ణశక్తి పెరుగుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.
చలికాలం సీజన్‌లో దగ్గు, జలుబు సహజంగానే వస్తుంటాయి. వీటిని నివారించేందుకు రోజూ బెల్లం టీని తాగాలి. బెల్లం టీలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. అందువల్ల సీజనల్‌గా వచ్చే వ్యాధులు తగ్గుతాయి. బెల్లం టీని తాగితే చలి తీవ్రత నుంచి బయట పడవచ్చు. శరీరం వెచ్చగా ఉంటుంది. రోజూ బెల్లం టీని తీసుకోవడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. రక్తంలోని వ్యర్థాలు బయటకు పోతాయని ఆయుర్వేదం చెబుతుంది.