Jaggery Tea : ఆరోగ్యానికి మేలు…. చలికాలంలో బెల్లం టీ..

ఆయుర్వేదం చెబుతున్న ప్ర‌కారం రోజూ బెల్లం టీని తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తం శుద్ధి అవుతుంది. ర‌క్తంలోని వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోతాయి. బెల్లాన్ని పరిమితంగా తీసుకోవడమే మంచిది.

Jaggery Tea

Jaggery Tea : చాలా మందికి నిత్యం టీ, కాఫీలు తాగటం అలవాటు. నిద్ర లేస్తూనే టీ తాగటంతోనే రోజును మొదలుపెట్టే వారు చాలా మంది ఉన్నారు. అలాగే ఒత్తిడికి గురైనప్పుడు, అలసిపోయినప్పుడు, నిద్రావస్థలో ఉన్నప్పుడు, తలనొప్పి, ఇతర అనారోగ్యం బారిన పడినప్పుడు, సాధారణ పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరూ టీ తాగుతారు. ఇక ఛాయ్ ప్రియుల గురించి అయితే మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోజుకు ఐదు కప్పులకు పైగానే చాయ్‌ను తాగుతారు. అయితే టీలో షుగర్ ఉండటం వల్ల శరీరానికి ఎక్కువ క్యాలరీలు అందుతాయి. దీంతో బరువు అధికంగా పెరుగుతుంది. అయితే టీలో చక్కెరకు బదులుగా బెల్లంను చేర్చుకుంటే అధిక బరువు ముప్పు నుంచి తప్పించుకోవడంతోపాటు పలు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా మనం పొందవచ్చు.

శీతాకాలంలో చక్కెర వాడకాన్ని తగ్గించాలని నిపుణులు చెబుతున్నారు. దీని స్థానంలో బెల్లాన్ని ఆహార పదార్థాల తయారీలో వాడటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు నియంత్రణలో ఉండటంతో పాటు, ఈ కాలంలో ఎదురయ్యే వ్యాధులు, అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చు. బెల్లంలో అనేక పోష‌క ప‌దార్థాలు ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. అందువ‌ల్ల చ‌క్కెర క‌న్నా మ‌న‌కు బెల్ల‌మే ఎంతో ఎక్కువ‌గా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని వైద్యులు చెబుతుంటారు. బెల్లంలో పోష‌కాలు ఉంటాయి క‌నుక అది మ‌న‌కు మేలు చేస్తుంది. అయితే శీతాకాలంలో బెల్లంతో త‌యారు చేసే టీని రోజూ తాగ‌డం వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

ప్రయోజనాలు ;

బెల్లంలో అనేక పోష‌కాలు ఉంటాయి. దీని వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా చూసుకోవ‌చ్చు. చలికాలంలో ద‌గ్గు, జ‌లుబు స‌హ‌జంగానే వ‌స్తుంటాయి. వీటిని నివారించేందుకు రోజూ బెల్లం టీని తాగాలి. బెల్లం టీలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ వైర‌ల్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల సీజ‌నల్‌గా వ‌చ్చే వ్యాధులు త‌గ్గుతాయి. మైగ్రేన్, దీర్ఘకాలిక తలనొప్పితో బాధపడేవారు ఆవు పాలలో బెల్లం కలిపి తాగితే ఉపశమనం ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఉన్నవారు క్రమం తప్పకుండా బెల్లం టీ తీసుకోవాలి.

ఆహార పదార్థాల్లో చక్కెరకు బదులుగా బెల్లం తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. బెల్లం తినడం ఇష్టం లేనివారు దాంతో టీ చేసుకొని తాగవచ్చు. శీతాకాలంలో చక్కెర తక్కువగా తీసుకుంటే అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చు. ఈ సీజ‌న్‌లో స‌హ‌జంగానే చ‌లి ఎక్కువ‌గా ఉంటుంది. క‌నుక బెల్లం టీని తాగితే చ‌లి తీవ్ర‌త నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. శ‌రీరం వెచ్చ‌గా ఉంటుంది.

అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న వారు రోజూ బెల్లం టీని తాగాలి. దీంతో బ‌రువు త‌గ్గుతారు. శ‌రీరంలోని కొవ్వు క‌రుగుతుంది. టీలో బెల్లంతోపాటు కొద్దిగా అల్లంను కూడా చేర్చుకుంటే శరీర రోగ నిరోధక శక్తి సైతం పెరుగుతుంది. జలుబు, దగ్గు, అలర్జీ, ఫ్లూ లాంటివి తగ్గుతాయి. బెల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో ఏర్పడే ఫ్రీ ర్యాడికల్స్ చేసే నష్టాన్ని చాలావరకు తగ్గిస్తాయి.

మలబద్దకంతో బాధపడేవారికి బెల్లం ఎంతో మేలు చేస్తుంది. టీలో బెల్లంను చేర్చడం వల్ల జీర్ణ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. జీర్ణ ప్రక్రియ వేగంగా జరుగుతుంది. బెల్లంలో ఉండే ఐరన్‌తో రక్తహీనత సమస్య నుంచి కూడా మనం బయట పడవచ్చు. దీంతోపాటు శరీరంలోని అవయవాలకు రక్త సరఫరా బాగా పెరుగుతుంది. అంతేకాకుండా బెల్లం కాలేయాన్ని శుభ్రపరిచి మలినాలను బయటకు పంపుతుంది. చ‌లికాలంలో జీర్ణ‌క్రియ నెమ్మ‌దిగా ఉంటుంది. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వ‌దు. కానీ బెల్లం టీని రోజూ తాగితే జీర్ణ‌శ‌క్తి పెరుగుతుంది. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది.

ఆయుర్వేదం చెబుతున్న ప్ర‌కారం రోజూ బెల్లం టీని తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తం శుద్ధి అవుతుంది. ర‌క్తంలోని వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోతాయి. బెల్లాన్ని పరిమితంగా తీసుకోవడమే మంచిది. అవసరానికి మించి దీన్ని తీసుకుంటే లేనిపోని అనారోగ్యాలు ఎదురవుతాయి. బెల్లం అధిక వినియోగం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది.

బెల్లం టీని ఇలా త‌యారి ;

ల‌వంగాలు, యాల‌కులు, దాల్చిన చెక్క‌, న‌ల్ల మిరియాలను కొద్ది కొద్దిగా స‌మాన భాగాల్లో తీసుకోవాలి. అనంత‌రం వాటిని పెనంపై కొద్దిగా వేయించాలి. త‌రువాత పొడి చేయాలి. ఒక పాత్ర‌లో నీటిని తీసుకుని అందులో ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి మ‌రిగించాలి. అందులోనే కొద్దిగా బెల్లం పొడి కూడా వేయాలి. 10 నిమిషాల పాటు స‌న్న‌ని మంట‌పై మ‌రిగించాక‌.. స్ట‌వ్ ఆర్పి దించుకోవాలి. అనంత‌రం వ‌చ్చే టీని వ‌డ‌క‌ట్టి గోరు వెచ్చ‌గా ఉండ‌గానే తాగేయాలి. ఈ టీని రోజూ తాగ‌డం వ‌ల్ల ఆరోగ్యపరంగా ప్రయోజనకరంగా ఉంటుంది.