Green Apple : చర్మసౌందర్యానికి గ్రీన్ ఆపిల్

గ్రీన్ యాపిల్ తీసుకుని దానిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దానికి కొద్దిగా తేనె వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి ఇర‌వై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తరువాత చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

Green Apple

Green Apple : గ్రీన్ ఆపిల్ చర్మ సౌందర్యాన్ని పెంపొందించటంలో సహాయపడుతుంది. చర్మం,జుట్టు సంరక్షణకు తోడ్పడుతుంది. గ్రీన్ ఆపిల్ లోని విటమిన్ కంటెంట్ చర్మ ఛాయను పెంచుతుంది. దీంతో వివిధ రకాల చర్మవ్యాధులను నిరోధించవచ్చు. గ్రీన్ ఆపిల్ లో ఉండే యాంటీ ఆక్సిడంట్, ఫైబర్స్ దీర్ఘకాలం పాటు చర్మాన్ని యవ్వనంగా ఉంచేందుకు దోహదపడతాయి. గ్రీన్ ఆపిల్ రసంతో జుట్టుకు మసాజ్ చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది. మొఖంపై మొటిమలను నివారిస్తుంది. కళ్ళ కింద నల్లటి వలయాలను తగ్గిస్తుంది. జుట్టు పెరుగుదలతోపాటు, జుట్టు రాలటాన్ని నివారిస్తుంది.

గ్రీన్ ఆపిల్ లో విటమిన్లు ఎ, బి కాంప్లెక్స్ , సి పుష్కలంగా ఉన్నాయి, వ్యాధికారక కారకాలు, ముఖచర్మంపై అదనపు నూనెను వదిలించుకోవడానికి చర్మానికి మేలు చేస్తుంది. క్రమం తప్పకుండా యాపిల్స్ తినడం వల్ల చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. ఈ పండులోని యాంటీఆక్సిడెంట్లు చర్మ కణాల పునరుజ్జీవనాన్ని వేగవంతం చేస్తాయి.

గ్రీన్ యాపిల్ తీసుకుని దానిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దానికి కొద్దిగా తేనె వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి ఇర‌వై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తరువాత చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ముఖంపై ముడ‌త‌లు, స‌న్న‌ని గీత‌లు పోయి య‌వ్వ‌నంగా మారుతుంది.

గ్రీన్ యాపిల్ పేస్ట్ లా మార్చి ర‌సాన్ని తీయాలి. దానికి కొద్దిగా నిమ్మ‌ర‌సం యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషాల తరువాత గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని శుభ్రంగా చేసుకోవాలి. ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల మొటిమ‌లు, న‌ల్ల మ‌చ్చ‌లు క్ర‌మంగా త‌గ్గిపోతాయి.

గ్రీన్ ఆపిల్ ను డైట్‌లో చేర్చుకోవడమే కాకుండా, గ్రీన్ యాపిల్‌ను తురుముకుని మెత్తని పేస్ట్ గా మార్చి ముఖానికి అప్లై చేయడం చర్మం యొక్క సహజ pH సమతుల్యతను కాపాడుకోవచ్చు. సాధారణ చర్మ సమస్యలను దరిచేరకుండా చూసుకోవచ్చు.

గ్రీన్ యాపిల్స్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. రోజూ తీసుకుంటే, చర్మంపై అకాల వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది.

 

ట్రెండింగ్ వార్తలు