గులాబ్ జామ్ పిజ్జా…టేస్ట్ అదుర్స్

  • Publish Date - November 11, 2019 / 06:54 AM IST

కొన్నిరోజుల క్రితం స్వీట్ మాగీ, చాక్లెట్ దోస వంటి వంటకాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఆ జాబితాలోకి కొత్తరకం వంటకం ఒకటి వచ్చింది. అదేంటంటే.. గులాబ్ జామ్ పిజ్జా. ఆశ్చర్యంగా ఉందా.. కానీ నమ్మకతప్పదు. 

ప్రస్తుతం ట్విట్టర్ నుంచీ రెడ్డిట్ వరకూ అంతటా గులాబ్ జామ్ పిజ్జా గురించే టాక్. ఇలా చాలా మంది  తమ ఫ్రెండ్స్‌కి పిజ్జా ఫొటోను షేర్ చేసుకుని దాని గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. మరి ఇంతకి దాన్ని ఎవరు తయారు చేశారు? అసలు ఎందుకు చేశారు? టేస్ట్ ఎలా ఉంటుంది? అంటూ ప్రతి ఒక్కరూ రకరకాలుగా దాని గురించి మాట్లాడుకున్నారు.  

ఇక ఓ రెడ్డిట్ యూజర్ అది ఎక్కడ దొరుకుతుందని ప్రశ్నించగా.. మరో ట్విట్టర్ యూజర్ ఇలాంటి పిజ్జా తింటే అటు పిజ్జా టేస్టూ లేక, ఇటు గులాబ్ జామూన్ టేస్టూ లేక… నోరంతా పాడవుతుందని స్పందించారు. అసలా పిజ్జా ఫొటోను మొదట షేర్ చేసిందెవరో ఎవరికీ తెలియట్లేదు.