gurivinda ginjalu
Gurivinda Ginjalu : గురువింద గింజలు. పైన ఎర్రటి ఎరుపు..కింద నల్లటి నలుపు రంగులో ఆకర్షణీయంగా ఉంటాయి. తీగజాతికి చెందినది గురువింద గింజ. తాము తప్పులు చేస్తు ఇతరుల తప్పులను పెకెత్తి చూపేవారిని గురువింద గింజలతో పోలుస్తారు. గురువింద గింజలు కంసాలుల వద్ద తప్పకుండా ఉండేవి. ఎందుకంటే బంగారాన్ని ఈ గురువింద గింజలతోనే తూసేవారు కంసాలులు. పూస ఎత్తు బంగారం, రెండు పూసలు ఎత్తు బంగారం అని చెప్పేవారు. చూడడానికి ఎంతో అందంగా ఉంటే ఈ గింజలు ఇంట్లో ఉంటే చాలా మంచిదని పండితులు చెబుతుంటారు.
గురువింద గింజలు లక్ష్మీ కటాక్షన్ని కలిగిస్తాయని చెబుతారు.గురి వింద గింజల తీగ మొక్క ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. చూడడానికి అందంగా, గట్టిగా ఉండే ఈ గింజలు ప్రమాదకరమైనవని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలను ఈ గింజలకు దూరంగా ఉంచాలి. పొరపాటున ఈ గింజలను నోట్లోంచి లోపలికి వెళితే ఆ ప్రభావం నాడీ మండల వ్యవస్థపై పడుతుందని తద్వారా చలనం కోల్పోయే ప్రమాదం కూడా ఉందట. కాస్త ఎక్కువ మోతాదులో ఇవి లోపలికి వెళితే విషంగా మారి ప్రాణాపాయం కూడా కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తుంటారు.
Gurivinda Ginja : లక్ష్మీ కటాక్షాన్నిచ్చే గురివింద గింజలు .. దెబ్బకి దరిద్రం మాయం
గురివింద గింజలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమట. పూర్వ రోజుల్లో బంగారాన్ని ఈ గురువిందలతోనే తూసేవారు. పూస ఎత్తు రెండు పూసల ఎత్తు అనేవారు కంసాలులు. ఒకప్పుడు వీటిని బంగారం కొలిచేందుకు ఉపయోగించే ఈ గింజలను లక్ష్మిదేవి స్వరూపంగానూ భావించేవారు. ఈ గురివింద గింజలను కొన్ని ప్రాంతాలలో పూజల్లో కూడా ఉపయోగిస్తారు. గురువింద గింజల్ని శరీరానికి ధరిస్తే ఏ దుష్ట శక్తి మన దరి చేరకుండా ఉంటుందని నమ్ముతారు.