Baldhead
Baldness : జుట్టు అనేది స్త్రీ, పురుషల ముఖానికి అందాన్ని తెచ్చిపెడుతుంది. తలపై వెంట్రుకలు లేకపోతే ముఖంలో ఏదో వెలితి కనిపిస్తున్నట్లు ఉంటుంది. ముఖ్యంగా చాలా మందిలో బట్టతల సమస్యతో తలపై వెంట్రుకలు లేవన్న ఆత్మన్యూనతతో ఉంటారు. అలాంటి వారు తమ లోపాన్ని కప్పిపుచ్చుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు. విగ్గులు పెట్టుకోవటం, టోపిలతో తలను కవర్ చేయటం వంటివి చేస్తారు.
సాధారణంగా బట్టతల సమస్య అనేది జన్యుపరంగా వస్తుంది. మరికొందరలి వంశపారం పర్యంగా ఈ సమస్య తలెత్తవచ్చు. కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ మందులు వాడే వారిలో, హర్మోన్ల ప్రభావం వల్ల తలపై వెంట్రుకలు ఊడిపోతుంటాయి. ఆహారంలో మార్పుల కారణంగా కూడా వెంట్రుకలు ఊడిపోయి బట్టతల ఏర్పడుతుంది.
తల్లిదండ్రుల్లో ఎవరికి బట్టతల ఉన్నా సంతానానికి రావొచ్చు. ఒకవేళ వారిద్దరికీ లేకపోయినా.. వంశంలో ముందు తరాల వారికి ఉన్నాతర్వాతి తరాలకు సంక్రమించొచ్చు. జన్యు ప్రభావం అందరిపైనా ఒకే విధంగా ఉండదు. బట్టతల రావటానికి 80-90 శాతం జన్యువులు, వంశపారంపర్య లక్షణాలే కారణంగా నిపుణులు చెబుతున్నారు.
చాలా మంది తమ తలపై వెంట్రుకలు లేవని బట్టతలై పోయిందని ఇతరులు ఎమను కుంటారో అని బాధపడుతుంటారు. నలుగురిలో అవమానంగా ఫిలయ్యేవారికి ప్రస్తుతం హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చక్కని పరిష్కార మార్గంగా నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవలికాలంలో బట్టతల ఉన్నవారు చాలా మంది హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ తో బట్టతల సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని పొందుతున్నారు.
శరీరంలోని ఇతర భాగంలోనో లేదంటే తలపైన మరోప్రదేశంలోనో ఉండే వెంట్రుకలను కుదుళ్ళతో సహా సమీకరించి బట్టతల ప్రాంతంలో ట్రాన్స్ ఫ్లాంటేషన్ చేస్తారు. ఇలా పెట్టిన వెంట్రుకలు తిరిగి ఊడిపోయే అవకాశం ఉండదు. జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి. దీనివల్ల మెదడుకు ఎలాంటి హానీ కలుగదు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఇదే ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతుంది. ఈ విధానం ద్వారా బట్ట తలే కాకుండా కనుబొమ్మల వద్ద వెంట్రుకలను ట్రాన్స్ ప్లాంటేషన్ చేయవచ్చు.
ఈ ట్రాన్స్ ప్లాంటేషన్ విధానంలో నాటిన వెంట్రుకలు త్వరగా పెరుగుతాయి. సులువైన ఈ విధానంపై చాలా మందిలో అనేక అపోహలు ఉన్నాయి. అయితే దీని వల్ల ఎలాంటి దుష్పప్రభావాలు ఉండవని నిపుణులు సూచిస్తున్నారు.