బాత్రూంలో రీల్స్ లేదా షార్ట్స్ చూస్తున్నారా..? అయితే ఈ భయంకర నిజాలు మీ కోసమే..?

మనకు తెలియకుండానే బాత్రూంలో ఫోన్ చూసే అలవాటు శారీరక, మానసిక, భావోద్వేగ స్థాయిలను దెబ్బతీస్తుంది. కొద్దిసేపు రీల్స్ చూస్తూ రిలాక్స్ అవుదామని అనుకుంటే, మీరు డేంజర్ లో పడ్డట్లే...

  • Publish Date - February 11, 2025 / 01:47 PM IST

బాత్రూమ్ లో ఎక్కువ సేపు కూర్చొని మీ ఏకాగ్రత ఫోన్ లో చూస్తున్న వీడియో కంటెంట్ పై పెడితే ఏమవుతుందో వివరించారు ఆరోగ్య నిపుణులు.

  • శరీరంలో రక్తప్రసరణ సరిగ్గా జరగక, మల వ్యర్థాలు సరిగ్గా బయటకు వెళ్లక పోవడం వల్ల కాలేయం దెబ్బతింటుంది.
  • ఫోన్‌లో మునిగిపోయి మూత్రవిసర్జన సరిగా జరగకా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం నెమ్మ నెమ్మదిగా పెరుగుతుంది.
  • గంటల తరబడి టాయిలెట్ సీట్ పై కూర్చొని ఫోన్ చూస్తుంటే గూని ఏర్పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది.
  • బాత్రూంలో ఫోన్‌తో ఎక్కువ సమయం గడపడం వల్ల ఒంటరితనం కు అలవాటు పడి నలుగురితో ఎక్కువ సేపు కలువక.. సమాజం నుంచి మిమ్మల్ని దూరం చేస్తుందనే భావన మీలో కలుగుతుంది.
  • ఇంకా కొంచెం సేపు చూద్దాం అనే ఆలోచన.. గంటల తరబడి కొనసాగి అలాగని రీల్స్ లేక షార్ట్స్ చూస్తూ ఉండడం వల్ల మెదడు లోని నరాలు క్రమంగా దెబ్బతిని మీ మానసిక స్థితి పై పడుతుంది.

సొల్యూషన్ లేదా..?

బాత్రూంలోకి ఫోన్ తీసుకెళ్లే అలవాటును మానేసి, బయట ఫోన్ లో ‘అలారం టైమ్ లిమిట్’ పెట్టుకోని బెల్ రాగానే కచ్చితంగా ఆ టైం లో బయటకు రావాలి. బాత్రూం దగ్గర్లో మీకు లోపల వినపడేలా మ్యూజిక్ సిస్టమ్ ని ఏర్పాటు చేసుకొని మీకు నచ్చిన ఆడియో కంటెంట్ ని లేక మ్యూజిక్ వినడం వల్ల దీని నుండి బయట పడ వచ్చని ఆరోగ్య నిపుణులు సూచించారు.