రక్తహీనత నుంచి అర్ధరైటిస్ వరకు: మీ గోళ్లు హెల్త్ గురించి ఏం చెబుతాయంటే?

  • Publish Date - September 25, 2020 / 05:53 PM IST

fingernails health: మన బాడీకి ఏం కావాలో? ఎక్కడ లోపం ఉందో తెలుసు. అవి సంకేతాల ద్వారా చెబుతూనే ఉంటాయి. మనం వాటిని పట్టించుకోం. కారణం, అవేంటో మనకు తెలియదు. మన తిండి మనకు సరిపోకపోతే కళ్లుతిరుగుతాయి. మనం అలసిపోతే కళ్లకింద నల్లచారలొస్తాయ్. ఇవన్నీ సిగ్నల్సే.

గోళ్లకు రంగులేసి, అందంగా ఉంచుకోవడానికి ట్రైచేస్తాంకాని, అవి చెప్పే ఆరోగ్యరహస్యాలను మాత్రం తెలుసుకోవాలనుకోం. గోళ్లను మర్చిపోవద్దు. అవి మన హెల్త్ గురించి హెచ్చరించే డాక్టర్లు.

1.తెల్ల మచ్చలు (White spots)
గోళ్లమీద తెల్లమచ్చలొస్తే కాల్షియం లోపమని చాలామందికి తెలుసు. గోళ్లమీద తెల్లగా చిన్న చిన్న స్పాట్స్ కనిపిస్తే దానికర్ధం వంటికి సరిపడా జింక్, కాల్షియం లోపించినట్లు అర్ధం. నిజానికి గోళ్ల కణాల మధ్య చిన్నని గాలి బుడగులు ఇరుక్కుపోవడం వల్ల ఎర్పడుతుందని అంటారు.

2. పాలిపోయిన, నీలిరంగు గోళ్లు
మీ చేతిగోళ్లుకనుక పాలిపోయి కనిపించాయంటే దానర్ధం ఒంటికి ఐరన్ తక్కువైందనే. ఐరన్ తక్కువ అవడం వల్ల శరీరమంతటా రక్తప్రసరణ జరగడంలేదు. అదికాస్తా గోళ్లలో కనిపిస్తుంది. ఐరన్ తక్కువైందంటే రక్త హీనత (anaemia) వచ్చినట్లే.




3.పసుపురంగు గోళ్లు
ఎక్కువగా స్మోక్ చేసేవాళ్లకు వేళ్లు పసుపురంగులోకి మారతాయి. సిగిరెట్ తాగిన మరకలవి. మరి స్మోక్ చేయనివాళ్లకూ గోళ్లు యల్లో కలర్లో ఉంటే? అతనికి అర్ధరైటిస్ (arthiritis) వచ్చినట్లు గుర్తు.

గోళ్లు పసుపురంగులోకి మందంగా మారి, ఎదగకపోతే, మీ శరీరానికి ఏదో అవుతున్నట్లు గుర్తు పెట్టుకోండి.
Lung disease, లేదంటే rheumatoid arthritis వల్లకూడా yellow nails వస్తాయి.

4. గోళ్లమీద నల్లగీత లేదంటే నల్లటి మరక
మీ గళ్లను ఒకసారి చెక్ చేసుకోండి. వాటిమీద కొత్తగా నల్లటి చార ఏదైనా కనిపిస్తోందా? మీ సమాధానం అవునైతే వెంటనే డాక్టర్ దగ్గరకెళ్లండి. ఈ నల్లటి చార melanoma కావచ్చు. ప్రమాదకర స్కిన్ కేన్సర్.



అలాగని గోళ్లపై ప్రతి నల్లటి చార melanoma కాకపోవచ్చు. డాక్టర్‌ను కలవడం మంచిదికదా! ముందుగా కనిపెడితే, నయం చేయడం చాలా సులువు. ముదిరితే ప్రమాదం.

5. చిన్న గోళ్లు
ఈ Hangnails చాలా చిన్నవి. పట్టుకుంటే చాలా బాధపెడతాయి. కారణం హైడ్రేషన్ లేకపోవడం అంటారు సైంటిస్ట్‌లు. విటమిన్ ఈ, ఎఫ్‌ తీసుకొంటే సమస్య తగ్గుతుంది.



6. పొరలుగా గోళ్లు
మీ గోళ్లు చాలా సున్నితంగా పట్టుకొంటే వంగిపోయేలా ఉంటే ఆ పరిస్థితిని hapalonychia అంటారు. సరైన ప్రొటీన్స్ లేకపోవడంవల్ల గోళ్లు మరీ సాఫ్ట్‌గా మారిపోతాయ్. చేయాల్సింది ప్రొటీన్ మోతాదును ఎక్కువగా తీసుకోవాలి.

vitamin D, vitamin Aలు లోపించడం కూడా కారణం.

vitamin Dకావాలంటే ఎండలో తిరగండి. చేపలు ప్రతివారం తినండి. ఇక vitamin A కావాలంటే కేరట్, బచ్చలికూర, చిలగడదుంపలను తినాలి.

7. గోళ్లమీద చారలు
దీనికి కారణం తిండిలో సమస్యలు. విటమిన్ల లోపం. మీరు తినే భోజనంలో సల్ఫర్ తక్కువైతే గోళ్లలో స్మూత్ నెస్ తగ్గుతుంది. పాలు, నట్స్, బెర్రీలు తింటే సమస్య పోతుంది.



8. గోళ్ల చిగురు సమస్య
గోళ్లు పెలుసుగా ఉంటాయి. పట్టుకుంటే విరిగిపోతాయ్. కారణం ఏంటి? వాటర్ తక్కువగా తాగడం.గోళ్లలో 18శాతం నీరు ఉంటుంది. అదికనుక 16శాతానికి పడిపోతే అవి డ్రై అవుతాయి. విరిగిపోతాయి. మరేం చేయాలి? రెండులీటర్లు నీటిని తాగండి

zinc తగ్గడంకూడా కారణమే.