Covid Superspreaders : డబ్బున్న భారతీయులు కోవిడ్ సూపర్ స్ప్రెడర్లుగా ఎలా మారుతున్నారంటే?

సంపన్న భారతీయుల్లో చాలామంది కరోనా సూపర్ స్ప్రెడర్లుగా మారుతున్నారు. కొంతమంది నిర్లక్ష్యం కారణంగా వారికి తెలియకుండానే ఇతరులకు కరోనా వ్యాపింపజేస్తున్నారు. సామాజిక దూరంతో పాటు తప్పనిసరిగా మాస్క్ ధరించాలన్న నిబంధనలను ఖాతరు చేయలేదు.

Affluent Indians Covid Superspreaders : సంపన్న భారతీయుల్లో చాలామంది కరోనా సూపర్ స్ప్రెడర్లుగా మారుతున్నారు. కొంతమంది నిర్లక్ష్యం కారణంగా వారికి తెలియకుండానే ఇతరులకు కరోనా వ్యాపింపజేస్తున్నారు. సామాజిక దూరంతో పాటు తప్పనిసరిగా మాస్క్ ధరించాలన్న నిబంధనలను లెక్క చేయడం లేదు. ఫలితంగా ఒకరి నుంచి మరొకరికి పదుల సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. గత మార్చి మధ్యలో కోల్‌కతా స్విమ్మింగ్ క్లబ్ కోల్‌కతాలో ఇంటర్-క్లబ్ టోర్నమెంట్‌ను నిర్వహించింది. డార్ట్ స్టేషన్లు ఎయిర్ కండిషన్డ్ హాలులో బార్ ఏర్పాటు చేశారు. ఇందులో పోటీదారులు, పోటీని చూసేవారు నిర్లక్ష్యం వహించారు.

కరోనా జాగ్రత్తలు పాటించలేదు. ముక్కు, నోటిపై మాస్క్ లేదు.. సామాజిక దూరం అంతకన్నా లేదు. ఈ టోర్నమెంట్ జరిగిన కొద్ది రోజులకే పోటీలో పాల్గొన్న వారిలో చాలామందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. టోర్నమెంట్ జరిగిన ఒక వారంలోనే, కోవిడ్-పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. క్లబ్‌లలోని పలువురు సభ్యులకు ప్రకారం.. 54 మంది రాయల్ కలకత్తా గోల్ఫ్ క్లబ్ నుంచి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కలకత్తా క్రికెట్ & ఫుట్‌బాల్ క్లబ్ నుంచి తొమ్మిది, ది సాటర్డే క్లబ్ కలకత్తా ఇంటర్నేషనల్ క్లబ్ నుంచి ఆరు, డల్హౌసీ ఇన్స్టిట్యూట్ నుండి నలుగురు, టోలీగంజ్ క్లబ్ కలకత్తా పంజాబ్ క్లబ్ నుంచి ఇద్దరు, హోస్ట్ క్లబ్ నుంచి ఐదుగురిలో కరోనా పాజిటివ్ తేలింది.

గత ఆగస్టులో లాక్ డౌన్ నుంచి దశలవారీగా సడలించిన సమయంలో జైపూర్‌కు చెందిన సిధార్థ మెహతా (44) ఆయన స్నేహితులు 15 మంది, వారి జీవిత భాగస్వాములతో సహా, స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకున్నారు. సిటీ వెలుపల రిసార్ట్‌లో ఎంజాయ్ చేశారు. ఈ బృందానికి చెందిన పది మందికి వైరస్ సోకింది. ఈ ఈవెంట్ అక్కడ చిన్నపాటి సూపర్‌స్ప్రెడర్ ఈవెంట్‌గా మారింది. మెహతా ఇంట్లో, తొమ్మిది మంది పాజిటివ్ వచ్చింది. అతని భార్య, పిల్లలు, సెప్టుజేనేరియన్ తల్లిదండ్రులు, డ్రైవర్ ఇతరులు ఉన్నారు. అలా ఒకరి నుంచి ఇంట్లో ప్రతి ఒక్కరికి కరోనా సోకింది. దేశవ్యాప్తంగా 1.0 లాక్ డౌన్ నుంచి మధ్యతరగతి భారతీయుల్లో చాలామంది కోవిడ్ -19 మార్గదర్శకాలను ఉల్లంఘించారు. బర్తడే పార్టీలు సెలబ్రేట్ చేసుకోవడం నైట్ పార్టీలు జరుపుకున్నారు. ఇలాంటి వారే వ్యక్తిగత సూపర్‌స్ప్రెడర్లుగా మారిపోయారు.

ముంబైలో, 36 ఏళ్ల మేఘా మహమ్మారి మార్గదర్శకాలను అనుసరిస్తున్నారు. అంధేరిలో నివసిస్తున్న ఒక ఫ్రీలాన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎప్పుడూ బయటికి వచ్చినా మాస్క్ ధరిస్తుంటారు. సానిటైజర్ బాటిల్ వెంట తీసుకెళ్తుంటారు. గత ఆగస్టులో తన స్నేహితుడు ఇంట్లో గణేష్ పూజలకు వెళ్లిన సమయంలో చాలామందికి కరోనా సోకింది. రెండు పడకగదిల ఫ్లాట్‌లో 10 మంది పూజ కోసం కూర్చున్నారు.

ఆపై కలిసి భోజనం చేశారు. పూజ తర్వాత వారిలో 8 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అదేవిధంగా బార్లు, జిమ్ లు కూడా కరోనా సూపర్ స్ప్రెడర్లకు కారణమైందనే చెప్పాలి. జిమ్ లకు వెళ్లేవారంతా మాస్క్ లేకుండా వెళ్లడం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాపించడానికి కారణమయ్యారు. ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్‌లలో పార్టీలు చేసుకున్నారు. రెస్టారెంట్లకు వెళ్లారు.. వేడుకలు జరుపుకున్నారు. న్యూ ఇయర్ సమయంలో నిర్లక్ష్యం వహించడం కారణంగా చాలామందిలో కరోనా కేసులకు దారితీసిందని డాక్టర్ మిథల్ తెలిపారు.

మహమ్మారి అంతమైనట్టు కాదు :
ఈ ఏడాదిలో మొదటి మూడు నెలల్లో, కేసుల సంఖ్య తగ్గడంతో కొంత ఊరటనిచ్చింది. వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో ప్రజల్లో కాస్తా ధైర్యం కనిపించింది. ఇక కరోనా పనై పోయిందిలే అనుకున్నారంతా.. అంతలోనే మహమ్మారి సెకండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. మొదటి వేవ్ కంటే రెండో వేవ్ అత్యంత ప్రమాదకరంగా మారింది. నైట్ క్లబ్ లు, పబ్బులు, బార్ లన్నీ బిజీగా మారాయి. అక్కడి వారంతా వైరస్ బారిన పడ్డారు. దేశవ్యాప్తంగా కోవిడ్ -19 తీవ్రవ్యాప్తికి అనేక కారణాలు ఉన్నాయి. ఒక విషయం చెప్పుకోకతప్పదు.. సంపన్న, మధ్యతరగతి భారతీయులు కోవిడ్ -19 ప్రోటోకాల్‌లను తరచూ ఉల్లంఘించారు.

ట్రెండింగ్ వార్తలు