కరోనా సమయంలో మీ ఫోన్‌‌పై వైరస్ ఉండొచ్చు.. ఇన్ఫెక్షన్లు రాకుండా ఇలా క్లీన్ చేసుకోండి!

  • Publish Date - June 9, 2020 / 11:17 AM IST

కరోనా వైరస్ ప్రభావంతో ప్రతిఒక్కరూ తమ చేతులను శానిటైజ్ చేయడం కామన్ అయిపోయింది. ప్రతి పనికి ముందు తర్వాత చేతులను శుభ్రంగా కడిగేసుకుంటున్నారు. చేతుల్లానే డివైజ్‌లను శానిటైజ్ చేయాల్సి అవసరం ఉంది. కానీ, డివైజ్‌లను శానిటైజ్ చేసే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. 20 సెకన్ల పాటు చేతులు కడిగినట్టుగా డివైజ్ లను క్లీన్ చేయడం కుదరని పని. మరి.. మీ ఫోన్లు, ట్యాబ్లెట్లు, పనిచేసే డివైజ్‌లను ఎలా క్లీన్ చేస్తున్నారు. మీరు పనిచేసే కంప్యూటర్, ల్యాప్ టాప్, కీబోర్డు లేదా మౌస్ చివరిసారిగా ఎప్పుడు క్లీన్ చేశారు? Journal of Hospital Infectionలో ప్రచురించిన ఓ కొత్త అధ్యయనం ప్రకారం.. 22 అధ్యయనాలను విశ్లేషించిన తర్వాత కరోనా వైరస్ ఉపరితలాలపై 9 రోజుల వరకు ఉంటుందని గుర్తించాయి. టాయిలెట్ సీట్ (గ్రిమ్)పై ఉండే బ్యాక్టిరియా కంటే మన ఫోన్లపైనే 10 సార్లు అత్యధికంగా బ్యాక్టిరియా ఉంటుందని గత అధ్యయనంలో తేలింది. అంటే.. మనం వాడే డివైజ్ లను కూడా తప్పనిసరిగా క్లీన్ చేసుకోవాల్సిందే.

University of Southampton కు చెందిన ప్రొఫెసర్ William Keevil మాట్లాడుతూ.. మీ చేతులను శుభ్రం చేసుకోండి. కానీ, మీ ఫోన్ స్ర్కీన్ టచ్ చేయడం.. ముఖంపై చేతులు పెట్టుకోవడం కారణంగా వైరస్ ఇన్ఫెక్షన్ సోకుతుందని హెచ్చరిస్తున్నారు. Public Health England (PHE) అధికారిక సూచన ప్రకారం.. యూకేలో కరోనా సంబంధించి అన్ని విషయాల్లో క్లీనింగ్ చేస్తున్నారు. తాకిన ప్రతి వస్తువులను తరచుగా క్లీన్ చేయడం అలవాటు చేసుకోవాలి. రోజులో రెండు సార్లు ఇలా తమ వస్తువులను క్లీన్ చేసుకోవడం ద్వారా వైరస్ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చు. ఇథనాల్ 62-71శాతం, హైడ్రోజిన్ పెరాక్సైడ్ లేదా 0.1 సోడియం హైపోక్లోరైడ్ ఒక నిమిషంలోనే ఉపరితలంపై ఉన్న బ్యాక్టిరియాపై సమర్థవంతంగా పనిచేస్తుంది. కొన్ని తరహా లిక్విడ్‌ల కారణంగా స్మార్ట్ ఫోన్లపై ఉండే ఫింగర్ ఫ్రింట్ రిసిస్టెంట్ కోటింగ్స్ దెబ్బతినే అవకాశం ఉంది. ఇంతకీ దీనికి పరిష్కారం ఏంటి? 

ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్.. సుతిమెత్తని క్లాత్‌తో ఫోన్ డివైజ్‌లను క్లీనింగ్ చేసుకోవాలి. ముందుగా ఫోన్ స్విచ్చాఫ్ చేయాలి. గోరువెచ్చని సబ్బు నీళ్లలో ముంచిన క్లాత్‌తో ఫోన్ స్ర్కీన్‌ తుడవాలి. ఛార్జింగ్ పోర్ట్ లోపలికి లిక్విడ్ వెళ్లకుండా జాగ్రత్త పడాలి. గాఢమైన ఆల్కహాల్ ఆధారిత ప్రొడక్టులతోనే వైరస్ లను నాశనం చేయగలం. చౌకైన స్ర్కీన్ ప్రొటెక్టర్ Clorox లేదా Lysol wipes ఉపయోగించి మీ స్మార్ట్ ఫోన్లను క్లీన్ చేసుకోవాలి. ముందు వెనుక మాత్రమే శుభ్రపరచాలి.. పోర్టులు ఉన్న ప్రాంతంలో లిక్విడ్ తో శుభ్రం చేయరాదు. మీ చేతులు శుభ్రపరిచిన తర్వాత మళ్లీ స్మార్ట్ ఫోన్ స్ర్కీన్ టచ్ చేయొద్దు. అలా చేస్తే వెంటనే చేతులు క్లీన్ చేసుకోండి. ఆ తర్వాతే ఆహార పదార్థాలను తీసుకోండి. 60 శాతం ఆల్కహాల్ + శానిటైజర్, హైడ్రోజన్ పెరాక్సైడ్ లేదా బ్లీచ్ ఆధారిత క్లీనర్లు ఉపరితలాలపై ఉన్న కరోనా వైరస్ ను నిరోధించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. సాధ్యమైనంత వరకు తరచుగా చేతులను శుభ్రంగా ఉంచుకునేందుకు ప్రయత్నించండి. 

Read: అమ్మాయిల మనసును లాక్‌డౌన్ మార్చేసింది…రొమాంటిక్ కాదు, కేరింగ్ మగాళ్లే కావాలంట