ఇప్పుడంతా సోషల్ మీడియాదే ట్రెండ్. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతిఒక్కరికి ఫేస్ బుక్ కామన్ అయింది. ఫేస్‌బుక్ ప్లాట్ ఫాంపైనే గంటల కొద్ది గడిపేస్తున్నారు. స్నేహితులతో చాటింగ్ కావొచ్చు. ఫ్యామిలీతో కావొచ్చు.. అదేపనిగా పోస్టులు, వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తుంటారు.
న్యూస్ ఫీడ్ లో కనిపించే పోస్టులకు లైకులు కొడుతారు. కామెంట్లు చేస్తుంటారు. మీ ఫేస్ బుక్ అకౌంట్లో మీరు పోస్టు చేసే పర్సనల్ ఫొటోలు, వీడియోలన్నీ ఒకచోట డేటా స్టోర్ అవుతాయని తెలుసు. ఇటీవల ఫేస్ బుక్ ప్లాట్ ఫాం యూజర్ల ప్రైవసీ పరంగా ఎన్నో సమస్యలు తలెత్తిన సంగతి తెలిసిందే.
మీ ఫేస్ బుక్ అకౌంట్లో మీరు సెర్చ్ చేసే ప్రతి విషయం ఆయా సైటులో రికార్డు అవుతుందని మీకు తెలుసా? క్రానోలాజికల్ ఆర్డర్ లో ప్రతి అకౌంట్లో Activity Logఅని ఉంటుంది. మీరు ఫేస్ బుక్ అకౌంట్లో సెర్చ్ చేసే ప్రతిది అక్కడే రికార్డు అవుతుంది.
నిజానికి ఈ Activity Logను యూజర్లు ఈజీగా తమ పోస్టులను గుర్తించేందుకు వీలుంటుంది. ఏ కామెంట్ చేసినా లేదా పోస్టు చేసినా, లైకులు అన్ని ఇక్కడే కనిపిస్తాయి. గతంలో మీరు ఏ పోస్టు పెట్టారు, ఏమని సెర్చ్ చేశారు.. ఏం పోస్టు, వీడియోలు, ఫొటోలు షేర్ చేశారో కూడా ఇక్కడే చెక్ చేసుకోవచ్చు.ఫేస్ బుక్ అకౌంట్‌పై మీ యాక్టివిటీ మొత్తం మినిట్ టూ మినిట్ అంతా రికార్డు అవుతుంది.
మీరు ఫేస్ బుక్ అకౌంట్ క్రియేట్ చేసినప్పటినుంచి ఇప్పటివరకూ ఎలాంటి యాక్టివిటీ జరిగిందో మొత్తం తెలిసిపోతుంది. ఈ డేటా మొత్తాన్ని డిలీట్ చేసుకోవడం కుదురదా? అంటే తప్పక కుదురుతుంది. అలాగే సెర్చ్ చేసిన హిస్టరీ కూడా మొత్తం డిలీట్ చేసుకోవచ్చు. ఒకేసారి మొత్తం డేటాను డిలీట్ చేసుకోవచ్చు లేదంటే.. అవసరం లేదనుకున్న డేటాను మాత్రమే ఒక్కొక్కటిగా కూడా డిలీట్ చేసుకునే వీలుంది. ఇంతకీ.. Activity Log నుంచి మీ సెర్చింగ్ డేటాను ఎలా డిలీట్ చేయాలో చూద్దాం.
ఇదిగో ప్రాసెస్ :
* మీ Facebook అకౌంట్లో (PC లేదా Mac) Login అవ్వండి.
* టాప్ రైట్ కార్నర్ లో Downward Arrowపై Click చేయండి.
* Drop Menu కనిపిస్తుంది.. అందులో Activity Logపై Click చేయండి.
* పోస్టులకు కుడిభాగంలో Pencil ఐకాన్ ఉంటుంది. Click చేయండి.
* Delete అనే బటన్‌పై క్లిక్ చేస్తే చాలు… అన్ని డిలీట్ అయిపోతాయి.
* మీరు ఏది డిలీట్ చేస్తే అది మాత్రమే డిలీట్ అవుతుంది.
FB search history ఎలా డిలీట్ చేయాలంటే? :
* ఫేస్ బుక్ సెర్చ్ హిస్టరీ మొత్తం డిలీట్ చేసుకునే సదుపాయం ఉంది.
* Activity Log పేజీలోనే Left side Lableలో Comments ఆప్షన్ ఉంటుంది.
* Comements సెక్షన్ కింద MORE అనే ఆప్షన్‌పై Click చేయండి.
* Search history అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై Click చేయండి.
* సెర్చ్ హిస్టరీ ట్యాబ్ టాప్ రైట్ కార్నర్ పై Clear Searches అని ఉంటుంది.
* ఇక్కడ Click చేయగానే.. Are You Sure? అనే Pop Up వస్తుంది.
* Clear Searches బటన్‌పై క్లిక్ చేయండి.
* మీరు సెర్చింగ్ డేటా మొత్తం ఒకేసారి డిలీట్ అయిపోతుంది.