Birds Migrate Distances : పక్షులు సుదీర్ఘ ప్రయాణాలు ఎలా చేస్తాయ్? మిస్టరీ తేల్చిన సైంటిస్టులు

పక్షులు సాధారణంగా ఒక చోట నుంచి మరో చోటుకు ఎగురుతూ వలసవెళ్లడం కామన్. అది కూడా ఆహార అన్వేషణ కోసమేనేది అందరికి తెలిసిందే. కాలానికి అనుగుణంగా లభించే ఆహారం కోసం ఇలా పక్షులు సుదూర ప్రాంతాలకు వలస వెళ్తుంటాయి.

Birds Migrate Long Distances : పక్షులు సాధారణంగా ఒక చోట నుంచి మరో చోటుకు ఎగురుతూ వలసవెళ్లడం కామన్. అది కూడా ఆహార అన్వేషణ కోసమేనేది అందరికి తెలిసిందే. కాలానికి అనుగుణంగా లభించే ఆహారం కోసం ఇలా పక్షులు సుదూర ప్రాంతాలకు వలస వెళ్తుంటాయి. అయితే.. పక్షులు ఆకాశంలో సుదీర్ఘ దూర ప్రయాణాలు ఎలా చేయగలవు అనేది అంతుపట్టని మిస్టరీగా ఉంది. అయితే ఇప్పుడు ఆ రహస్యాన్ని డికోడ్ చేసేశారు సైంటిస్టులు.

2020లో భారతీయ ప్రాంతాల్లో శీతాకాల సీజన్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 జాతుల పక్షులు వలసవచ్చాయి. ఆవాసంతో పాటు ఆహార అన్వేషణలో వలస వచ్చాయి. ఈ వలస పక్షులు.. వేలాది కిలోమీటర్లు నదులు, సముద్రాలు, పర్వతాలను దాటుకుని ఎగురుతుంటాయి. ప్రతి ఏడాదిలో వలస పక్షలు ఒకచోట నుంచి మరో చోటుకు ప్రయాణిస్తుంటాయి. ఇంతకీ ఆకాశంలో వీటికి మార్గం ఎలా తెలుస్తుంది.. విమానానికి అయితే రాడర్ సిగ్నల్ ఉంటుంది.. దాని ఆధారంగా నిర్దేశించిన గమ్యానికి సరైన సమయంలో చేరుతుంది. మరి పక్షలు ఎలా తమ గమ్యాన్ని చేరుతాయి. మార్గాన్ని ఎలా అన్వేషిస్తాయి అనేదానిపై సైంటిస్టులు కొత్త అధ్యయనాన్ని నిర్వహించారు.

భూమి అయస్కాంత క్షేత్రాన్ని గ్రహించగల సామర్థ్యం పక్షులకు ఉంటుందని తేలింది. సుదూర ప్రయాణంలో వాటిని నిర్దేశించే దిక్సూచిగా పనిచేస్తుంది. పక్షులు వాటి రెటినాస్‌లోని క్రిప్టోక్రోమ్స్ అయస్కాంతపరంగా సున్నితమైన ప్రోటీన్‌లుగా పనిచేస్తాయి. వీటి సాయంతోనే సెన్సింగ్ సిగ్నలింగ్ చేస్తుంటాయి. సుదూరాలకు వెళ్లే మార్గాన్ని నావిగేట్ చేస్తుంటాయి. వలస పక్షులు వాతావరణంలోని మార్పును ఎలా గ్రహించాలో, ఎప్పుడు వలస వెళ్లాలో.. ఏ మార్గాన్ని అనుసరించాలో గుర్తిస్తాయి.

ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ, జర్మనీలోని ఓల్డెన్బర్గ్ యూనివర్శిటీ పరిశోధకులు రాబిన్స్‌ను అధ్యయనం చేశారు. పక్షల గమనాన్ని నావిగేట్ చేసేందుకు అంతర్నిర్మిత లివింగ్ దిక్సూచి‌ను విశ్లేషించారు. అయస్కాంత సెన్సార్లను కలిగి ఉందో లేదో గుర్తించారు. అలాగే పక్షులకు అధిక అయస్కాంత సున్నితత్వం సామర్థ్యాన్ని కలిగి ఉందని కనుగొన్నారు.

ట్రెండింగ్ వార్తలు