Hair Washing : మహిళలు తలంటుస్నానం ఎన్నిరోజులకు ఒకసారి చేయాలి? ఎలాంటి షాంపులను ఎంచుకోవాలంటే ?

పొడి జుట్టు ఉన్నవారు ప్రతిరోజూ తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. తరచుగా స్నానంచేయటం వల్ల స్కాల్ప్‌లోని సహజ నూనెలు సంరక్షించబడతాయి. జుట్టును బాగా తేమగా ఉంచుకోవచ్చు.

Hair Washing : మహిళలకు జుట్టు సంరక్షణ అనేది అత్యంత ముఖ్యమైనది. తలంటు స్నానం చేయటానికి వైద్యపరమైన కారణం కూడా ఉంది. తలస్నానం ఏప్పుడు చేయాలన్నది జుట్టు రకం, స్కాల్ప్ ఆకృతి, జుట్టు ఎంత జిడ్డుగా ఉంటుంది, అంతేకాకుండా వ్యక్తిగత ప్రాధాన్యతపై ఆధారపడి ఉంటుంది. కొంతమందికి, చాలా తరచుగా తలస్నానం చేయటంవల్ల జుట్టు దెబ్బతినటం, పొడి, దురద స్కాల్ప్ ఏర్పడవచ్చు. అంతేకాకుండా చూసేవారికి జిడ్డుగా మరియు నిర్జీవంగా కనిపిస్తుంది.

జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే షాంపు ఉపయోగించాల్సిన అవసరం లేదు. కేవలం వారానికి కొన్ని సార్లు జుట్టును నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల మురికి మరియు వ్యర్థాలు తొలగిపోతాయి. జుట్టును ఎంత తరచుగా కడగాలి అనే నిర్ణయం వ్యక్తిగత ప్రాధాన్యతపై ఆధారపడి ఉంటుంది. సిల్కీ హెయిర్‌ అయినా, ఉంగరాల జుట్టు కలిగిన వారైనా, ఎలాంటి జుట్టున్న వారైనా తలస్నానం చేసే విషయంలో అందరూ ఒకే పద్ధతిని అనుసరిస్తుంటారు. కొందరు రెండు, మూడు రోజులకోసారి తలస్నానం చేస్తే, మరికొందరు వారానికోసారి మాత్రమే తలస్నానం చేస్తుంటారు. అయితే జుట్టు రకాన్ని బట్టి తలస్నానం చేసే విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు.

పొడి జుట్టు ఉన్నవారు ప్రతిరోజూ తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. తరచుగా స్నానంచేయటం వల్ల స్కాల్ప్‌లోని సహజ నూనెలు సంరక్షించబడతాయి. జుట్టును బాగా తేమగా ఉంచుకోవచ్చు. పొడి జుట్టు ఉన్నవారికి వారానికోసారి, ప్రతి వారం తలస్నానంచేయటం మంచిది. జుట్టును మధ్యమధ్యలో నీళ్లతో కడుక్కోవడం వల్ల జుట్టు తేమ పోకుండా తాజాగా కనిపిస్తుంది.

జిడ్డుగల జుట్టు తలస్నానం చేసిన కొన్ని గంటల తర్వాత, ముఖ్యంగా వేసవిలో లేదా వ్యాయామం తర్వాత జిడ్డుగా కనిపించవచ్చు. జిడ్డుగల జుట్టు ఉన్న వ్యక్తులు ప్రతిరోజూ తలస్నానం చేయటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. యుక్తవయస్సుతోపాటు, హార్మోన్ల మార్పులకు గురైన వ్యక్తులు, వారి జుట్టు సాధారణం కంటే జిడ్డుగా మారుతుంది. ఇలాంటి వారు వారి వ్యక్తిగత ప్రాధాన్యత ఆధారంగా వారానికి 2 నుండి 5 సార్లు తలంటు స్నానం చేయవచ్చు.

పొడిబారిన జుట్టు ఉన్న వారి సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఇలాంటి జుట్టున్న వారు తమ కేశాలకు రంగు వేసుకున్నా, హెయిర్ డ్రయర్స్‌ వాడినా జుట్టు గడ్డిలా మారడం, కుదుళ్లలో దురద, అలర్జీలు రావడం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పొడి జుట్టు ఉన్న వారు వారానికి రెండు సార్లు తలస్నానం చేయడంతోపాటు, గోరువెచ్చటి నీళ్లను ఎంచుకోవడం మంచిది. ఫలితంగా కుదుళ్లు బలహీనపడడం, జుట్టు పొడిబారడం, చిట్లిపోవడం.. వంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడచ్చు.

తలస్నానం చేసేందుకు గాఢత తక్కువగా ఉండే షాంపూలను ఎంచుకుంటే జుట్టుకు ఎలాంటి డ్యామేజ్‌ జరగదు. గాఢత తక్కువగా ఉండే షాంపూతో వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే తలస్నానం చేయడం మంచిది. అలాగే కురులు తేమను కోల్పోకుండా పట్టులా ఉండాలంటే తలస్నానం చేసే గంట లేదా రెండు గంటల ముందు జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు నూనెతో మసాజ్ చేయాలి. జుట్టు ఆరోగ్యం కోసం రోజువారిగా నీళ్లు ఎక్కువగా తాగడం, నీటి శాతం అధికంగా ఉండే పండ్లు,కాయగూరల్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కూడా కొంత వరకు ఫలితం ఉంటుంది.

 

ట్రెండింగ్ వార్తలు