Protein Foods
Body Protein : మనిషి శరీరానికి ప్రోటీన్ అవసరమైన పోషకం. రోజు వారి ఆహారంలో తగినంత ప్రొటీన్ ను తీసుకోవడం చాలా అవసరం. శరీరంలో ప్రొటీన్ కొరత ఏర్పడితే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మాంసాహారం ద్వారా ఎక్కవగా ప్రొటీన్ లభ్యమౌతుంది. చికెన్, ఎగ్ ,మీట్ వంటివాటిని ప్రొటీన్ కోసం ఆహారంగా తీసుకోవచ్చు వీటితోపాటు సీ ఫుడ్స్ ద్వారా ప్రోటీన్ ను అధికంగా లభిస్తుంది. అంతేకాకుండా డైరీ ప్రొడక్ట్స్‌తో పాటుగా వివిధ రకాల దాన్యాలు, సోయా, సెనగలు, బీన్స్, గింజలు మొదలు పప్పు దినుసుల ద్వారా ప్రొటీన్ లభిస్తుంది. శాఖాహారులు ఈ తరహా ఆహారాలను తీసుకోవటం ద్వారా శరీరానికి కావాల్సిన ప్రొటీన్ ను పొందవచ్చు.
ప్రోటీన్ లోపం ఏర్పడితే శరీరంలో ఓపిక నశిస్తుంది. నీరసంగా అనిపించడం వంటి లక్షణాలు ఉంటాయి. వీటితోపాటు ఒత్తిడి, ఆందోళన వంటివాటిని ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్బోహైడ్రేట్లు, పంచదార వంటి వాటిని ఎక్కువగా తినాలని అనిపిస్తుంది. ప్రొటీన్ లోపిస్తే డొపమైన్ మరియు సెరోటిన్ అనేటువంటి హార్మోన్స్ సరైన మోతాదులో ఉత్పత్తికాకపోవటంతో మెదడు పనితీరు దెబ్బతింటుంది. మానసికంగా ఆరోగ్యసమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. చర్మం, జుట్టు మరియు గోర్లకు సంబంధించిన సమస్యలు. జుట్టు రాలడం, పల్చబడడం, చర్మం పొడిబారి పోవడం వంటి లక్షణాలు కనబడతాయి.
ప్రొటీన్ లోపం కారణంగా కాళ్లు, పాదాల వాయటం, కడుపులో నీరు చేరటం వంటి సమస్యలు ఎదురవుతాయి. మజిల్స్ పెంచుకునేందుకు చాలా మంది తమకు తాముగా వైద్యుని సలహా పాటించకుండా ప్రొటీన్ సప్లిమెంట్స్ తీసుకుంటారు. ఇలా చేయటం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటిని వినియోంచే ముందుకు వైద్యుని సూచనలు సలహాలు పాటించటం మంచిది. ప్రొటీన్ కలిగిన ఆహారం తీసుకోవటం వల్ల ఎక్కవసేపు ఆకలి కలగకుండా ఉండవచ్చు. కడుపు నిండిన భావన తో ఎక్కవ తినలేరు. దీని వల్ల బరువు పెరగకుండా చూసుకోవచ్చు. ప్రొటీన్ బరువు తగ్గించటంలో సహాయపడటంతోపాటు గుండెరుగ్మతలను నివారిస్తుంది. ప్రొటీన్ తీసుకోవడం మంచిదే అయితే అది తగు మోతాదులో మాత్రమె ఉండాలి. ప్రోటీన్ ను అధికంగా తీసుకోవడం కూడా శరీరానికి అంత మంచిది కాదు.
ప్రొటీన్ల పాత్ర ;
చర్మం కోసం: చర్మం యొక్క ఎలాస్టిసిటీ ను కాపాడటానికి ప్రోటీన్లు అవసరం. ముఖపు ముడుతలను నివారించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కొల్లాజెన్, ఒక నిర్మాణాత్మక ప్రోటీన్ ఇది గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది. రాపిడి వలనకలిగే పుండ్లు, డయాబెటిక్ అల్సర్స్, కాలిన గాయాలు, సెల్యులైట్ నిర్వహణకు కూడా ఉపయోగపడతాయి.
జుట్టు కోసం: జుట్టు ఆరోగ్యానికి ప్రోటీన్లు ముఖ్యమైనవి. ప్రోటీన్ల లోపం కొల్లాజెన్‌లో నిర్మాణాత్మక మార్పులకు కారణమవుతుంది, ఇది జుట్టు రాలడానికి, జుట్టు పలుచబడానికి దారితీస్తుంది.
పిల్లలకు: ప్రోటీన్లు శరీరం పెరుగుదలకు, అభివృద్ధికి సహాయపడతాయి, బాల్యంలో వచ్చే ఇన్ఫెక్షన్లు, అనారోగ్యాలు , బలహీనమైన ఎముకల వంటి వాటిని నివారించడానికి పిల్లల ఆహారంలో ప్రొటీన్ తప్పనిసరిగా చేర్చాల్సిన అవసరం ఉంది.
బరువు తగ్గడానికి: ప్రోటీన్లు శరీర కండర నిర్మాణాన్ని మెరుగుపరుస్తాయి. కొవ్వుల తగ్గించడంలో సహాయపడతాయి, న్యూరోట్రాన్న్మిటర్లు ఏర్పడటానికి ప్రోటీన్లు చాలా ముఖ్యమైనవి. సరైన మెదడు పనితీరుకు ఇవి అవసరం. ముఖ్యంగా మహిళల్లో గుండె సంబంధిత రుగ్మతల ప్రమాదాన్ని ప్రోటీన్లు తగ్గిస్తాయని కనుగొన్నారు.