Protein (1)
Protein : మన శరీరానికి అవసరం అయిన అనేక పోషకాల్లో ప్రోటీన్లు ఒకటి. ఇవి స్థూల పోషకాల జాబితాకు చెందుతాయి. జీవక్రియల పనితీరుకు, కండరాల దృఢత్వానికి ప్రొటీన్లు ఎంతో అవసరం. అలాగే గుండె పదిలంగా ఉండేందుకు, రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ ఇవి దోహదం చేస్తాయి. అయితే ప్రొటీన్లను ఎక్కువగా తీసుకుంటే బరువు పెరుగుతారని, కిడ్నీ సంబంధిత సమస్యలొస్తాయని, కండరాల పరిమాణం పెరిగి అబ్బాయిలా కనిపిస్తామేమోనని.. ఇలా ప్రొటీన్ల విషయంలో చాలామందిలో ఎన్నో అపోహలున్నాయి. ఫలితంగా ఎంతోమంది వీటిని దూరం పెడుతున్నారు. చివరకు ప్రొటీన్ల లోపంతో పలు అనారోగ్యాల్ని కొని తెచ్చుకుంటున్నారు.
ప్రోటీన్లను తీసుకోవడం వల్ల మన శరీరంలో అనేక క్రియలు సక్రమంగా నిర్వర్తించబడతాయి. ప్రోటీన్ల వల్ల కండరాల నిర్మాణం జరుగుతుంది. కణజాలాలు మరమ్మత్తులకు గురవుతాయి. మన శరీరంలో ఆహారం సరిగ్గా జీర్ణం అయ్యేందుకు, శక్తి ఉత్పత్తి అయ్యేందుకు, కండరాల పనితీరుకు, గాయాలు అయినప్పుడు రక్తం గడ్డ కట్టేందుకు.. మనకు ప్రోటీన్లు అవసరం అవుతాయి. అందువల్ల ప్రోటీన్లను మనం రోజూ తీసుకోవాల్సి ఉంటుంది.
ఇక రోజుకు మనకు ఎంత ప్రోటీన్ అవసరం ఉంటుంది అంటే.. ఎవరైనా సరే తమ శరీర బరువులో 1 కిలో బరువుకు సుమారుగా 0.75 గ్రాముల ప్రోటీన్లను తీసుకోవాల్సి ఉంటుంది. అంటే.. 75 కిలోలు ఉన్న ఒక వ్యక్తి రోజుకు దాదాపుగా 75 x 0.75 = 56.25 గ్రాముల ప్రోటీన్లను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎవరికి వారు తమ శరీర బరువును బట్టి రోజుకు ఎంత మేర ప్రోటీన్లను తీసుకోవాలో అంచనా వేసుకోవచ్చు.
ప్రొటీన్లు శరీరానికి అత్యవసరమైన సూక్ష్మ పోషకాలు. శరీర నిర్మాణంలో.. ముఖ్యంగా ఎముకలు, కండరాలను, కీళ్లను బలోపేతం చేయడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. అందుకే ఎదిగే పిల్లలకు ఈ పోషకాలు ఎంతో అవసరం. వివిధ ప్రమాదాల కారణంగా శరీరంలోని కణజాలాలు దెబ్బతిన్నప్పుడు వాటిని బాగు చేయడంలో ప్రొటీన్లు బాగా తోడ్పడతాయి. దీనివల్ల త్వరగా కోలుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇక శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్ సరఫరా చేయడంలోనూ ఇవి కీలకంగా వ్యవహరిస్తాయి. కాబట్టి అన్ని వయసుల వారూ ప్రొటీన్ అధికంగా ఉండే పదార్థాల్ని ఆహారంలో భాగం చేసుకోవాలి..
ఇక ప్రోటీన్లు మనకు ఎక్కువగా చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, ఇతర సముద్రపు ఆహారం, పప్పు దినుసులు, బాదంపప్పు, పిస్తా, వాల్ నట్స్, జీడిపప్పు, పాలు, పాల ఉత్పత్తులు, కోడిగుడ్లు, శనగలు, పచ్చి బఠానీలు, పెసలు తదితర ఆహారాల్లో లభిస్తాయి. కనుక వీటిని రోజూ తీసుకుంటుంటే ప్రోటీన్లు శరీరానికి తగినన్ని అందుతాయి.