Physical Activity : యువకులు, వృద్ధులు రోజువారిగా ఎంత సమయం రన్నింగ్ చెయ్యొచ్చు ? నిపుణులు ఏంసూచిస్తున్నారంటే ?

గుండెపోటు, స్ట్రోకులు మరియు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల నుండి మరణ ప్రమాదాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. ప్రస్తుత రోజుల్లో నిశ్చల జీవనశైలి కారణంగా తలెత్తే అనారోగ్య సమస్యల నుండి తప్పించుకునేందుకు రన్నింగ్ ఉపకరిస్తుంది.

Physical Activity : ఏరోబిక్ వ్యాయామాలలో రన్నింగ్ అనేది చాలా ప్రభావ వంతమైనది. అధ్యయనాల ప్రకారం ప్రతిరోజూ 5-10 నిమిషాలు మితమైన వేగంతో పరిగెత్తడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. గుండెపోటు, స్ట్రోకులు మరియు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల నుండి మరణ ప్రమాదాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. ప్రస్తుత రోజుల్లో నిశ్చల జీవనశైలి కారణంగా తలెత్తే అనారోగ్య సమస్యల నుండి తప్పించుకునేందుకు రన్నింగ్ ఉపకరిస్తుంది. అనేక ఇతర వ్యాయామాల మాదిరిగానే, ఇది జీవనశైలి యొక్క ప్రతికూల ప్రభావాలను తిప్పికొడుతుంది.

READ ALSO : Walking : కడుపునిండా తిని వాకింగ్ చేస్తున్నారా!

ఇందుకోసం మీకు కావలసిందల్లా మంచి జత బూట్లు , రన్నింగ్ ను దినచర్యలో భాగంగా చేసుకోవాలనే సంకల్పం. ఇవి ఉంటే చాలు. రన్నింగ్ ను తొలిసారి ప్రారంభిస్తున్న వ్యక్తులకు నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. మొదట్లో 10-30 సెకన్ల పాటు పరుగెత్తడం ప్రారంభించండి, ఆపై 1-2 నిమిషాలు నడవాలి. శరీరం పరుగు అలవాటు చేసుకునే వరకు దాన్ని పునరావృతం చేయ్యాలి. అలాగే, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తప్పనిసరిగా పరుగును కొనసాగించే ముందు ఆరోగ్య నిపుణులను సంప్రదించాలి.

మనం ఎందుకు పరుగెత్తాలి?

రన్నింగ్ అనేది ఏరోబిక్ వ్యాయామం. రన్నింగ్ హృదయ సంబంధ వ్యాధులను 35-55% మరియు క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని 30-50% తగ్గిస్తుంది. 2008లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్హె ల్త్ ప్రచురించిన అధ్యయనం మధ్య వయస్సులు ,వృద్ధాప్యంలో రన్నింగ్ అనేది వారి జీవిత మనుగడకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

READ ALSO : Walking : ప్రతిరోజు వాకింగ్ ఎలా చేయాలి? ఏ సమయంలో చేస్తే బెటర్?

రన్నింగ్ ప్రారంభించేవారు తొలుత ఒక నిమిషం నడక , 1 నిమిషం పరుగు తరువాత 15-నిమిషాల పాటు క్రమంగా పరుగు వ్యవధిని 90 సెకన్లు పెంచండి. ప్రారంభంలో 1-2 కిమీ లేదా 2 మైళ్లు లక్ష్యంగా పెట్టుకోండి. 3-4 రోజులు రన్నింగ్ కు కేటాయించండి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కోసం 1 రోజు, ఫ్లెక్సిబిలిటీ వ్యాయామం కోసం 1 రోజు, 1 రోజు విశ్రాంతికి కేటాయించండి. వయస్సు, ఫిట్‌నెస్ స్థాయి ,ఆరోగ్య స్థితికి అనుగుణంగా 5-12 వారాల వ్యవధిలో 5k రన్నింగ్‌ ను లక్ష్యంగా పెట్టుకోండి.

READ ALSO : World Asthma Day : ఆస్తమా రోగులు ఇన్హేలర్లు వాడటం ప్రమాదమా?

రన్నింగ్ తర్వాత కండరాల నొప్పిని నివారించడానికి, 5-10 నిమిషాల పాటు స్పాట్ జాగింగ్‌ శరీరాన్ని వేడెక్కించాలి. ప్రధానమైన దిగువ అవయవాల కండరాలను డైనమిక్ స్ట్రెచింగ్‌తో చల్లబరుచుకోవాలి. ప్రేరణ పొందాలంటే రోజువారిగా రన్నింగ్ చేసే వారితో కలిసి రన్నింగ్ ను కొనసాగించటం మంచిది.

ట్రెండింగ్ వార్తలు