World Asthma Day : ఆస్తమా రోగులు ఇన్హేలర్లు వాడటం ప్రమాదమా?

ఈరోజు 'ప్రపంచ ఆస్తమా దినోత్సవం'. ఉబ్బసం అనేది నియంత్రించ దగిన వ్యాధి. ఈ వ్యాధికి చికిత్సలో భాగంగా డాక్టర్లు ఇన్హేలర్లు సజెస్ట్ చేస్తారు. అయితే జీవన శైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా కూడా ఈ వ్యాధిని నియంత్రించవచ్చు. అందుకోసం ఏం చేయాలి?

World Asthma Day  : ఆస్తమా రోగులు ఇన్హేలర్లు వాడటం ప్రమాదమా?

world asthma day

world asthma day :  ‘వరల్డ్ ఆస్తమా డే’ ఏటా మే నెలలో మొదటి మంగళవారం జరుపుతారు. ఈ ఏడాది మే 2న నిర్వహిస్తున్నారు. పిల్లలు, పెద్దల్లో కనిపించే సాధారణ శ్వాసకోశ సమస్య ఆస్తమా. భారతదేశంలో 3-5 శాతం మంది ఆస్తమాతో బాధపడుతున్నారని అంచనా వేశారు. ఉబ్బసం అనేది నియంత్రించబడే వ్యాధి. అయితే దీనికోసం ఏం చేయాలి?

Asthma In Summer Season : వేసవి కాలంలో ఉబ్బసంతో బాధపడేవారు పాటించాల్సిన 5 సాధారణ జాగ్రత్తలు !

ఉబ్బసం అనేది ఒక వ్యాధి, అయితే తగిన చికిత్సతో బాగా నియంత్రించబడుతుంది. ఉబ్బసం ఉన్నవారు సాధారణ మరియు చురుకైన జీవితాన్ని గడపవచ్చు. ఇది వ్యక్తి నుంచి వ్యక్తి సంక్రమించే వ్యాధి మాత్రం కాదు. మరియు సరైన వైద్యం తీసుకోవడం ద్వారా రోగులు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు.

 

ఆస్తమాతో బాధపడే వారికి జీవితకాలం మందులు అవసరం లేదు. దీని ప్రభావం ఒక్కొక్కరిలో ఒక్కోరకంగా ఉంటుంది. దాని ఆధారంగా మెడిసిన్స్ ఇస్తారు. కొందరిలో చాలా తక్కువగా లక్షణాలు కనిపించినపుడు ఇన్హేలర్‌ను డాక్టర్లు సజెస్ట్ చేస్తారు. అయితే దీనిని అదుపులోకి తీసుకురావడానికి తప్పనిసరిగా ఇన్హేలర్‌ని వాడాలి. ఉబ్బసం సమయంలో దగ్గు, కఫం ఎక్కువగా ఉండటం.. శ్వాస సరిగా తీసుకోలేకపోవడం.. ఛాతీ బరువుగా ఉండటం.. ఊపిరి తీసుకునేటపుడు శబ్దాలు రావడం లాంటివి కనిపిస్తాయి.

Asthma : ఉబ్బసంతో ఉక్కిరిబిక్కిరి….జాగ్రత్తలు తప్పనిసరి

ఇక ఇన్హేలర్ల విషయంలో కొన్ని అపోహలు ఉన్నాయి. ఆస్తమా అటాక్ అవగానే ఇన్హేలర్ పీల్చడం మంచిది కాదని .. వీటిని ఎక్కువగా వాడటం వల్ల దుష్ప్రభావాలు చూపిస్తాయని జనం భయపడతారు. కానీ చికిత్స సమయంలో ఉబ్బసం ఉన్న ప్రతి ఒక్కరికీ డాక్టర్లు ఇన్హేలర్లను సూచిస్తారు. నిజానికి మందులు, సిరప్‌ల కంటే ఇన్హేలర్లు మాత్రమే సురక్షితమైనవని వైద్యులు చెబుతున్నారు. ఇన్హేలర్ వల్ల ఎటువంటి హాని జరగదని స్పష్టం చేస్తున్నారు. అయితే ఇవి ఉపయోగించేటపుడు మాత్రం టెక్నికల్‌గా సరైన జాగ్రత్తలు పాటించాలని తప్పుగా ఉపయోగిస్తే దుష్ప్రభావాలు సంభవిస్తాయని హెచ్చరిస్తున్నారు.

 

ఆస్తమా రోగులు ఖచ్చితంగా వ్యాధిని నియంత్రించాలంటే లైఫ్ స్టైల్‌ను మార్చుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. రోజు యోగా, ధ్యానం, వాకింగ్, బరువు తగ్గడం లాంటి మార్పుల ద్వారా ఆస్తమాను కంట్రోల్ చేసుకోవచ్చని చెబుతున్నారు. మారిన జీవన విధానం చాలా రకాల అనారోగ్యాలకు కారణమవుతోంది. కాబట్టి వైద్యుల సూచనలు పాటించడం ఎంతైనా అవసరం.