Asthma In Summer Season : వేసవి కాలంలో ఉబ్బసంతో బాధపడేవారు పాటించాల్సిన 5 సాధారణ జాగ్రత్తలు !

ఆస్తమా ఉంటే ఇంట్లోనే ఉండడం, గాలి నాణ్యత సురక్షితంగా ఉంటేనే బయటకు వెళ్లడం ముఖ్యం. ఒకవేళ, ఏదైనా పని కోసం బయటకు వెళుతున్నట్లయితే, చర్మం , జుట్టు మీద పడ్డ కాలుష్యకారకాలు తొలగించుకునేందుకు తిరిగి ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేయాలి.

Asthma In Summer Season : వేసవి కాలంలో ఉబ్బసంతో బాధపడేవారు పాటించాల్సిన 5 సాధారణ జాగ్రత్తలు !

summer asthma

Asthma In Summer Season : వేసవి వేడి గాలి వాయుమార్గాలను బిగించి ఇరుకైనదిగా చేయడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి వేసవి వేడి ఆస్తమా ఉన్నవారికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. వేసవిలో స్తబ్దుగా ఉండే గాలి కాలుష్య కారకాలు, ధూళి ఆస్తమా లక్షణాలను తీవ్రతరం చేస్తాయి. వేసవి కాలంలో వాయు కాలుష్యం స్థాయిలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది ఆస్తమా రోగులకు కష్టతరంగా మారుతుంది.

READ ALSO : Asthma Patients : వర్షకాలంలో ఆస్తమా రోగులు ఈ జాగ్రత్తలు పాటిస్తే మంచిది!

ఆస్తమా ఉంటే ఇంట్లోనే ఉండడం, గాలి నాణ్యత సురక్షితంగా ఉంటేనే బయటకు వెళ్లడం ముఖ్యం. ఒకవేళ, ఏదైనా పని కోసం బయటకు వెళుతున్నట్లయితే, చర్మం , జుట్టు మీద పడ్డ కాలుష్యకారకాలు తొలగించుకునేందుకు తిరిగి ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేయాలి. వేసవి కాలం ఉబ్బసం ఉన్నవారికి చాలా కష్టకాలంగా చెప్పవచ్చు. వేడిగాలులు, వేసవి వేడి రోగులలో దగ్గు, గురక, మరియు శ్వాస ఆడకపోవటం వంటి లక్షణాలను కలిగిస్తాయి.

ఆస్తమా అనేది నయం చేయలేని వ్యాధి. ఔషధాల సహాయం, జీవనశైలి నిర్వహణ , ఆస్తమా అటాక్‌కు కారణమయ్యే పరిస్ధితులను నివారించడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.

READ ALSO : Asthma : ఆస్తమాతో జాగ్రత్త! ఎందుకొస్తుందో తెలుసా?

ఉబ్బసం ఉన్నవారికి వేసవి పాటించాల్సిన జాగ్రత్తలు ;

1. అధిక తేమ: తేమతో కూడిన గాలి ఆస్తమా రోగులకు శ్వాసను సవాలుగా మారుతుంది. ఛాతీ బిగుతుగా, శ్వాస నిస్సారంగా మారినట్లు అనిపిస్తుంది.

2. వాయు కాలుష్యం: వాయు కాలుష్యాలను పీల్చడం అందరికి ప్రమాదకరం. ముఖ్యంగా ఆస్తమా రోగులకు, కాలుష్య కారకాలకు గురికావడం వల్ల ఊపిరితిత్తుల పనితీరు వేగంగా దెబ్బతింటుంది. ఆస్తమా దాడులను ప్రేరేపిస్తుంది.

READ ALSO :  Pregnancy Time: ప్రెగ్నెన్సీ సమయంలో డిస్‌ఇన్ఫెక్టెంట్స్ వాడితే ఆస్తమా – స్టడీ

3. పుప్పొడి: వేసవిలో పుప్పొడి , అలెర్జీలు ఉబ్బసం యొక్క లక్షణాలను ప్రేరేపిస్తాయి. జ్వరంతోపాటు ఇతర లక్షణాలు కనిపించి ఆరోగ్యం ఇబ్బంది కరంగా మారుతుంది.

4. కీటకాలు కుట్టడం: కీటకాల కుట్టటం కూడా ఆస్తమా లక్షణాలను ప్రేరేపించగల అలెర్జీ ప్రతిచర్యలకు కారణమవుతుంది.

5. వ్యాయామం-ప్రేరిత ఆస్తమా : మందులు, సరైన జాగ్రత్తల సహాయంతోపాటుగా, ఆస్తమా రోగులకు వ్యాయామం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వాతావరణం కారణంగా వేసవి కాలంలో వ్యాయామం-ప్రేరిత ఆస్తమా దాడికి గురయ్యే అవకాశాలు పెరుగుతాయి.

READ ALSO : Asthma Prevention : ఆస్తమా నివారణకు సింపుల్ హోం రెమెడీస్!

ముఖ్యంగా వేసవి కాలంలో ఆస్తమా రోగులకు మరింత ప్రమాదం పెరిగే కాలంగా చెప్పవచ్చు. ఈ సందర్భంలో, రోగి సాధారణ ప్రమాద కారకాలు, వ్యక్తిగత పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి వైద్య నిపుణుడి సహాయాన్ని పొందాలి. వేసవి కాలంలో ఆరుబయట నిద్రించే వారు రాత్రి చల్లదనాన్ని గురికాకుండా తలపై కప్పుకోవటం, హైడ్రేటెడ్‌గా ఉండటం, ఎక్కడికి వెళ్ళిన మందులను తమతో తీసుకెళ్లడం వంటి అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి.