Asthma Prevention : ఆస్తమా నివారణకు సింపుల్ హోం రెమెడీస్!

నల్ల మిరియాలు, అల్లం రూట్ పొడి మరియు ఒక టీస్పూన్ తేనె మిశ్రమాన్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఆస్తమాతో బాధపడే వారు క్రోనిక్ డిజార్డన్ ను కంట్రోల్లో ఉంచుకోవాలంటే సరైన ఆహారనియమాలను అనుసరించటం మేలు.

Asthma Prevention : ఆస్తమా నివారణకు సింపుల్ హోం రెమెడీస్!

Asthma Prevention

Asthma Prevention : ఆధునిక జీవనశైలి, కాలుష్యం కారణంగా అనేక మంది దీర్ఘకాలిక శ్వాసకోశ సంబంధిత ఆస్తమా బారిన పడుతున్నారు. ఊపిరితిత్తుల్లో గాలిమార్గానికి అడ్డంకులు ఏర్పడటం ద్వారా శ్వాస పీల్చుకోవటంలో ఆస్తమా బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. దీని కారణంగా దగ్గు, ఛాతిలో నొప్పి, ఆయాసం వంటి సమస్యలు ఉత్పన్న అవుతాయి. దుమ్ము,ధూళి, పెంపుడు జంతువులు, చల్లని గాలి, రసాయనాలు, ఫంగస్, అలర్జీ కారకాలైన పువ్వులు, ఇలా అనేకం ఈ శ్వాసకోశ సంబంధిత ఆస్తమాకు కారణమౌతాయి.

ఆస్తమాతో బాధపడుతున్న వారు ఏమాత్రం కలరపడకుండా సహజమైన ఇంటి చిట్కాలతో దీనిని నివారించుకోవచ్చు. ఆయుర్వేద మూలికా ఔషధాలను తీసుకోవడం ద్వారా కూడా ఆస్తమాను నియంత్రించవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల్య ఆహారం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. భవిష్యత్తులో ఆస్తమా దాడుల నుండి మిమ్మల్నిమీరు రక్షించుకోవచ్చు. మందులు ఇతర డీకాంగెస్టెంట్ స్ప్రేల ప్రమేయం లేకుండా, ఇంటి చిట్కాలు ఆస్తమా నివారించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.

ఆస్తమాను నయం చేయడానికి సాధారణ చిట్కాలు;

క్రమం తప్పకుండా శారీరక శ్వాస వ్యాయామాలు చేయడం, స్విమ్మింగ్ దీర్ఘకాలిక ఆస్తమా రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వెల్లుల్లి రెబ్బల ముక్కలతో వేడి అల్లం టీ తాగడం వల్ల ఆస్తమా చికిత్సలో సహాయపడుతుంది. ఇంటి నివాసా ప్రదేశాల్లో దుమ్ముదూళి లేకుండా చూసుకోవాలి. వంటగదిలో పొగ పోయేలా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉపయోగించాలి. సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. ఆస్తమా ఉన్నవారు పెర్ఫ్యూమ్‌లు,ఎయిర్ ఫ్రెషనర్‌లను నివారించాలి.

పాలిస్టర్ బెడ్ షీట్లు మరియు దిండ్లు ఉపయోగించడానికి ప్రయత్నించండి. ఆస్తమా చికిత్సలో తేనె ఒక ముఖ్యమైన భాగం. తేనె, ముల్లంగి, నిమ్మరసం తీసుకుని మిక్సీలో కలపాలి. చిన్న మంటలో ఉడికించి, ఈ మిశ్రమాన్ని రోజూ ఉదయం ఒక టీస్పూన్ తీసుకుంటే శ్వాస సమస్యలు రాకుండా ఉంటాయి.

నల్ల మిరియాలు, అల్లం రూట్ పొడి మరియు ఒక టీస్పూన్ తేనె మిశ్రమాన్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఆస్తమాతో బాధపడే వారు క్రోనిక్ డిజార్డన్ ను కంట్రోల్లో ఉంచుకోవాలంటే సరైన ఆహారనియమాలను అనుసరించటం మేలు. విటమిన్స్ ఎ, ఇ, సి మరియు బీటాకెరోటిన్ వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలి.

పుదీనా తయారైన మింట్ ఆయిల్ శ్వాసనాళ ఇబ్బందులను, వాపు, మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. మింట్ ఆయిల్ వేడి నీటిలో వేసి స్టీమ్ చేయడం వల్ల ఆస్త్మా నుండి ఉపశమనం పొందవచ్చు. రెగ్యులర్ డైట్ లో అల్లంను కొద్దిగా తీసుకోవాలి. అల్లం కఫంను అరికట్టి , శ్వాసనాళాన్ని క్లియర్ చేస్తుంది. నిమ్మరసంలో విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఆస్తమా లక్షణాలను నివారించటంలో సహాయపడుతుంది.

వెల్లుల్లి శ్వాసనాళంలో ఇబ్బందులను మరియు ఇతర సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది. ఇందులోని ఔషధగుణాల వల్ల, బ్రీతింగ్ డిజార్డర్స్ ను బ్రోంకైటిస్ మరియు ఆస్త్మా వంటివి నివారించవచ్చు. ఆస్తమా సమస్యను నివారించటంలో రోజువారి వ్యాయామాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. వాకింగ్, రన్నింగ్, సైకిల్ తొక్కడం మంచిది. దుమ్ము,ధూళి వంటి వాటికి దూరంగా ఉండాలి.

గమనిక; ఈ సమాచారాన్ని అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా అందించటమైనది. కేవలం అవగాహన కోసం మాత్రమే. అయితే ఆస్తమా సమస్యతో బాధపడుతున్న వారు వైద్యుల సూచనలు సలహాలు పాటించటం ద్వారా తగిన చికిత్స పొందటం మంచిది.