Hangover : మందుబాబులు హ్యాంగోవర్ నుండి తప్పించుకోవటం ఎలాగంటే!..

ఆల్క‌హాల్ మితంగా తీసుకున్న‌ప్పుడు శ‌రీరంలో డొప‌మైన్‌, ఎండార్పిన్ వంటి హార్మోన్లు ఉత్ప‌త్తి అవుతాయి. ఇవి మెద‌డును తాత్కాలికంగా ఉత్తేజ‌ప‌రుస్తాయి. ఆల్క‌హాల్‌ను మోతాదుకు మంచి తీసుకుంట

Hangover

Hangover : సరదాగా స్నేహితులంతా కలిశారంటే చాలు పార్టీలు, ఫంక్ష‌న్ల‌ంటూ సరగా గడిపేస్తుంటారు. ఈ సరదసమయంలో మందు కొట్టటం అందరికి అలవాటుగా మారిపోయింది. స్నేహితులతో కలసి మద్యం సేవిస్తుంటే సమయమే కాదు. ఎంత తాగుతున్నామన్న విషయం కూడా తెలియదు. అదే పనిగా గ్లాసుల కొద్దీ మద్యాన్ని తాగేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో పరిమితికి మించి తాగటం వల్ల చాలా మంది అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటుంటారు. అలాంటి అనారోగ్య సమస్యల్లో హ్యాంగోవర్ కూడా ఒకటిగా చెప్పవచ్చు. మితంగా తాగితే పర్వాలేదు. అతిగా మద్యం తాగితే మాత్రం దేహంలో అనేకమైన రియాక్షన్లు తప్పనిసరిగా వస్తాయి. వాటిలో దాహం వేయటం, అల‌స‌ట‌, వికారం వంటి స‌మ‌స్య‌లు వెలుగుచూస్తాయి. ఇలాంటి లక్షణాలనే హ్యాంగోవ‌ర్ గా చెప్తుంటాం..

ఆల్క‌హాల్ మితంగా తీసుకున్న‌ప్పుడు శ‌రీరంలో డొప‌మైన్‌, ఎండార్పిన్ వంటి హార్మోన్లు ఉత్ప‌త్తి అవుతాయి. ఇవి మెద‌డును తాత్కాలికంగా ఉత్తేజ‌ప‌రుస్తాయి. ఆల్క‌హాల్‌ను మోతాదుకు మంచి తీసుకుంటే మెద‌డు చురుకుదనంలో చాలా మార్పులు వస్తాయి. నాడులు దెబ్బ‌తినటంతోపాటు హారోన్ల బ్యాలెన్స్ కట్టుతప్పిపోతుంది. ప్రధానంగా శ‌రీరంలో పీయూష గ్రంథిని ఆల్కాహాల్ నిలువరించి, వాసోప్రెసిన్‌ హార్మోన్‌ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. ఈ హార్మోన్ కారణంగా మూత్ర విస‌ర్జ‌న ఎక్కువ‌ అవుతుంది. మద్యం సేవించిన వారి శ‌రీరంలో నుంచి ఎక్కువ నీరు బ‌య‌ట‌కు వెళ్లిపోవటానికి కారణం ఇదే. ఇలా నీరు వెళ్ళిపోవటంతో డీహైడ్రేష‌న్ అవుతుంది. ర‌క్తంలో నీటిస్థాయిలు త‌గ్గ‌డం వ‌ల్ల త‌ల‌నొప్పి వ‌స్తుంది. త‌ల బ‌రువెక్కుతుంది. ఈ పరిస్ధితినే హ్యాంగోవర్ గా చెప్తుంటాం.

హ్యాంగోవర్‌లో సమయంలో చిన్న శబ్దం కూడా చాలా పెద్దదిగా వినిపిస్తుంది. చికాకు కలుగుతుంది. ఎక్కువ వెలుతురును చూడలేకపోతారు.. దీని నుంచి బయటపడేందుకు చాలా మంది వివిధ రకాల ఉపాయాలు చేస్తారు. కషాయాలు వంటి వాటిని సేవిస్తారు. అయితే ఆరోగ్య నిపుణులు హ్యాంగోవర్ ను బయటపడేందుకు మరికొన్ని సులభమైన మార్గాలను సూచిస్తున్నారు. ఆరోగ్య‌క‌ర‌మైన అల్పాహారం తిన‌డం వ‌ల్ల హ్యాంగోవ‌ర్‌నుండి బయటపడవచ్చట. ఇదే విషయాన్ని నిపుణులు చెబుతున్నారు. మంచి ఆహారాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలోని షుగ‌ర్ లెవ‌ల్స్ నియంత్ర‌ణ‌కు వ‌చ్చి వికారం, అల‌స‌ట‌, బ‌ల‌హీన‌త తగ్గిపోతాయి. విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉన్న ఫుడ్ తీసుకుంటే హ్యాంగోవ‌ర్ నుండి సులభంగా బయటపడవచ్చు. హ్యాంగోవ‌ర్ త‌గ్గించుకునేందుకు గుడ్డు తిన‌మ‌ని చెప్తారు. నిజానికి గుడ్డులో ఉండే సిస్టీన్ అనే అమైనో ఆమ్లాలు, ఎసిటాల్డిహైడ్‌ను వేరుచేయ‌డానికి దోహదపడతాయి. ఇలా చేయటం వల్ల కూడా ఉపశమనం పొందవచ్చు.

హ్యాంగోవర్ నుండి బయటపడాలంటే నిద్ర చాలా అవసరం. రాత్రి పూట ఎక్కువ‌సేపు నిద్రలేకుండా తాగ‌డం వ‌ల్ల నిద్రలేమికి దారి తీస్తుంది. దీని వల్ల శరీరంలో అలసట ఏర్పడుతుంది. అల‌స‌ట‌తోనే ఇత‌ర‌త్రా ప‌నులు చేస్తే హ్యాంగోవ‌ర్ మ‌రింత పెరుగుతుంది. మద్యం సేవించే సమయంలో శరీరం నుండి యూరిన్ రూపంలో ఎక్కువ నీరు బయటకు వెళుతుంది. ఇది డీహైడ్రేషన్ ఏర్పడటానికి కారణమవుతుంది. అందుకే మద్యం తాగేవారు ఎక్కవగా నీరు, పండ్ల రసాలు సేవించటం ద్వారా హ్యంగోవర్ నుండి తప్పించుకోవచ్చు. హ్యాంగోవర్ నుండి బయటపడేందుకు కషాయాలు కూడా బాగా పనిచేస్తాయని చెబుతుంటారు.