Perfectly Healthy : పరిపూర్ణ ఆరోగ్యవంతులంటే ఎలా ఉండాలంటే?..

నిరంతరం ఏదో ఒక పనిలో నిమగ్రం కావాలి. అలా కాకుండా నిమగ్నమైన పనిలో ఏకాగ్రత లోపిస్తుందంటే ఆలోచించాల్సిందే..

Good Health

Perfectly Healthy : ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు… ఆరోగ్యమే అన్ని సంపదల కన్నా విలువైనది. మనిషి ఆరోగ్యంగా ఉంటే తలపెట్టిన కార్యక్రమాలను విజయవంతంగా చేయగలడు. ఒక మనిషి ఆరోగ్యంగా ఉన్నాడా లేడా అని తనకు తాను నిర్ణయించుకునేందుకు కొన్ని రకాల లక్షణాలను బట్టి తెలుసుకోవచ్చు. అవేంటంటే…

1. సుఖవంతమైన నిద్రపోవాలి. ఉదయాన్నే నిద్రలేవగానే శరీరం శక్తివంతంగా , ఉత్సాహంగా ఉండాలి. అలా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లు బద్దకంగా ఉంటే మాత్రం రోగం ఉందని అర్ధం.

2. మల విసర్జన రోజూ సాఫీగా జరగాలి. ఆకలి దానంతట అదే సహజంగా పుట్టాలి. మలవిసర్జన సక్రమంగా లేకపోయినా, సమయానికి ఆకలి లేకున్నా రోగం ఉన్నట్లే…

3. రోజంతా చాలా చురుకుగా పనిచేయాలి. నిస్సత్తువగా ఉంటే మాత్రం తెలియని వ్యాధి శరీరంలో ఉన్నట్లే గుర్తించాలి.

3. ఉద్రేకాన్ని కలిగించే మత్తు పదార్ధాలు వాడకం మంచిదికాదు. మద్యపానానికి దూరంగా ఉండాలి. మనస్సు అహ్లాదకరంగా సంతోషంగా ఉండాలి. అలా కాకుండా ఉద్రేకం కలిగించేవి తినాలని పించటం, తాగాలనిపించటం , మనస్సు అహ్లాదకరంగా లేకపోవటం మానసిక రోగాలకు శరీరం నిలయంగా మారిందని గుర్తించాలి.

4. అలసట అనేది లేకుండా కొన్ని గంటల పాటు పనిచేయగలిగాలి. కొంత పనిచేస్తుండగానే అలసట వస్తుందంటే రోగం ఉందని అర్ధం చేసుకోవాలి.

5. నిరంతరం ఏదో ఒక పనిలో నిమగ్రం కావాలి. అలా కాకుండా నిమగ్నమైన పనిలో ఏకాగ్రత లోపిస్తుందంటే ఆలోచించాల్సిందే..

6.ముఖ కవళికల్లో వర్చస్సు కనిపించాలి. కళ్ళు ప్రకాశవంతంగా ఉండాలి. కళ్ళను బట్టే రోగాన్ని గుర్తించవచ్చు. శారీరక శ్రమ ఉండాలి. శ్రమ చేయలేకపోవటం అంటే ఏదో రోగం ఉండటమే.

7. ఛాతిని దాటి పొట్ట ముందుకు రాకూడదు. ఎత్తుకు తగ్గ శరీరం, బరువు కలిగి ఉండాలి. ముఖంపై అన్ని వేళల్లో చిరునవ్వు కనిపించాలి. స్వరంలో మార్పు, ముఖం రోగగ్రస్తంగా ఉండరాదు. వయస్సుతో నిమిత్తం లేకుండా పనిలో చలాకీగా ఉండాలి. బద్దకంగా ఉండరాదు.

8. చెమట, మలం, వాయువు, దుర్వాసన రాకూడదు. అవి దుర్వాసన వెదజల్లు తుంటే రోగ లక్షణంగా భావించాలి. చర్మం మృధువుగా కాంతివంతంగా ఉండాలి. చలి, వేడిని సమంగా తట్టుకోవాలి. చర్మం కాంతి హీనంగా పాలిపోయినట్లు ఉంటే రోగ లక్షణంగా గుర్తించాలి.

9. కోపం, ద్వేషం , విచారం, భయం, కన్నీళ్ళు, టెన్షన్, చిరాకు రాకూడదు. ఈ లక్షణాలు కలిగి ఉండే మానసిక రోగాలు ఉన్నట్లుగా భావించాలి. వెన్నెముక నిటారుగా ఉండాలి. వంగిన సమయంలో నొప్పి వస్తుందా రోగం ఉన్నట్లుగా భావించాలి.