Build Strong Muscles : బరువు తగ్గిన తర్వాత బలమైన కండరాల నిర్మాణం ఎలా ? ఫిట్‌నెస్ నిపుణులు ఏంచెబుతున్నారు?

వ్యాయామాల తర్వాత అధిక నాణ్యత కార్బోహైడ్రేట్లను తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ ప్రకారం, కార్బోహైడ్రేట్లు మీ వ్యాయామాలను శక్తివంతం చేయడానికి శరీరానికి సరైన ఇంధన వనరుగా ఉపయోగపడుతుంది. అవి లేకుండా, శరీరానికి కఠినమైన శిక్షణ మరియు కండరాలను నిర్మించే శక్తి ఉండదు.

How to build strong muscles after losing weight? What do fitness experts say?

Build Strong Muscles : అధికంగా ఉన్న బరువును తగ్గించుకోవటం అన్నది సాధారణమైన విషయం కాదు. అలా బరువు తగ్గటానికి ఎంతో శ్రమించాల్సి వస్తుంది. అనుకున్న విధంగా బరువు తగ్గాలన్న లక్ష్యాన్నిసాధించిన తరువాత మీ ముందు మరో లక్ష్యం ఉంటుంది. అదే మీ కండరాలను పఠిష్టపరుచుకోవటం. ఈ ఫిట్‌నెస్ ప్రయాణంలో తదుపరి దశ కండర ద్రవ్యరాశిని నిర్మించడం అన్నది చాల ముఖ్యమైనది.

కండరాలను శక్తివంతం చేసుకోవటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. బరువు తగ్గిన తర్వాత కండరాన్ని నిర్మించడం ఒక అద్భుతమైన నిర్ణయం. అయితే అదే సమయంలో
కొంత మంది కొన్ని తప్పులు చేస్తుంటారు. కండరాల నిర్మాణం కోసంమని అప్పటిదాకా బరువును తగ్గించే డైట్ ను కాస్త పెంచేసి కండరాలు పెంచాలన్న ఆలోచనతో లాగించేస్తుంటారు.
ఇలా చేయటం సరికాదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయటానికి బదులుగా ప్రతిరోజు తగిన మొత్తంలో అదనపు ప్రొటీన్లు, పిండిపదార్ధాలను తీసుకోవాలి. ముందుగానే ఎన్ని
కేలరీలను రోజుకు తీసుకోవాలన్న ఆలోచన చేయాలి. ఒక వారం రోజుల పాటు రోజుకు 100 నుండి 200 కేలరీలను తీసుకోవాలి. నెమ్మదిగా ఈ మొత్తాన్ని పెంచుకుంటూ పోవాలి.

కండరాల బలం కోసం అధిక బరువులు ఎత్తే ప్రక్రియను చాలా మంది అనుసరిస్తుంటారు. అలా కాకుండా మితమైన బరువులను ఎత్తటంపై దృష్టిసారించటం మంచిది. హైపర్ట్రోఫీ శిక్షణతో కండర ద్రవ్యరాశిని పెంచవచ్చు. కండరాల పెరుగుదల, కణజాల మరమ్మత్తు, పునరుద్ధరణ , ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థతో సహా అనేక శారీరక విధులకు తగినంత ప్రోటీన్ తీసుకోవడం చాలా కీలకం. అమెరికన్ కాలేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ ప్రకారం, సరైన కండరాల పెరుగుదల కోసం ప్రతిరోజూ ఒక కిలోగ్రాము శరీర బరువుకు 1.2 మరియు 2.0 గ్రాముల మధ్య ప్రోటీన్ తినాలని లక్ష్యంగా పెట్టుకోండి. బరువు తగ్గే సమయంలో ఎక్కువ మోతాదులో ప్రోటీన్ తినడం చాలా ముఖ్యం. కాకపోతే, తగినంత ప్రోటీన్ పొందుతున్నారని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.

వ్యాయామాల తర్వాత అధిక నాణ్యత కార్బోహైడ్రేట్లను తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ ప్రకారం, కార్బోహైడ్రేట్లు మీ వ్యాయామాలను శక్తివంతం చేయడానికి శరీరానికి సరైన ఇంధన వనరుగా ఉపయోగపడుతుంది. అవి లేకుండా, శరీరానికి కఠినమైన శిక్షణ మరియు కండరాలను నిర్మించే శక్తి ఉండదు. వ్యాయామాల తర్వాత, మీరు 25 నుండి 40 గ్రాముల ప్రోటీన్ మరియు 30 నుండి 50 గ్రాములు లేదా అంతకంటే ఎక్కువ సులభంగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్‌లను తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే అది మీ శరీరానికి కావాల్సిన క్యాలరీ అవసరాలపై ఆధారపడి ఉంటుంది.

శరీరంలోని కొవ్వు లక్ష్యంగా చేసుకుని ఆహారం మరియు వ్యాయామంలో సరైన మార్పులు చేయడం ద్వారా సరైన ఫలితాలను సాధించగలరు. కొవ్వును తగ్గించే కన్నా, కండర నిర్మాణానికి ప్రయత్నించడం మూలంగా ఎక్కువ ఫలితాలను పొందవచ్చు. చేపలు, పౌల్ట్రీ, కాయలు, గుడ్లు, పాల పదార్ధాలు మొదలైన ప్రోటీన్ ఆహారాల ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. నిధానంగా జీర్ణమయ్యే ప్రోటీన్లను కలిగిన పీనట్ బట్టర్, లేదా కాటేజ్ చీజ్ లేదా సిఫార్సు చేసిన ప్రోటీన్ పౌడర్ నిద్రించే ముందుగా తీసుకోవడం ద్వారా, శరీర జీవక్రియలు మెరుగు పడతాయి.