Blood Sugar Levels : క్రిస్మస్, సంక్రాంతి పండుగల సమయంలో మధుమేహులు రక్తంలో చక్కెర స్ధాయిలను నియంత్రణలో ఉంచుకోవాలంటే?

పండుగ సందర్భంగా పసందైన ఆహారాలు తీసుకుంటే ఆసందర్భంలో సుఖవంతంగా నిద్రపోవాలనిపిస్తుంది. బద్దకంగా ఉంటుంది. అయితే భోజనం తరువాత 10 నిమిషాల సులభమైన నడక ఇంట్లో సున్నితంగా వ్యాయామం చేయడం రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడానికి, తగ్గించడానికి సహాయపడుతుంది.

How to control diabetes blood sugar levels during Christmas and Sankranti festivals?

Blood Sugar Levels : ఉల్లాసంగా గడపాల్సిన సీజన్ వచ్చింది. క్రిస్మస్, నూతనసంవత్సరం, సంక్రాంతి రుచికరమైన వంటకాలు మరియు విందులను ఆస్వాదించడానికి ఇది సమయం. అయితే మధుమేహం ఉన్నవారికి, క్రిస్మస్ మరియు నూతన సంవత్సర వేడుకలు చాలా ఒత్తిడిని కలిగిస్తాయి, ఎందుకంటే వివిధ రకాల ఆహారాలను ఈ సమయలో ఇష్టంగా తీసుకుంటారు. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం ఒక సవాలుగా మారుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు పండుగ వేడుకల సమయంలో ఇతర వ్యక్తుల మాదిరిగా రుచికరమైన ఆహారపదార్ధాలను తీసుకోలేరు. ఈ పరిస్థితి వారిని నిరుత్సాహానికి గురిచేస్తుంది.

అయితే మధుమేహలు సైతం ఈ పండుగ వేళ రుచికరమైన ఆహారాలతో సంతృప్తి చెందాలంటే వైద్యులు, పోషకాహార నిపుణుల సలహాలు, సూచనలతో కొన్ని మార్పులు చేసుకోవచ్చు. మధుమేహాన్ని ఎదుర్కోవాలంటే రెగ్యులర్ మీల్స్‌లో ఎక్కువ ఫైబర్ మరియు ప్రోటీన్‌లు ఉండేలా చూసుకోవటం, ఆహారాన్ని సమయానికి తినడం, తక్కువ మొత్తంలో అధిక కేలరీల ఆహారాన్ని ఆస్వాదించడం, బాగా విశ్రాంతి తీసుకోవడం వల్ల ,ఎక్కువ ఒత్తిడి లేకుండా మధుమేహాన్ని ఎదుర్కోవచ్చు. పండుగల నేపధ్యంలో మధుమేహాన్ని ఎదుర్కొనేందుకు నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

హాలిడే సీజన్‌లో మధుమేహం నిర్వహణ సవాలుగా ఉంటుంది.ఇది మీ రోజు వారి ఆనందాన్ని దూరం చేయకూడదనుకుంటే మధుమేహం విషయంలో ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో రక్తంలో చక్కెర స్ధాయిల్లో ఊహించని మార్పులు చోటు చేసుకోకుండా ముందస్తుగా డయాబెటాల్జిస్ట్ ను సంప్రదించాలి. పండుగ వేళ మితంగా తీసుకోవాలి. డయాబెటాలజిస్ట్‌ ను సంప్రదించి అవసరమైతే మీ మందుల మోతాదులను మార్పులు చేసుకోవాలి. మధుమేహానికి సంబంధించిన మందులను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవటం మానుకోకూడదు.

పండుగ సందర్భంగా పసందైన ఆహారాలు తీసుకుంటే ఆసందర్భంలో సుఖవంతంగా నిద్రపోవాలనిపిస్తుంది. బద్దకంగా ఉంటుంది. అయితే భోజనం తరువాత 10 నిమిషాల సులభమైన నడక ఇంట్లో సున్నితంగా వ్యాయామం చేయడం రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడానికి, తగ్గించడానికి సహాయపడుతుంది. అదేసమయంలో ఒత్తిడిని ఎదుర్కోవాలంటే, మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి. నిద్ర కూడా చాలా ముఖ్యం. ప్రతిరోజూ 30 నుంచి 40 నిమిషాల పాటు వాకింగ్, పరుగెత్తడం, యోగా, ధ్యానం, డీప్ బ్రీతింగ్ వంటివి చేయాలి.

పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులంతా కలిసి కొన్ని స్వీట్లను తినాలనుకుంటే భోజన సమయంలో కార్బోహైడ్రేట్లను తీసుకోవడం తగ్గించుకోవాలి. అలాగని భోజనం చేయకుండా మానుకోకూడదు. క్రమం తప్పకుండా ఆహారం తీసుకోకుండా ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. శుద్ధి చేసిన, ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకోరాదు. వాటికి బదులుగా సాల్మన్, అవిసె గింజలు, సోయాబీన్, చేపలు, గుడ్లు, చిక్కుళ్ళు, బీన్స్ వంటి ఒమేగా 3 కొవ్వులు మీ ఆహారంలో చేర్చుకోవాలి. రొట్టె, పాస్తా వంటి తెల్లటి పిండితో చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి. బ్రౌన్ రైస్, రోల్డ్ వోట్స్, బార్లీ వంటి తృణధాన్యాలు తీసుకోవటం మంచిది.

అదే సమయంలో రక్తంలో చక్కెర స్ధాయిలు తక్కువగా ఉన్న వ్యక్తులు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్న వ్యక్తులు సహజ చక్కెర కలిగిన ఆహారాలు, పానీయాలు, రసాలు, తేనె వంటి వాటిని తీసుకోవాలి. ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు వంటి అధిక ఫైబర్ కరిగే ఆహారాన్ని చేర్చుకోవాలి. హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి ప్రతిరోజూ ఎక్కువగా నీరు సేవించాలి.