Hiccups
Hiccups instant cure Tool : వెక్కిళ్లు..ప్రతి మనిషికి అప్పుడప్పుడు వస్తుంటాయి. ఇవి ఎప్పుడు వస్తాయో తెలియదు. అయితే..వెక్కిళ్లు రాగానే..ఎవరో తలచుకుంటున్నారని లేకపోతే ఎవరో తిట్టుకుంటున్నారని పెద్దలు అంటుంటారు. అయితే..వెక్కిళ్లు పోవడానికి నానా కష్టాలు పడుతుంటారు. నీళ్లు తాగుతారు..అల్లం ముక్కలు నమలడం, చిన్న చిన్న చిట్కాలు పాటిస్తుంటారు. అయినా..కొంతమందిలో వెక్కిళ్లు మాత్రం పోవు. దీంతో తీవ్ర ఇబ్బందులకు లోనవుతుంటారు. దీనిపై శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. చిటికెలోనే వెక్కిళ్లు మాయం చేసే ఓ పరికరాన్ని రూపొందించారు.
Read More : Khadi India: ఖాదీ బ్రాండ్ అమ్మకాల అనుమతి కోసం క్యూలో 43 దేశాలు
దీనికి ‘ద ఫోర్స్‌డ్ ఇన్‌స్పిరేటరీ సక్షన్ అండ్ స్వాలో టూల్’ పేరు పెట్టారు. చూడడానికి ఒక గొట్టంలా కనిపిస్తుంటుంది. ఓ వైపు మౌత్ పీస్, మరోవైపు ప్రెషర్ వాల్వ్ ఉంటుంది. వెక్కిళ్లు వచ్చిన 249 మందిపై ప్రయోగించారు. నీటిని సిప్ చేస్తే..దాదాపు 92 శాతం వెక్కిళ్లను నివారిస్తుందని వారి అధ్యయనంలో తేలింది. ఈ పరికరాన్ని ఇప్పుడు మార్కెట్ లోకి అనుమతించింది. వివిధ కంపెనీల వారు..నీలం, ఆకుపచ్చ, బూడిద రంగుల్లో వీటిని తయారు చేస్తున్నారు. దీని ధరపై పూర్తి క్లారిటీ రాలేదని సమాచారం. రూ. 1000 నుంచి రూ. 2 వేలకు పైగా ఉంటుందని తెలుస్తోంది.