Calcium Deficiency : పిల్లల్లో కాల్షియం లోపాన్ని నివారించటం ఎలాగంటే?

కాల్సియంలోపంతో పిల్లలు బాధపడుతుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వారి సూచనలతో తగిన చికిత్స తీసుకోవటంతోపాటుగా కాల్షియాన్ని సహజంగా పెంచుకునే ఆహారాలను పిల్లలకు అందించాలి.

Calcium Deficiency : కాల్షియం అనేది మన శరీరంలో ఓ కీలక పోషకపదార్థం. నరాల ద్వారా మెదడుకు సందేశాలు పంపేటువంటి కీలక శరీర విధులకు కాల్షియం చాలా అవసరం. పిల్లల్లో కనిపించే కామన్ సమస్యల్లో కాల్షియం లోపం కూడా ఒకటి. దీని ప్రభావం పిల్లల ఎదుగుదలపై పడుతుంది. అంతేకాకుండా పిల్లల ఎముకల సాంధ్రత తగ్గిపోతుంది. పిల్లల్లో కాల్షియం సమస్య ఉత్పన్నమైతే వారిలో అనేక మార్పులు సంభవిస్తాయి. కండరాలలో తిమ్మిరి లేదా కండరాలు పట్టేయడం, బద్ధకం, తీవ్రమైన అలసట ఏర్పడుతుంది. దంత సమస్యలు, దంతాలు రావడంలో ఆలస్యం వంటివి చోటు చేసుకుంటాయి. గోర్లు బలహీనంగా, పెళుసుగా మారతాయి. తికమకగా ఉండటం, ఆకలిలేకపోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

కాల్సియంలోపంతో పిల్లలు బాధపడుతుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వారి సూచనలతో తగిన చికిత్స తీసుకోవటంతోపాటుగా కాల్షియాన్ని సహజంగా పెంచుకునే ఆహారాలను పిల్లలకు అందించాలి. కాల్షియం లోపానికి చెక్ పెట్టడానికి రోజు బాదంపప్పులను అందించాలి. బాదం పప్పులో కాల్షియంతో పాటు మరెన్నో పోషకాలు నిండి ఉంటాయి. వీటిని నీటిలో నానబెట్టి ఉదయాన్నే పిల్లల చేత తినిపించాలి. ఇలా రోజుకు నాలుగు బాదం పప్పులను పిల్లలకు ఇస్తే కాల్షియం లోపాన్ని నివారించవచ్చు. పాల ఉత్పత్తులైన జున్ను, రసమలై, పెరుగు, పాలు పులియబెట్టి చేసిన పెరుగువంటి పనీర్ వంటి వాటిని పిల్లలకు తరచు అందించాలి.

కాల్షియం, ఐరన్‌ లోపాలతో బాధపడేవారు ఖర్జూర పండ్లు తీసుకోవడం చాలా మంచిది. ఇవి శరీర రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి, అనిమీయా వ్యాధిని కూడా తగ్గిస్తాయి. ఎముకలు, కండరాలు దృఢంగా పెరుగుతాయి. కూరగాయలు, బచ్చలికూర, పాలకూర, బ్రోకలీ, పప్పుధాన్యాలు, బీన్స్, బఠానీలు, తృణధాన్యాలు రోజువారి ఆహారంలో భాగం చేయాలి. నువ్వులుండలు వంటి వాటిని అందించాలి. వీటిని పిల్లలు ఇష్టంగా తినేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా కాల్షియం పెంచవచ్చు.

 

ట్రెండింగ్ వార్తలు