Diabetes In Children : పిల్లల్లో మధుమేహం లక్షణాలను గుర్తించటం ఎలా?

చాలా మంది పిల్లలు మధుమేహ రోగులు లాగే సాధారణంగా ఒక విధమైన చర్మ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు. దద్దుర్లు, పొరలుగా ఉండే చర్మం, పొడి తామర, చిన్న ఎర్రటి గడ్డలు లేదా మెడ, చంక, గజ్జల చుట్టూ చర్మం నల్లటి రంగులో మారుతుంది.

Diabetes In Children : మధుమేహం అనేది రక్తంలో అధిక స్థాయిలో గ్లూకోజ్ ఉండే ఆరోగ్య పరిస్థితి. శరీరంలో ఇన్సులిన్ అనే హార్మోన్ తగినంతగా లేకపోవడం, ఇన్సులిన్‌కు సరిగ్గా స్పందించకపోవడం వల్ల మధుమేహం వస్తుంది. పెద్దల్లోనే కాకుండా పిల్లల్లోనూ మధుమేహం వస్తుంది. తల్లిదండ్రుల్లో మధుమేహం ఉన్నట్టయితే వారి కుటుంబంలో పిల్లలకు మధుమేహం వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని లక్షణాల ద్వారా పిల్లల్లో మధుమేహం వచ్చిందని గుర్తించాలంటే కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు.

పిల్లల్లో మధుమేహం లక్షణాలు ;

పిల్లలలో మధుమేహంకి సంబంధించిన చాలా లక్షణాలు పెద్దల్లో ఉండే విధంగానే ఉంటాయి. ఈ వ్యాధితో బాధపడుతున్న పిల్లలు చాలా వేగంగా బరువు తగ్గుతారు. ఈ పరిస్ధితి పిల్లలో కనిపిస్తే వెంటనే అప్రమత్తమవ్వాలి. శరీరంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుదల కారణంగా, ఆకలి పెరగడం అనేది ప్రారంభమవుతుంది. ఆహారం తిన్న తర్వాత జీర్ణం కావడానికి శరీరం శక్తి వృథా అవుతుంది. ఇక అటువంటి పరిస్థితిలో పిల్లల్లో అనేక ఇతర ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.

చాలా మంది పిల్లలు మధుమేహ రోగులు లాగే సాధారణంగా ఒక విధమైన చర్మ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు. దద్దుర్లు, పొరలుగా ఉండే చర్మం, పొడి తామర, చిన్న ఎర్రటి గడ్డలు లేదా మెడ, చంక, గజ్జల చుట్టూ చర్మం నల్లటి రంగులో మారుతుంది. పిల్లలు ఎక్కువ దాహంతో నీటిని ఎక్కువగా తాగుతుంటే అది కూడా మధుమేహానానికి సంబంధించిన ఒక లక్షణంగా గుర్తించాలి. బిడ్డ స్పష్టంగా చూడటంలో ఇబ్బందిని ఎదుర్కొంటున్నట్లయితే అది మధుమేహం యొక్క సంకేతం కావచ్చు.

ట్రెండింగ్ వార్తలు