ఏది జలుబు? ఏది కరోనా? గుర్తుపట్టెదెలా?

  • Publish Date - September 20, 2020 / 07:54 PM IST

common cold and Covid-19: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. జలుబు వచ్చినా కరోనా అని కంగారు. అందరూ టెస్ట్ ల కోం పరిగెడుతున్నారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలన్నీ ఏది కరోనా? ఏది జలుబో జనమే తేల్చుకొనేలా అవగాహన కలిగించాలని ప్రయత్నిస్తున్నాయి.

వర్షాకాలం వెళ్తోంది. శీతకాలం వస్తోంది. జలుబు కామన్. ముక్కు చీదితో కరోనా అనుకోవాలా? లేదంటే జలుబు అనుకొని సరిపెట్టుకోవాలా? ఎలా నిర్ణయించుకోవాలి?

బ్రిటన్‌లో కరోనా పరీక్షలకు రేషన్ పెట్టారు. అందరికీ ఒకేసారి టెస్ట్ లు చేయలేరుకదా? అందుకే లక్షణాలు ఉంటేనే టెస్ట్. ఇంతకీ ఆ లక్షణం ఏంటి?

తేడాను కనిపెట్టిండిలా?
ఎవరికైనా కరోనా వస్తుంది. ఇంతకుముందే రోగాలుంటే కరోనా మరీ తీవ్రంగా కనిపిస్తుంది. అప్పుడు రిస్క్. అందుకే లక్షణం కనిపిస్తేచాలు, టెస్ట్‌లకోసం పరిగెడుతున్నారు. అంతకుమించి భయపడుతున్నారు.

ఈ లక్షణాలుంటే కరోనా వచ్చినట్లు లెక్క
నిరంతరాయంగా దగ్గు
విపరీతమైన జ్వరం
వాసన, రుచి తెలియకపోవడం.

జలుబు వస్తే కరోనా వచ్చినట్లుకాదు. అది ప్రధాన రోగలక్షణం కాదు. చాలామందికి జలుబురాదు

కొంతమందికి ఊపిరాడదు. దానితోపాటు దగ్గు, జ్వరం వస్తే కరోనా వచ్చే అవకాశాలెక్కువ. పరిశోధనల ప్రకారం confusion, headaches, muscle pains, fatigue ఇవన్నీ కరోనా రెండు లేక, మూడు కలగలపి వస్తే కరోనా వచ్చినట్లు అనుకోవాలి. అమెరికా వైద్యనిపుణులైతే diarrhoeaను coronavirus symptomsగా నిర్ధారించారు.
https://10tv.in/two-types-of-steroid-found-to-save-lives-of-some-covid-19-patients/
ఎలా కరోనా వస్తుంది?
1.వైరస్ ముక్కు, నోటిద్వారా లోపలికెళ్తుంది.
2.ఆతర్వాత శ్వాస క్రియ వ్యవస్థలో కణాలను పట్టుకొంటుంది. దీన్నే హోస్ట్ సెల్ అంటారు.
3.ఈ హోస్ట్‌సెల్ పగిలి, మిగిలిన సెల్స్ కూడా కరోనాను అంటిస్తుంది.

ఎలా బతితీసుకొంటుందంటే?
1.చాలామంది రోగులకు న్యూమోనియా, లంగ్స్‌లో వాపు వస్తుంది.
2.రెస్పిరేటరీ సిస్ట్ లో వాపు కనిపిస్తుంది. అందువల్ల ఆక్సిజన్ ను ఊపిరితిత్తులు తీసుకోలేవు. అందువల్ల ప్రాణవాయువు అందక అవయవాలు పనిచేయలేవు. చివరకు మరణం.
3.న్యూమోనియా వల్ల లంగ్స్ నీరుపట్టి రోగులు చనిపోతారు.