How Using Too Much Laundry Detergent Prevents Clothes From Getting Clean
Too Much Laundry Detergent Clothes : చాలామంది బట్టలు తెల్లగా మెరిసిపోవాలని తెగ ఉతికేస్తుంటారు. గంటల కొద్ది నానబెట్టి ఎక్కువ మొత్తంలో లాండ్రీ డిటర్జెంట్ వాడేస్తుంటారు. ఇలా చేయడం వల్ల బట్టలు శుభ్రపడవు.. వాటికి పట్టిన మురికి అలానే ఉండిపోతుందని అంటున్నారు నిపుణులు. అతిగా లాండ్రీ డిటర్జెంట్ వాడటం వల్ల బట్టలపై పేరుకుపోయిన మురికిని పోకుండా అడ్డుకుంటుందని ఓ అధ్యయనంలో తేలింది. కొన్నింటి విషయాల్లో ఎంతగా క్లీన్ చేస్తే సామాగ్రి అంతగా క్లీన్ అవుతాయి. కానీ, బట్టల విషయంలో అలా కాదంటున్నారు. కంటైనర్లలో లాండ్రీ డిటర్జెంట్ పరిమిత మొత్తంలో మాత్రమే వాడాలని సూచిస్తున్నారు.
చాలామంది ఇదేం సరిపోతుందిలేనని వాషింగ్ మిషన్‌లో అతిగా డిటర్జెంట్ ఎడాపెడా పోసేస్తుంటారు. సబ్బును అతిగా కలపడం ద్వారా మిషన్ లోని బట్టలను శుభ్రపడకుండా డిటర్జెంట్ అడ్డుకుంటుంది. అంతకంటే మరింత మురికి పేరుకుపోయేలా చేస్తుందని అంటున్నారు. అపార్ట్మెంట్ థెరపీ నివేదిక ప్రకారం.. కంటైనర్లలో డిటర్జెంట్ సిఫార్సు చేసిన మొత్తం కంటే ఎక్కువ వాడొద్దని హెచ్చరిస్తున్నారు. టైడ్ ప్రకారం.. అధిక డిటర్జెంట్ కారణంగా అధికంగా నురుగు వస్తుంది.
సబ్బుతో బట్టలను క్లీన్ కాకుండా ఇది అడ్డుకుంటుంది. వాషింగ్ మెషీన్‌లో ఒకదానికొకటి స్క్రబ్ చేయకుండా బట్టలను ఆపుతాయి. శుభ్రపడనంతగా మురికిగా మారిపోతాయి. మీ లాండ్రీ నుండి వచ్చే ధూళిని కూడా ఈ బుడగలు సేకరించగలవు. జేబులో లేదా చొక్కా కాలర్ దిగువ భాగంలో ఉన్న మడతలో నురుగు చిక్కుకున్నట్లయితే బ్యాక్టీరియా అక్కడ ఉండిపోతుంది. మోడ్రాన్ వాషింగ్ మెషీన్లు డిటర్జెంట్‌ను కడిగేలా డిజైన్ అయ్యాయి.
మీరు మీ బట్టలపై ఎక్కువ మొత్తంలో సబ్బును వినియోగించరాదు. లేదంటే.. నురుగు ఎక్కువగా వచ్చి.. దాన్ని శుభ్రపరచడానికి వాషింగ్ మిషన్ పై లోడ్ పడే అవకాశం ఉంది. మీ లాండ్రీని ఎక్కువగా నురుగులు రాకుండా ఉండేందుకు ఒక్కటే సరైన మార్గం.. డిటర్జెంట్ క్యాప్ లోపలి భాగంలో తగినంత మొత్తంలో మాత్రమే నింపాలి. తక్కువ డిటర్జెంట్‌ను మాత్రమే వాడండి..