Bad Cholesterol : చెడు కొలెస్ట్రాల్ పెరిగితే…అనారోగ్య సమస్యలు ఖాయం

రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉండడం వల్ల రక్తనాళాల్లో బ్లాకేజ్‌ ఏర్పడి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది.

Bad Cholesterol

Bad Cholesterol : శరీరంలో కొలెస్ట్రాల్​ ఎక్కువైతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. రక్తపోటు, ఊబకాయం, గుండె పోటు, నడుము నొప్పులు, కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పులు, కిడ్నీ, మెదడుకు సంబంధించిన సమస్యలు ఎక్కువవుతాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉండడం వల్ల రక్తనాళాల్లో బ్లాకేజ్‌ ఏర్పడి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది.

చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గించుకునేందుకు ఆహారంలో, జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. సాల్యుబుల్‌ ఫైబర్‌ , కరిగి పోయే పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఓట్స్‌, బార్లీ, నల్లసెనగలు, చిక్కుడు జాతి గింజలు, అలసందలు, రాజ్మా లాంటి గింజలు బెండ, వంకాయ లాంటి కూరగాయలు తీసుకోవటం వల చెడు కొవ్వులను కరిగించుకోవచ్చు. అంతేకాకుండా బాదం, ఆక్రోట్‌ లాంటి నట్స్‌, ఆపిల్‌, ద్రాక్ష, నారింజ లాంటి పండ్లను ఏదో ఒక రూపంలో రోజు వారీ ఆహారంలో చేర్చుకుంటే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గేందుకు ఉపయోగపడతాయి.

చెడు కొలెస్ట్రాల్‌ను పెంచే ఆహారానికి కూడా దూరంగా ఉండాలి. ఉప్పు తగిన మోతాదులో తీసుకోవాలి. ముఖ్యంగా ట్రాన్స్‌ఫాట్స్‌ అధికంగా ఉండే బేకరీ ఫుడ్స్‌, ఫాస్ట్‌ఫుడ్స్‌, సాచ్యురేటెట్‌ ఫ్యాట్స్‌ అధికంగా ఉండే మాంసాహారం, వేపుళ్ళు, అన్ని రకాల స్వీట్లు, మొదలైన వాటిని మానెయ్యాలి. తక్కువ నూనెతో వండిన చికెన్‌, చేప లాంటి వాటిని వారానికి ఒకసారి తీసుకుంటే మంచిది. ఆహారంతోపాటుగా ప్రతి రోజూ అరగంట పాటు వ్యాయామం చేయటం వల్ల గుడ్ కొలెస్ట్రాల్ పెరిగి చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది.