If the eyes are red and itchy and burning, don't ignore it!
Conjunctivitis : కళ్లు ఎర్రగా మారడం సాధారణంగా చాలా మందిలో కనిపించే సమస్య . కంటికి ఏచిన్న సమస్య ఎదురైనా ఎర్రబడుతుంది. దుమ్ము, ధూళీ, నిద్రలేమి, ఇన్ ఫెక్షన్స్ వంటి కారణాల వల్ల కంటికి ఇబ్బందులు తలెత్తుతాయి. దీంతో కళ్లు ఎర్రబారుతాయి. ప్రస్తుత సీజన్ లో కండ్ల కలక సమస్యలు అధికంగా వస్తాయి. ఇలాంటి సందర్భాలలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ కళ్లు ఎర్రబారడంతో పాటు దురదగా ఉండడం, మంటగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కండ్ల కలక దీనినే కంజెక్టివైటీస్ అని కూడా పిలుస్తారు. ఇది ఒక అంటు వ్యాధి. ఇంట్లో ఒకరికి వస్తే మిగిలిన వారికి వస్తుంది. దీనికి నాలుగైదు రోజుల చికిత్స, ఐసోలేషన్ అవసరం అవుతుంది.
కండ్ల కలక లక్షణాలు, నివారణ మార్గాలు ;
కండ్ల కలక వస్తే కండ్లు ఎర్రగా మారతాయి. కంటి వెంట నీరు కారుతుంది. రెప్పలు ఉబ్బిపోయి ఉంటాయి. రాత్రి నిద్రపోయినప్పుడు అతుక్కొని పోతాయి. కొందరిలో ఈ లక్షణాలు వారంలో తగ్గిపోతాయి. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు యాంటీ బయోటిక్ డ్రాప్స్ వైద్యుల సలహాతో వాడుకోవాలి. కంటిని తరుచుగా నీటితో శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల తొందరగా సమస్య నుండి బయటపడవచ్చు. కండ్ల కలకతో బాధపడుతున్న వారు ఇతరుకలు దూరంగా ఉండటం మంచిది. వారు ఉపయోగిస్తున్న టవల్స్ ఇతర వస్తువులను ముట్టకుండా ఉండాలి.
కళ్లు చాలా సున్నితమైన జ్ఞానేంద్రియాలు. వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఎలర్జీలు బాధించేవారు, కాంటాక్ట్ లెన్సులు వాడేవారు తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పదు. చేతులు శుభ్రంగా ఉంచుకోవడం. అవసరం లేకుండా చేతులు కంటికి దగ్గరగా తీసుకోకపోవడం, కళ్లు నలుపుకోవడం వంటి పనులు చెయ్యకూడదు. ముఖం లాగే కళ్లను కూడా శుభ్రమైన నీటితో తరచుగా శుభ్రం చేసుకోవడం అవసరం. కంటి రెప్పలు అతుకుంటున్నా. మంటగా అనిపించినా డాక్టర్‌ను సంప్రదించాలి.