Dark Circles Under The Eyes : కంటి కింద నల్లటి వలయాలతో ఇబ్బందిపడుతుంటే ఈ చిన్న చిట్కాలతో !

నల్లటి వలయాలను పోగొట్టుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఏమాత్రం ప్రయోజనం ఉండదు. ఇందుకోసం మార్కెట్లో లభించే వివిధ రకాల సౌందర్య ఉత్ప్తుతలను కొనుగోలు చేసి ఉపయోగిస్తుంటారు.

Dark Circles Under Eyes

Dark Circles Under The Eyes : గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చుని పని చేయడం, రాత్రి నిద్రమేల్కొని ఉండటం, తక్కువ సమయం నిద్రపోవటం, ఒత్తిడి, మొబైల్ ఫోన్ ను అధికంగా వినియోగించడం, ఆహారపు అలవాట్లు, హార్మోన్ లలో మార్పులు, వివిధ రకాల మందులు వాడటం తదితర కారణాల వల్ల చాలా మందిలో కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడతాయి. ఈ నల్లటి వలయాలను పోగొట్టుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఏమాత్రం ప్రయోజనం ఉండదు. ఇందుకోసం మార్కెట్లో లభించే వివిధ రకాల సౌందర్య ఉత్ప్తుతలను కొనుగోలు చేసి ఉపయోగిస్తుంటారు. అయినప్పటికీ ఫలితం శూన్యంగా ఉంటుంది.

అలాంటి వారికి సింపులు చిట్కాలు బాగా ఉపకరిస్తాయి. కంటి కింద నల్లటి వలయాలను ఇంట్లో లభించే వస్తువులతోనే సులభంగా తొలగించుకోవచ్చు. అవేంటో చూద్దాం..

అల్లం ముక్కలు, తులసి ఆకులతో ;

ఇందుకు గాను ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ నీరు పోసుకోవాలి. నీరు బాగా మరిగిన తరువాత అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, పది తాజా తులసి ఆకులు, పావు టేబుల్ స్పూన్ కుంకుమపువ్వు వేసి పది నిమిషాల పాటు బాగా మరిగించాలి. అనంతరం ఆనీటిని వడగట్టుకోవాలి. అందులో కొద్దిగా తేనెను కలుపుకుని సేవించాలి. ఈ హెర్బల్ టీను రోజుకు ఒకసారి కనుక తీసుకుంటే కళ్ళ చుట్టూ ఏర్పడిన నల్లటి వలయాలు క్రమంగా తొలగిపోతాయి.

బాదం పాలు, విటమిన్ ఈ అయిల్ తో ;

ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు బాదం పాలు, హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, అర టేబుల్ స్పూన్ పసుపు వేసి అన్నీ కలిసేంత వరకు బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని కళ్ళ చుట్టూ అప్లై చేసి కనీసం ఇరవై నిమిషాల పాటు వదిలేయాలి. అనంతరం గోరువెచ్చని నీటితో కళ్లను క్లీన్ చేసుకోవాలి. ప్రతిరోజు ఇలా చేస్తుంటే కొద్ది రోజుల్లోనే నల్లటి వలయాలు పోతాయి.

ట్రెండింగ్ వార్తలు