High Cholesterol
High Cholesterol Problem : కొలెస్ట్రాల్ మీ రక్తంలో కనిపించే ఒక విధమైన మైనపు పదార్థం. ఆరోగ్యకరమైన కణాలను నిర్మించడానికి శరీరానికి కొలెస్ట్రాల్ అవసరం ఉంటుంది. అయితే అధిక స్థాయి కొలెస్ట్రాల్ మాత్రం గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.
అధిక కొలెస్ట్రాల్‌తో రక్త నాళాలలో కొవ్వు నిల్వలు పేరుకుపోయి చివరికి, ఈ నిక్షేపాలు పెరుగుతాయి, దీంతో ధమనుల ద్వారా తగినంత రక్తం ప్రవహించడం కష్టతరం చేస్తుంది. కొన్నిసార్లు, ఆ నిక్షేపాలు అకస్మాత్తుగా గుండెపోటు లేదా స్ట్రోక్‌కు కారణమవుతాయి. సంతృప్త కొవ్వు లేదా ట్రాన్స్ ఫ్యాట్స్ తినడం వల్ల అనారోగ్య కొలెస్ట్రాల్ స్థాయిలు ఏర్పడతాయి.
ధూమపానం మంచి కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది,మద్యం ఎక్కువగా తాగడం వల్ల మొత్తం కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. అధిక కొలెస్ట్రాల్ వారసత్వంగా కూడా వచ్చే అవకాశం ఉంది. అనారోగ్య కరమైన జీవనశైలి నివారించటం, ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం , వైద్యులు సూచించే మందులు అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.
అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉంటే కనిపించే లక్షణాలు ;
కాళ్లు తిమ్మిర్లు ; కాళ్లు తిమ్మిరి పట్టడం కన్పిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదు. ఇలా ఉంటే చెడు కొలెస్ట్రాల్ ఉందనటానికి ఒక లక్షణం కావచ్చు. ఆర్టరీస్ ద్వారా రక్తం సరఫరా, ఆక్సిజన్ సరఫరాలో సమస్య రావచ్చు. దీనివల్ల కాళ్ల నొప్పి సమస్యలు పెరుగుతాయి.
గోళ్ల రంగు మారడం ; శరీరంలో చెడు కొలెస్ట్రాల్ సమస్య పెరిగినప్పుడు ధమనుల్లో కొవ్వు పేరుకుపోతుంది. దీనివల్ల రక్త నాళికల్లో రక్త ప్రవాహానికి అవరోధం ఏర్పడుతుంది. చేతులు, కాలి వేళ్ల వరకూ రక్త సరఫరాలో ఇబ్బంది ఏర్పడి గోర్ల రంగు గులాబీ రంగునుండి పసుపుగా మారుతాయి. కొలెస్ట్రాల్ పెరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు.
అధిక రక్తపోటు ; శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు నేరుగా అధిక రక్తపోటుకు దారితీస్తుంది. రక్తంలో కొవ్వు ఎంత ఎక్కువగా ఉంటే సమస్య తీవ్రత అంత అధికంగా ఉంటుంది. దీనివల్ల రక్త సరఫరాలో ఇబ్బంది ఏర్పడి రక్తం గుండె వరకూ చేరక రక్త నాళికలపై ఒత్తిడి పెరుగుతుంది.