If you want your hair to grow and be silky and shiny, do this with a chicken egg!
Hair To Grow : కోడి గుడ్డు జుట్టుకు అనేక ప్రయోజనాలను కలగిస్తుంది. గుడ్డులోపలి సొన జుట్టుకు రాసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. గుడ్డు జుట్టును బలంగా ఉంచడమే కాకుండా, ప్రకాశవంతంగా అందంతా, ఒత్తుగా మార్చుతుంది. గుడ్డులోని తెల్లని సొనను జుట్టుకు పట్టించి కొంత సేపటి తరువాత తలస్నానం చేస్తే జుట్టు మెరుస్తు, సిల్కీగా అందంగా ఉంటుంది. జుట్టుకు 70 శాతం ప్రొటీన్ అవసరం అవుతుంది. అయితే గుడ్డులో ఉండే బికాంప్లెక్స్ విటమిన్లు జుట్టుకు సహాయకారిగా ఉపయోగపడతాయి.
గుడ్డులోని బి కాంప్లెక్స్ దెబ్బతిన్న జుట్టు కెరాటిన్ ను ఇది నయంచేసి జుట్టు రాలకుండా చేస్తుంది. పచ్చసొనలో బికాంప్లెక్స్ విటమిన్స్, ఫోలిక్ ఆమ్లం ఉంటాయి. పొడి జుట్టు ఉన్నవారు ఈ పచ్చసొననే అంటించాలి, ఎందుకంటే ఇది జుట్టును బాగా కండీషన్ చేస్తుంది.
జిడ్డు జుట్టు ఉన్నవారికి తెల్ల సొన మంచిది. పొడి జుట్టు ఉన్న వారికి పచ్చ సొన మేలు కలిగిస్తుంది. అయితే ఎక్కువ శాతం తెల్ల సొననే జుట్టుకు కలిపే మిశ్రమాల్లో ఎక్కువగా వాడుతుంటారు. గుడ్డులో ఉన్న తెల్ల సొనలో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో నియాసిన్, రిబోఫ్లేవిన్, మెగ్నీషియం, పొటాషియం, సోడియం లాంటి ఖనిజాలు జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
తెల్ల సొన, పచ్చసొన కలిపి ఉన్న మొత్తం గుడ్డుని జుట్టుకు అప్లై చేసినా మంచి ఫలితం ఉంటుంది. పచ్చసొనలో తెల్లసొనకంటే కొంత తక్కువ ప్రొటీన్స్ ఉంటాయి.
జుట్టు పెరుగుదలకు ఇలా చేసి చూడండి ;
ముందుగా 2 గుడ్లు, 1 టీస్పూన్ ఆముదం నూనె తీసుకోవాలి. రెండు గుడ్లను గిన్నలో పగలకొట్టి బాగా కలపాలి. 1 చెంచా ఆముదం నూనెను అందులో వేసి ఆ మిశ్రమాన్ని జుట్టుకు ప్యాక్ లా వేసుకోవాలి. 20 నిషాల వరకు జుట్టును అలాగే వదిలేయాలి. ఆ తరువాత చల్లటి నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు ఒత్తుగా బాగా పెరుగుతుంది.