Soya Milk : ఎముకల బలంతోపాటు…బరువు తగ్గించే… సోయాపాలు

ఈ పాలను తీసుకోవటం వల్ల శరీరానికి పీచు అందుతుంది. త్వరగా ఆకలి కూడా వేయదు. మోనోపాజ్ దశకు చేరుకునే మహిళల్లో ఈస్ట్రోజన్ హార్మోను తగ్గిపోతుంది.

Soya Milk

Soya Milk : సోయాపాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పాలల్లో ఫ్యాటీ ఆమ్లాలు, మాంసకృత్తులు, పీచు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని ఇవ్వటమే కాకుండా చురుగ్గా పనిచేసేందుకు తోడ్పడతాయి. ఈ పాలను తరచూ తీసుకోవటం వల్ల మోనో, పాలీ అన్ శాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించటానికి తోడ్పడతాయి.

సోయాపాలలో ఉండే ఒమేగా3, 6 ఫ్యాటీ యాసిడ్లు అత్యంత శక్తి వంతమైన ఫైటో యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఫ్రీరాడికల్స్ వల్ల కలిగే హానిని నియంత్రిస్తాయి. దీని వల్ల ఆరోగ్యమే కాదు అందం కూడా మెరుగవుతుంది. సోయాపాలల్లో సహజంగానే చక్కెర తక్కువగా ఉంటుంది. అంతేకాదు కేలొరీల పరంగా ఇది వెన్నతీసిన పాలతో సమానం. బరువు తగ్గటంలో ఇవి ఎంతో బాగా ఉపకరిస్తాయి.

ఈ పాలను తీసుకోవటం వల్ల శరీరానికి పీచు అందుతుంది. త్వరగా ఆకలి కూడా వేయదు. మోనోపాజ్ దశకు చేరుకునే మహిళల్లో ఈస్ట్రోజన్ హార్మోను తగ్గిపోతుంది. హృద్రోగం, మధుమేహం , అధిక బరువు వంటి సమస్యలు ఆసమయంలో వేధిస్తుంటాయి. అలాంటి వారికి సోయాపాలు చక్కని ఉపశమనంగా చెప్పవచ్చు. సోయాలోని ఫైటో ఈస్ట్రోజెన్ ఈ హార్మోన్ లోపాన్ని సరిచేస్తుంది.

వయసు పెరిగే కొద్దీ చాలా మంది మహిళల్లో కనిపించే మరో సమస్య ఆస్టియోపోరోసిస్. ఆసమస్య తీవ్రతను కొంతవరకు తగ్గించుకోవాలంటే సోయాపాలు సరైన పరిష్కారంగా నిపుణులు సూచిస్తున్నారు. సోయాపాలలో ఉండే ఫైటో ఈస్ట్రోజన్ ఎముకలకు తగిన కాల్షియం అందేలా తోడ్పడుతుంది.