Melting Belly Fat : బెల్లీ ఫ్యాట్ కరిగించటంతోపాటు, అధిక బరువు సమస్యకు చెక్ పెట్టే జీలకర్ర, వాము వాటర్!

జీలకర్ర, వాము రెండింటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం మెటబోలిజం వేగవంతం కావటంతోపాటు కొవ్వు కరిగేలా చేయటంలో ఈ వాటర్ బాగా ఉపకరిస్తాయి. శరీరాన్ని హైడ్రైట్‌గా ఉంచుతుంది.

Melting Belly Fat : బెల్లీ ఫ్యాట్ కరిగించటంతోపాటు, అధిక బరువు సమస్యకు చెక్ పెట్టే జీలకర్ర, వాము వాటర్!

In addition to melting belly fat, cumin water, which checks the problem of excess weight!

Updated On : October 21, 2022 / 6:26 AM IST

Melting Belly Fat : శరీరంలో తగినంత కదలిక లేకపోవడం వంటివన్నీ బెల్లీ ఫ్యాట్ సమస్య వస్తుంది. దీనికి తోడు అధిక బరువు కూడా చాలా మందిలో ఇబ్బందికరమైన సమస్యల్లో ఒకటిగా మారింది. అందులోనూ బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడం మరింత కష్టమైన పని. డైజెషన్ సరిగ్గా లేకపోవడం, హార్మోన్ల సమస్యలు, ఫిజికల్ యాక్టివిటీ పెద్దగా లేకపోవడం, వృత్తిరీత్యా ఎక్కువ సేపు కూర్చుని ఉండటం, శరీరంలో తగినంత కదలిక లేకపోవడం వంటివన్నీ బెల్లీ ఫ్యాట్ సమస్యను తెచ్చిపెడతాయి.

బెల్లీ ఫ్యాట్ , అధిక బరువు సమస్యల నుండి బయటపడాలంటే ఇందుకు జీలకర్ర, వాము వాటర్ అద్భుతంగా పనిచేస్తాయని అయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. మనం రోజూ తినే ఆహారం శరీరంలో సరిగ్గా జీర్ణమైతే మన ఆరోగ్యం సక్రమంగా ఉంటుంది. లేకపోతే అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయి. నిరంతరం మెరుగైన జీర్ణక్రియ కలిగి ఉంటే సరిపోతుంది. జీర్ణ క్రియను పెంచటంలో జీలకర్ర, వాము బాగా ఉపకరిస్తాయి.

జీలకర్ర, వాము రెండింటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం మెటబోలిజం వేగవంతం కావటంతోపాటు కొవ్వు కరిగేలా చేయటంలో ఈ వాటర్ బాగా ఉపకరిస్తాయి. శరీరాన్ని హైడ్రైట్‌గా ఉంచుతుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించేందుకు ఉపయోగపడతాయి. భోజనం తరువాత కడుపులో మంట వంటి సమస్యతో బాధపడేవారు భోజనం తరువాత కొద్దిగా జీలకర్ర, వాము నీరు తాగితే ఉపశమం కలుగుతుంది. మలబద్దకం సమస్యను తొలగిస్తుంది. రక్తప్రసరణ సక్రమంగా ఉండి గుండె పనితీరును మెరుగు పరచటంలో ఈ వాటర్ సహాయకారిగా పనిచేస్తుంది. మెదడు చురుగ్గా ఉండేలా చేస్తుంది.

జీలకర్ర, వాము వాటర్ తయారీ ;

ముందుగా జీలకర్ర, వామును నీళ్లలో వేసి బాగా మరిగించాలి. ఈ నీళ్లు చల్లారిన తరువాత భోజనం తరువాత మద్యాహ్నం, లేదంటే రాత్రి భోజనం తరువాతైనా తీసుకోవాలి. ఇలా రోజూ చేయడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. నెలరోజుల్లోనే శరీరంలో అనేక మార్పులు గమనించవచ్చు. ఇందులో తక్కువ కేలరీలు ఉండటం వల్ల అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చు.