Sweet Potatoes : బరువు తగ్గటంతోపాటు, గుండె ఆరోగ్యానికి మేలు చేసే చిలకడ దుంపలు!

చిలకడ దుంపల్లోని బీటా కెరోటిన్ రక్తకణాల అభివృద్ధికి తోడ్పడుతుంది. దీనిలో ఉండే ఐరన్ తో హిమోగ్లోబిన్ స్ధాయిలు పెరిగి అనిమియా సమస్యలు దూరమౌతాయి.

Sweet Potatoes : చిలకడ దుంపల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. తియ్యగా ఉండే ఈ దుంపలను వేపుడు కూరగా, ఉడికించుకుని, కాల్చుకుని తినవచ్చు. చిలకడ దుంపల్ని తొక్కతో సహా తినాలి. చిలకడ దుంపల్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, మంచి ఫ్యాట్, ఫైబర్, విటమిన్ A, C, మాంగనీస్, విటమిన్ B6, పొటాషియం, పాంటోథెనిక్ యాసిడ్, కాపర్ , నియాసిన్ వంటి పోషకాలు వీటిలో ఉంటాయి.

పిండిపదార్ధాలతోపాటు చక్కెర అధికంగా ఉంటుంది. పొటాషియం అధిక మోతాదులో ఉంటుంది. బిపీని అదుపులో ఉచుకోవచ్చు. వీటిని రోజు వారి ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల మూత్రపిండాల సమస్యలు దరిచేరవు. వాపులు, కండరాల తిమ్మిర్లు వంటి సమ్యల నుండి ఉపశమనం కలుగుతుంది. వీటిల్లో విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది. యాంటీ క్యాన్సర్ కారకంగా పనిచేస్తుంది. చిలకడ దుంపల్లోని యాంటీఆక్సిడెంట్లు కాన్సర్ కణాలతో పోరాడగలవని పరిశోధనల్లో తేలిది. కొన్ని రకాల క్యాన్సర్ కణాలు త్వరగా పెరగకుండా చేస్తాయి.

వృధ్ధప్య లక్షణాలు దరిచేరకుండా చేయటంలో చిలగడ దుంప ఎంతగానో దోహదపడుతుంది. చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. ఇందులో ఉండే కాల్షియం వల్ల ఎముకలు ధృఢంగా మారుతాయి. రోగనిరోధక శక్తిని పెంచటంలో విటమిన్ సి ఉపకరిస్తుంది. దీని వల్ల జబ్బులు త్వరగా దరిచేరవు. పిండిపదార్ధాలతో పాటు ఫైబర్ కూడా ఉండటం వల్ల జీర్ణశాయం ఆరోగ్యంగా ఉంటుంది. ఎసిడిటీ, అల్సర్లు వంటివాటిని నివారిస్తుంది. జీర్ణక్రియలు వేగవంతం అవుతాయి.

చిలకడ దుంపల్లోని బీటా కెరోటిన్ రక్తకణాల అభివృద్ధికి తోడ్పడుతుంది. దీనిలో ఉండే ఐరన్ తో హిమోగ్లోబిన్ స్ధాయిలు పెరిగి అనిమియా సమస్యలు దూరమౌతాయి. మధుమేహంతో బాధపడుతున్నవారు చిలకడ దుంపలు ఒక వరం లాంటివి, అధిక బ్లడ్ షుగర్ ను తగ్గిస్తాయి. చిలగడదుంపలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మన జీర్ణ వ్యవస్థలో ఉండటం వల్ల మనకు ఆకలిని తగ్గిస్తుంది. దీనివల్ల ఆహారం తక్కువగా తీసుకుంటాము. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే మెగ్నీషియం గుండె ధమనులకు ఎంతో మేలు చేస్తుంది. హార్ట్ బీట్ సరిగా ఉండేందుకు దోహదం చేస్తుంది.

ట్రెండింగ్ వార్తలు