Summer Eye Care (1)
Eye Care : వేసవిలో వేడి తట్టుకోవడానికి మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. కూలర్లు, ఏ సి లను వాడతాం. గొంతు ఎండి పోయినప్పుడు నీరు, కూల్ డ్రింక్ లు తాగుతాము. కాని కళ్ళకు వేడి తగలకుండా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోము. శరీరం, ముఖం తో పాటు వేసవిలో కంటి రక్షణ చాలా అవసరం. వేసవిలో కంటి సంరక్షణ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వేసవి తాపం నుండి కళ్లను కాపాడుకోవచ్చు. వేసవిలో పొడి వాతావరణం వలన పెరిగిన దుమ్ము, తేమ వలన కళ్లల్లో ఎర్రదనము వస్తుంది. వీటితో పాటు కంటి రెప్పల మీద కురుపులు వస్తాయి.
జీవన శైలిలో మార్పులు, షిఫ్ట్ లు వారిగా ఉద్యోగాల కారణంగా కళ్ళు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. దీని వల్ల కళ్ళు పొడిబారి పోతున్నాయి. ఎండల కారణంగా కాంతివంతమై కనుగుడ్లు ఎరుపెక్కడం, ఉదయానికి కంటి కింద భాగం ఉబ్బెత్తుగా అవ్వడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. వేసవికాలం ఈ సమస్య ఇంకా ఎక్కువ అయ్యే ప్రమాదం పొంచి ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
వేసవిలో మధ్యాహ్న సమయంలో వాహన ప్రయాణంలో కళ్ళద్దాలతో పాటు, హెల్మెట్ పెట్టుకోవడం తప్పనిసరిగా ధరించాలి. తగినంత పోషకాలు, నీరు తీసుకుంటే వేసవిలో కంటి సమస్యలు రావు. విటమిన్ ఏ సమృద్దిగా ఉండే ఆకు కూరలు, చేపలు, పండ్లు, క్యారెట్, గుడ్లు ఎక్కువగా తీసుకోవాలి. వేసవిలో కాంతిలో కళ్ళల్లో దుమ్ము, తేమ తగ్గడం వల్ల కళ్ళు ఎరుపెక్కడం, కంటి కురుపులు వస్తాయి. కనుక కంటిలో దుమ్ము పడకుండా చూసుకోవాలి. ఎండలో నుంచి రాగానే కళ్ళు, ముఖం చల్లటి నీటితో కడుక్కోవాలి. రోజుకి 8 గంటలు నిద్ర పోవటం అలవాటుగా మార్చుకోవాలి. కంటి అందం పేరుతో ఆడవారు వాడే సౌందర్య ఉత్పత్తులు వాడకం తగ్గించాలి.
ఎండలో బయట తిరిగే వారు తప్పనిసరిగా యూవీ కిరణాల నుండి రక్షించే సన్ గ్లాసెస్ ను ఉపయోగించాలి. మార్కెట్లో దొరికే సాధారణ కళ్ళ జోడ్లను వాడటం వల్ల వాటి వల్ల రక్షణ కలగకపోను కళ్లకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటాయి. సూర్యుడి కిరణాలు నేరుగా కళ్లపై పడకుండా తలకు టోపీని ధరించటం అలవాటుగా మార్చుకోండి. దీని వల్ల సూర్యకిరణాలు నేరుగా కళ్లపై పడకుండా చూడవచ్చు. చర్మం, కళ్లు రెండు హైడ్రేట్ గా ఉండటానికి నీరు ఎక్కువగా సేవించాలి. వీలైనంత వరకు మద్యాహ్న సమయంలో ఎండకు బయటకు వెళ్ళటాన్ని తగ్గించండి.
ఎండాకాలంలో కంటి చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి. కొబ్బరి నూనెను వేలితో తీసుకొని కంటి చుట్టూ గుండ్రంగా పూయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే కంటి చుట్టూ ఉండే నల్లని వలయాలు పోతాయయి. నీటిలో కొంచెం ఉప్పు కలిపి ఆ నీటితో కళ్ళను కడిగితే కళ్ళు నిర్మలంగామారి, మెరుస్తాయి. కంటిలో ఎటువంటి ఇబ్బంది వచ్చినా వైద్య పరీక్షకు వెళ్లి డాక్టకు సూచన మేరకు మాత్రమే మందులు వాడాలి. సొంతగా కంటిచుక్కలు వేసుకోవడం లాంటివి చేయకూడదు. వేసవిలో కంటి సంరక్షణా జాగ్రత్తలు తీసుకొన్నట్లతే వేసవి తాపం నుండి కళ్ళను కాపాడుకోవచ్చు.