Cabbage : వారానికి ఒక్కరోజైనా దీనిని మీ డైట్ లో చేర్చుకోండి!

బరువు తగ్గాలనుకునే వారికి క్యాబేజ్ మంచి ఆప్షన్. బరువు పెరుగుతామనే భయం లేకుండా హ్యాపీగా క్యాబేజ్ ను తినవచ్చు. డయాబెటిస్ తో బాధపడుతున్నవారికి బ్లడ్ షుగర్ ను రెగ్యులేట్ చేయటంలో ఇది సహాయపడుతుంది.

Cabage

Cabbage : క్యాబేజీని ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల అనేక ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయి. క్యాబేజీతో వివిధ రకాల వంటకాలు చేసుకునే తినవచ్చు. అయితే చాలా మంది క్యాబేజీ వాసన అంటే పడదు. దానిని తినేందుకు ఏమాత్రం ఇష్టపడరు. అయితే క్యాబేజీని తినకపోవటం వల్ల అనేక పోషకాలు శరీరానికి అందకుండా పోతాయి.

క్యాబేజీలోని కాల్షియం, మెగ్నీషియం, పొటాషియంలు ఎముకలకు బలాన్నిస్తాయి. క్యాబేజీలో సల్ఫర్ తో పాటు విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని రెట్టింపు చేస్తుంది. క్యాన్సర్‌తో బాధపడుతున్న వారు క్యాబేజీ వాడితే రక్తహీనత తొలగిపోతుంది. అదనపు క్రొవ్వు కరిగిపోతుంది. దీన్ని కనీసం వారానికి ఒక్కసారైనా డైట్ లో భాగంగా చేసుకుంటే మంచి బెనిఫిట్స్ పొందవచ్చు.

బరువు తగ్గాలనుకునే వారికి క్యాబేజ్ మంచి ఆప్షన్. బరువు పెరుగుతామనే భయం లేకుండా హ్యాపీగా క్యాబేజ్ ను తినవచ్చు. డయాబెటిస్ తో బాధపడుతున్నవారికి బ్లడ్ షుగర్ ను రెగ్యులేట్ చేయటంలో ఇది సహాయపడుతుంది. అల్సర్ ను తగ్గించేందుకు క్యాబేజీ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

క్యాబేజ్ ను డైట్ లో భాగంగా చేసుకుంటే కార్డియోవాస్కులర్ హెల్త్ మెరుగవుతుంది. శరీరంలోని ఇన్ఫ్లమేషన్ ను తగ్గించేందుకు క్యాబేజ్ ఉపయోగపడుతుంది. లివర్ శుభ్రపరుస్తుంది. శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు తొలగిపోతాయి. వాపులను తగ్గించడంలో క్యాబేజీ బాగా పనిచేస్తుంది. క్యాబేజీ రక్తపోటును నియంత్రిస్తుంది. ఇందులోని పొటాషియం రక్తనాళాలను తెరుచుకునేలా చేసి రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది.

కేన్సర్‌కు కారణమయ్యే పదార్థాల ప్రతి చర్యను అడ్డుకుని, హానికరమైన విషతు ల్యాలు, హార్మోన్లను తొలగించి, కేన్సర్‌తో పోరాడగల యాంటీబాడీల ఉత్పత్తిని పెంచటంలో సహాయపడుతుంది. పచ్చి క్యాబేజీని లేదా కొద్దిగా ఉడికించి వారానికి మూడుసార్లు కంటే ఎక్కువగా తిన్నవారిలో బ్రెస్ట్‌కేన్సర్‌ అవకాశాలు బాగా తక్కువగా ఉన్నట్లు అధ్యయనాల్లో తేలింది. క్యాబేజీ ఆకుల్ని విడిగా తీసి దెబ్బలు, నొప్పులు, చర్మసమస్యలపై, కాలిన గాయాలపై కడితే ఉపశమనం కనిపిస్తుంది.