Vitamin D : విటమిన్ డి శరీరానికి అందాలంటే ఈ ఆహారాలను మీ మెనులో చేర్చండి చాలు!

గుడ్డులోని తెల్లటి భాగంలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. గుడ్లు తినడం ద్వారా, మనకు అవసరమైన విటమిన్ డి మనకు లభిస్తుంది. ఏ కారణం చేతనైనా పాలు తాగలేని వారికి గుడ్లు మంచి ఎంపిక.

Vitamin D

Vitamin D : విటమిన్ డి లోపం కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. విటమిన్ డి మన శరీరంలో కాల్షియం శోషణకు సహాయకారిగా ఉపయోగపడుతుంది. విటమిన్ డి వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. ఎముకలు బలంగా అవుతాయి. కండరాల నిర్మాణం కూడా బాగుంటుంది. దంతాలు కూడా స్ట్రాంగ్ గా ఉంటాయి. విటమిన్ డి సూర్యరశ్మి ద్వారేనే కాకుండా ఆహారాల ద్వారా లభిస్తుంది. మన లైఫ్ స్టైల్ లో కొన్ని మార్పులు, మంచి ఆహారపు అలవాట్ల వల్ల విటమిన్ డి ని పొందొచ్చు. శరీరంలో విటమిన్ డి తక్కువగా ఉంటే కొన్ని ఆహారాలను రోజువారిగా తీసుకోవటం ద్వారా పెంపొందించుకోవచ్చు.

విటమిన్ డి పొందేందుకు తీసుకోవాల్సిన ఆహారాలు ;

1. సోయా బీన్స్ : సోయా బీన్స్ మన ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఈ సోయా బీన్స్ లో విటమిన్ డి అధికంగా ఉంటుంది. ఇది మీలో విటమిన్ డి లోపాన్ని పోగొడుతుంది.

2. బచ్చలికూర ; బచ్చలికూరను తింటే కూడా విటమిన్ డి అందుతుంది. బచ్చలి కూరలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ, పొటాషియం, కాల్షియం వంటి అనేక భాగాలు ఉంటాయి. బచ్చలి కూరను తినడం వల్ల ఒక రోజుకు అవసరమైన విటమిన్ డి లో 25 శాతం అందుతుంది.

3. పుట్టగొడుగులు ; పుట్టగొడుగులు విటమిన్ డి కి మంచి వనరు. పుట్ట గొడుగులలో కనిపించే సెలీనియం అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పుట్టగొడుగులను తినడం వల్ల బరువు కూడా తగ్గుతారు.

4. ఆవుపాలు ; పాలు విటమిన్ డి మరియు కాల్షియం యొక్క అద్భుతమైన మూలం. ప్రతిరోజూ ఒక గ్లాసు పాలు తాగడం ద్వారా, రోజుకు అవసరమైన విటమిన్ డి మనకు లభిస్తుంది. పాలులో ప్రోటీన్, కాల్షియం, భాస్వరం, మెగ్నీషియం, మాంగనీస్ మరియు జింక్‌తో పాటు, విటమిన్లు డి మరియు కె కూడా ఇందులో ఉన్నాయి.

5. గుడ్లు ; గుడ్డులోని తెల్లటి భాగంలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. గుడ్లు తినడం ద్వారా, మనకు అవసరమైన విటమిన్ డి మనకు లభిస్తుంది. ఏ కారణం చేతనైనా పాలు తాగలేని వారికి గుడ్లు మంచి ఎంపిక. రోజుకి ఒకటి లేదా రెండు గుడ్లు తీసుకోవడం ద్వారా విటమిన్ డి తో పాటు అనేక పోషకాలు విటమిన్లు లభిస్తాయి.

6. సీ ఫుడ్ ; ఫ్యాటీ ఫిష్ లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. పుట్టగొడుగుల్లో కూడా విటమిన్ డి ఉంటుంది. అంతేకాదు నాటు కోడి గుడ్లలో కూడా ఈ విటమిన్ ఉంటుంది. పాలు, పెరుగు వంటి పాల ఉత్పత్తుల్లో కూడా విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. గుడ్డులో కూడా ఇది ఉంటుంది.

7. నారింజ ; నారింజను తీసుకోవటం ద్వారా శరీరానికి కావాల్సిన విటమిన్ డిని పొందవచ్చు. దీని రసంలో కాల్షియం, ఇనుము, జింక్, మెగ్నీషియం మరియు భాస్వరం, విటమిన్లు ఎ,బి,సి,డి కూడా కనిపిస్తాయి . ఇది కాకుండా, విటమిన్ డి కూడా ఇందులో పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ డి లోపం కారణంగా తలెత్తే సమస్యలను అధిగమించడానికి నారింజను ఉపయోగించవచ్చు.

 

ట్రెండింగ్ వార్తలు