లగ్జరీ ఫేస్ మాస్క్‌లకు ఉన్నోళ్లంతా వేల డాలర్లు ఖర్చు చేస్తున్నారు.. ఎందుకో తెలుసా?

  • Publish Date - July 15, 2020 / 03:25 PM IST

Luxury Face Masks : కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ ఇప్పటికీ లేదు.. అందరూ కరోనాతో సహజీవనం చేయాల్సిన పరిస్థితి. బయటకు వెళ్లకపోతే పూట గడవదు. తప్పక బయటకు వెళ్లాల్సిందే. సామాన్యుడి నుంచి ధనవంతుల వరకు అందరికి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో బయటకు వెళ్లాలంటే తప్పనిసరిగా ఫేస్ మాస్క్ ధరించాలి. సామాన్యులైతే తమకు తహాతకు తగినంతగా మాస్క్ లు కొనుకుంటున్నారు. అదే.. ధనవంతుల విషయానికి వస్తే.. వారి రేంజ్ కు తగినట్టుగానే లగ్జరీ ఫేస్ మాస్క్ లను వాడుతున్నారంట..

భారతీయ ధనవంతుల్లో చాలామంది కేవలం లగ్జరీ ఫేస్ మాస్క్ ల కోసమే వేలకు వేల డాలర్లు ఖర్చు పెడుతున్నారు. ఎందుకిలా చేస్తున్నారంటే.. ఎందుకు ఖర్చు చేయకూడదనే వాదన కూడా లేకపోలేదు. మహమ్మారి ప్రారంభంలో భయాందోళనలతో మాస్క్ ల కొరత ఏర్పడింది.. మాస్క్‌ల ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి.
అప్పటినుంచి రకరకాల రంగురంగుల మోడళ్లలో ఫేస్ మాస్క్ లు దర్శనమిస్తున్నాయి. సామాన్యులు అయితే తమకు అందుబాటులో దొరికిన మాస్క్ లతో సరిపెట్టుకుంటుంటే.. ఉన్నోళ్లంతా మాత్రం తమ రేంజ్ కు ఏమాత్రం తీసిపోకుండా ఉండేలా ఖరీదైన ఫేస్ మాస్క్ లను ప్రత్యేకించి డిజైన్ చేయించుకుంటున్నారంట. అంతేకాదు.. అసలైన వజ్రాలు, బంగారం నిండిన మాస్క్ లకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారంతా… గుజరాత్‌లోని సూరత్‌లోని ఆభరణాల వ్యాపారికి కూడా ఇదే ఆలోచన వచ్చిందంట..

వివాహాది సీజన్ కూడా కావడంతో సరికొత్త డిజైన్లతో వజ్రాల నమూనాల మాస్క్‌లను తయారు చేస్తున్నారంట. అప్పటి నుంచి లగ్జరీ మాస్క్‌ల కోసం ఫుల్ డిమాండ్ పెరిగిపోయిందని అంటున్నారు. ప్రత్యేకించి వివాహాల సమయంలో లగ్జరీ మాస్క్ లకు భారీగా ఆర్డర్లు వస్తున్నాయని చెబుతున్నారు.

గుజరాత్ కు చెందిన Chokshi Kushalbhai జ్యువెలర్స్.. వజ్రాలు, బంగారం, వెండితో పూసిన ఫేస్ మాస్క్‌లను విక్రయిస్తున్నారు. మాస్క్‌లకు వాడే వస్త్ర పదార్థాన్ని ‘ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా’ వాడాలని సూచిస్తున్నారు. వీటి ధర రూ. 150,000 (USD 1,990) నుంచి రూ. 400,000 (5,306 USD) మధ్య ఉంటాయని అంటున్నారు.

తాము విక్రయించే ఈ మాస్క్‌లు తిరిగి వాడొచ్చునని, ఉతికడం లేదా కడిగి శుభ్రం చేసేలా రూపొందించినట్టు ఆభరణాల వ్యాపారి చోక్షి చెప్పుకొచ్చారు. రూ. 70,000 (928 డాలర్లు) ఖర్చయ్యే ఆర్డర్‌లు వస్తున్నాయని, ఇప్పటివరకూ రూ. 400,000 మించిన హై క్లాస్ ఆర్డర్‌లు వస్తున్నట్టు చోక్షి చెప్పారు. ఈ ఖరీదైన మాస్క్‌ల కోసం UV-Ray యంత్రాలు, డ్రై క్లీనింగ్ సర్వీసులను స్థాపించినట్టు తెలిపారు. భారత డైమండ్ హబ్ అని పిలిచే సూరత్‌లో దాదాపు 5,000 డైమండ్ పాలిషింగ్, కట్టింగ్ యూనిట్లు ఉన్నాయి.

2018లో సంవత్సరానికి రూ. 1.8 మిలియన్లు (14,323.50 అమెరికన్ డాలర్లలో). ఆదాయం వస్తుందని అంచనా.  పూణేలో శంకర్ కుర్హాడే అనే వ్యాపారవేత్త.. దాదాపు 55 గ్రాముల  బంగారు మాస్క్ ధరించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ మాస్క్ ధర రూ. 289,000 ఖర్చు అవుతుంది.

ట్రెండింగ్ వార్తలు