Gurivinda Ginja : లక్ష్మీ కటాక్షాన్నిచ్చే గురివింద గింజలు .. దెబ్బకి దరిద్రం మాయం

ఎర్రటి ఎరుపు, నల్లటి నలుపు రంగులు కలిగిన ఓ ఆసక్తికరమైన గురువింద గింజల గురించి మీకు తెలుసా..? పూజల్లో గురువింద గింజల ఉపయోగం..ఆరోగ్యంలోనే గురువింద గింజల ఉపయోగం వంటి ఎన్నో ఆసక్తికర విషయాలు..

Gurivinda Ginja

Gurivinda Ginja : గురువింద గింజలు. పైన ఎర్రటి ఎరుపు..కింద నల్లటి నలుపు రంగులో ఆకర్షణీయంగా ఉంటాయి ఈ గింజలు. తీగజాతికి చెందినది గురువింద గింజ. తాము తప్పులు చేస్తు ఇతరుల తప్పులను పెకెత్తి చూపేవారిని గురువింద గింజలతో పోలుస్తారు. గురువింద గింజలు కంసాలుల వద్ద తప్పకుండా ఉండేవి. ఎందుకంటే బంగారాన్ని ఈ గురువింద గింజలతోనే తూసేవారు కంసాలులు. పూస ఎత్తు బంగారం, రెండు పూసలు ఎత్తు బంగారం అని చెప్పేవారు. కానీ ఇప్పుడు బంగారాన్ని గ్రాముల లెక్కనే చూస్తున్నారు. గానీ ఒకప్పుడు బంగారాన్ని ఈ గింజలతోనే తూసేవారు. బంగారం అంటే లక్ష్మీదేవి. బంగారాన్ని కూడా గురువింద గింజలతో తూచటం అంటే గిరువింద గింజలు లక్ష్మీ దేవి కటాక్షాన్ని కలిగించేవని అర్థం.

లక్ష్మీదేవికి ఇష్టమైనవి ఈ గురువింద గింజలు. ఈ గింజల గురించి ఈరోజుల్లో వారికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఆయుర్వదంలో కూడా గురువింద గింజల గురించి ప్రస్తావన ఉంది. ఆయుర్వేద వైద్యంలో గురువింద గింజలు మంచి పాత్ర పోషిస్తున్నాయి. ఆయుర్వేదం లో ఈ గింజలలోని పప్పును కొన్ని రకాల మానసిక రుగ్మతలకు వాడుతుంటారు.

Onion In Underarms : చంకలో ఉల్లిగడ్డ పెట్టుకుంటే జ్వరం వస్తుందా..? నిజమెంత..?

ఇక గురువింద గింజలతో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చని చెబుతారు పండితులు. వీటిని పూజల్లో కూడా వినియోగిస్తారని చాలామందికి తెలియవు. ఒకప్పుడు వీటిని బంగారం కొలిచేందుకు ఉపయోగించే ఈ గింజలను లక్ష్మిదేవి స్వరూపంగానూ భావించేవారు. ఇప్పుడు ఈ గింజలు కనిపించటంలేదు..ఆ నమ్మకాలు లేవు. అసలు గురివింద తీగలే కనిపించటంలేదు.

గురువింద గింజలను లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తారు. ఈ గింజలను 8 లేక 11 దీపావళి, అక్షయతృతీయ పండుగల సమయంలో ప్రత్యేకంగా పూజించి ఎరుపు బట్టలో కుంకుమతో పాటు ఉంచి బీరువాలోగాని, గల్లాపెట్టె(క్యాష్ బాక్సులు)లో పెట్టుకుంటే ధనం అభివృద్ధి చెందుతుందట. లక్ష్మీ కటాక్షంతో పాటు సుఖసౌఖ్యాలు కలుగుతాయంటారు. ఈ గురువింద గింజలు చెడు నరదృష్టి, చెడు ప్రభావాలను తొలగించే గుణాలున్నాయట. సాధారణంగా గురువింద గింజలు అంటే పైన ఎర్రగా కింద నల్లగా ఉంటాయనే అనుకుంటారు.నిజం చెప్పాలంటే ఈ గింజలే చాలామందికి తెలుసు. కానీ ఈ గింజలు ఆకుపచ్చ, తెలుపు, ఎరుపు, నలుపు, పసుపు రంగులల్లో కూడా ఉంటాయని చాలామందికి తెలియదు.వీటిలో ఎరుపు, నలుపు తప్ప మిగతా రంగులు చాలా చాలా అరుదుగా ఉంటాయి. ఒకవేళ వాటిని చూసిన అవి కూడా గురువింద గింజలు అని తెలియవు.

Hospitals Colors : ఆస్పత్రుల్లో ఆకుపచ్చ, నీలం రంగులనే ఎందుకు వాడతారో తెలుసా..?

గరువింద గింజలు గ్రహ నివారణ దోషాలు..
తెలుపు రంగు గింజలు “శుక్రగ్రహ”దోష నివారణ
ఎరుపు రంగు గింజలు “కుజగ్రహ” దోష నివారణ
నలుపు రంగు గింజలు “శనిగ్రహ”దోష నివారణ
పసుపు రంగు గింజలు “గురుగ్రహ దోష నివారణ
ఆకుపచ్చ గింజలు బుధగ్రహ దోష నివారణ

గ్రహాల దోషాలు కలవారు ఈ గురువింద గింజలను శరీరంపై ధరించాలి. అంటే గింజలను ఎలా ధరిస్తారు అనే సందేహం రావచ్చు. ఈ గింజల్ని ఆభరణాల్లో అమర్చి ధరించవచ్చు. అంటే గురువింద గింజలను గాజుల్లోను, పట్టీల్లోను పెట్టించుకునేవారు గతంలో. అలాగే చంటిపిల్లలకు చెడు దృష్టి తగలకుండా కూడా ఉపయోగించేవారు. మెలతాడులోను..మెడలోను కట్టేవారు..

 

ట్రెండింగ్ వార్తలు