Low Carbohydrate : తక్కువ కార్బోహైడ్రేట్లతో కూడిన ఆహారం ఆరోగ్యానికి మంచిదా?

కార్బోహైడ్రేట్ ఆహారాలు మంచివే అయినప్పటికీ, తీసుకునే ఆహారం ఎంపిక సరిగాలేదని సర్వేలు చెబుతున్నాయి. చాలా మంది చక్కెరను ఎక్కువగా తింటారు . ఇది అధిక కేలరీల ఆహారం , బరువు పెరగడానికి దోహదం చేస్తుంది.

Carbohydrates

Low Carbohydrate : ప్రతి మనిషికి శక్తిని ఇచ్చే పోషక పదార్ధాలుగా కార్బోహైడ్రేట్లను చెప్పవచ్చు. అయితే తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండేలా చూసుకోవాలని సూచిస్తుంటారు. ఎక్కవ మోతాదులో తీసుకుంటే ఆరోగ్యంపై చెడు ప్రభావాలు ఉంటాయని చెబుతారు. అయితే ఇందు వాస్తవం గురించి చర్చిస్తే అన్ని పిండి పదార్ధాలను ఒకే విధంగా చూడటం సరైంది కాదు. వివిధ రకాల కార్బోహైడ్రేట్లు , చక్కెరలు, స్టార్చ్ , ఫైబర్ లు మన ఆరోగ్యంపై విభిన్న ప్రభావాలను చూపిస్తాయి.

మనం తీసుకునే ఆహారాల్లో చాలా వాటిల్లో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. బంగాళదుంపలు, అన్నం, పాస్త, బ్రెడ్ వంటి ఆహారంలు మనం తీసుకునే ఆహారంలో మూడింట ఒక వంతు మాత్రమే ఉండేలా చూసుకోవాలి. అలాగే చక్కెర పానీయాలు, బిస్కెట్లు, కేకులు వంటి చక్కెర ఆహారాలను మన రోజువారిగా తీసుకునే ఆరోగ్యకరమైన ఆహారంలో వీటిని చేర్చాలిన అవసరం ఏమాత్రం లేదు. చాలా మంది ఇలాంటి ఆహారాలను రోజు తింటుంటారు. అలాంటి వాటిని తక్కువ మొత్తంలో తీసుకోవటం ఉత్తమం.

పిండి పదార్థాలు మనకు శక్తిని ఇస్తాయి. ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారంలో, మన శక్తిలో ఎక్కువ భాగం హోల్‌గ్రెయిన్ మరియు వోట్స్, హోల్‌గ్రెయిన్ బ్రెడ్ , పాస్తా, బ్రౌన్ రైస్ , బంగాళదుంపలు (తొక్కలతో కూడిన) వంటి అధిక-ఫైబర్ పిండి పదార్ధాల నుండి వస్తుంది. అన్ని కార్బోహైడ్రేట్లు గ్లూకోజ్‌గా విచ్ఛిన్నమవుతాయి, ఇది శరీరం శక్తి కోసం ఉపయోగిస్తుంది, అయితే పిండి పదార్ధాలు చక్కెరల కంటే నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తాయి. ఎందుకంటే అవి పెద్ద అణువులు కావటం వల్ల విచ్ఛిన్నం అయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంది.

హోల్‌గ్రెయిన్‌లోని ఫైబర్ మరియు అధిక ఫైబర్ పిండి పదార్ధాలు మలబద్ధకాన్ని నివారించడంలో , ఆరోగ్యకరమైన ప్రేగులను నిర్వహించడంలో సహాయపడతాయి. పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాటం వల్ల గుండె మరియు రక్తప్రసరణ వ్యాధులు, టైప్ 2 మధుమేహం, ప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువని పరిశోధనల్లో తేలింది. రొట్టె, బియ్యం, తృణధాన్యాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వోట్స్‌లోని కరిగే ఫైబర్ రకం కూడా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

కార్బోహైడ్రేట్ ఆహారాలు మంచివే అయినప్పటికీ, తీసుకునే ఆహారం ఎంపిక సరిగాలేదని సర్వేలు చెబుతున్నాయి. చాలా మంది చక్కెరను ఎక్కువగా తింటారు . ఇది అధిక కేలరీల ఆహారం , బరువు పెరగడానికి దోహదం చేస్తుంది. కేకులు, బిస్కెట్లు, చక్కెర పానీయాలు , స్వీట్లకు బదులుగా, పండ్లు తక్కువ కొవ్వు తో కూడిన పెరుగు వంటి ఆరోగ్యకరమైన వాటిని ఆహారంగా తీసుకోవటం ఆరోగ్యానికి మంచిది. పండ్లు, పాల ఉత్పత్తులు చక్కెరలను కలిగి ఉంటాయి, అయితే ఈ ఆహారాలు ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు , ఖనిజాల వంటి ఇతర పోషకాలను శరీరానికి అందిస్తాయి.

తక్కువ కార్బోహైడ్రేట్ ఆహారాలు బరువు తగ్గడానికి దోహదం చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడటానికి టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు కూడా వీటిని తీసుకోవచ్చు. రోజుకు 130gలేదా తక్కువ మొత్తం కార్బోహైడ్రేట్ కలిగిన ఆహారం బరువు తగ్గడంలో, మధుమేహం నియంత్రణ కోసం సురక్షితమైనది. మీడియం సైజులో ఉండే బ్రెడ్ , యాపిల్ రెండింటిలో దాదాపు 15గ్రా కార్బోహైడ్రేట్ ఉంటుంది. అరగ్లాసు పాలలో 13గ్రా కార్బోహైడ్రేట్ ఉంటుంది. 50g బార్ చాక్లెట్‌లో దాదాపు కార్బోహైడ్రేట్ ఉంటుంది.

కార్బోహైడ్రేట్లు చాలా ఆహారాలలో ఉన్నందున, పోషకాలు, తగినంత ఫైబర్ కలిగిన ఆరోగ్యకరమైన సమతుల్యత కలిగిన ఆహారాలను ఎంచుకోవాలి. ఆహారపు అలవాట్లలో ఏవైనా మార్పుల ఆరోగ్య నిపుణులతో చర్చించాలి. కార్బోహైడ్రేట్లు మనకు ముఖ్యమైన పోషకాలను అందిస్తాయి. బరువు తగ్గడానికి లేదా టైప్ 2 డయాబెటిస్‌ను కంట్రోల్ లో ఉంచాలనుకొనేవారు తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్‌లను తగ్గించడం శ్రేయస్కరం. తృణధాన్యాలు, అధిక ఫైబర్ స్టార్చ్ కార్బోహైడ్రేట్లను ఎంచుకోవడం, అదే క్రమంలో చక్కెర పదార్ధాలను తగ్గించడం వలన ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను కలిగి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.