Skin Beauty : చర్మంపై ముడతలకు వయస్సు పెరగటం ఒక్కటే కారణమా? చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవాలంటే?

తగినన్ని నీళ్లు తాగితే చర్మ ఆరోగ్యం బాగుంటుంది. డీహైడ్రేషన్‌ వల్ల చర్మం త్వరగా డల్‌గా మారిపోవటం, ముడతలు పడటాన్ని నివారించవచ్చు. తగినంత నిద్ర తప్పనిసరి. నిద్ర పోతున్న సమయంలోనే చర్మకణాలు తిరిగి పునరుత్తేజం అవుతాయి.

beauty of the skin

Skin Beauty : చర్మంపై ముడతలు వయసుపైబడినట్టుగా కనిపించేలా చేస్తాయి. ఇందుకు 90 శాతం యువీ కిరణాలే కారణం. చర్మంలోని సాగేగుణాన్ని యువీకిరణాలు బ్రేక్‌ చేస్తాయి. దీనివల్ల చర్మం నిగారింపు తగ్గిపోయి, ముడతలు వచ్చి చేరతాయి. చర్మంపై ముడతలు రావడానికి వయసు పెరగడం ఒక్కటే కారణం అనుకుంటే పొరపాటు. సౌందర్య సంరక్షణలో, మన జీవన విధానాల్లోనూ చేసే కొన్ని పొరపాట్లు కూడా అందుకు కారణమవుతాయి. ఈ క్రమంలో ముఖ్యంగా మహిళలు చర్మ సౌందర్యం కాపాడుకునేందుకు వివిధ మార్గాలను అనుసరించాల్సి ఉంటుంది. చర్మం యవ్వనంగా కనిపించేలా తగిన జాగ్రత్తలు పాటించాలి. చర్మం ఆరోగ్యవంతంగా ఉండాలంటే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే పళ్లు, కూరలు మన ఆహారంలో భాగం చేసుకోవాలి. ముందుగా రోజువారి ఆహారంలో ఆకుకూరలు ఎక్కువగా తీసుకునేలా చూసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలకు ప్రాధాన్యం ఇవ్వాలి. పండ్లు, కూరగాయల్లో ఉండే ఫైటోన్యూట్రియెంట్లు ఫ్రీరాడికల్స్‌ వల్ల జరిగే నష్టం నుంచి కాపాడతాయి.

ఆల్కహాల్‌, కెఫిన్‌ వాడకం బాగా తగ్గించాలి. ఈ రెండూ శరీరాన్ని డీహైడ్రేట్‌ చేయడమే కాకుండా, ముఖ్యమైన పోషకాలు శరీరానికి అందకుండా చేస్తాయి. వీటి నుండి బయటపడేందుకు ప్రతిరోజూ ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాలి. తగినన్ని నీళ్లు తాగితే చర్మ ఆరోగ్యం బాగుంటుంది. డీహైడ్రేషన్‌ వల్ల చర్మం త్వరగా డల్‌గా మారిపోవటం, ముడతలు పడటాన్ని నివారించవచ్చు. తగినంత నిద్ర తప్పనిసరి. నిద్ర పోతున్న సమయంలోనే చర్మకణాలు తిరిగి పునరుత్తేజం అవుతాయి. కొత్తవి తయారవుతాయి. రోజుకు 8 గంటలు ప్రశాంతమైన నిద్ర అవసరం. ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్‌ ట్రైనింగ్‌ వ్యాయామాల వల్ల కణజాల స్థాయిలో ఏజింగ్‌ పదేళ్లు తగ్గుతున్నట్టు పరిశోధనల్లో తేలింది.

ఎండలోకి వెళ్లేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్లు రాసుకోవడం వంటి రక్షణ చర్యలు తప్పకుండా పాటించాలి. ఒకేసారి బరువు తగ్గడం లేదా పెరగడం వంటివి జరిగితే స్ట్రెచ్‌మార్క్స్ రావడంతో పాటు చర్మం సాగినట్లుగా, ముడతల్లా కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి బరువు మరీ తక్కువగా లేదా ఎక్కువగా కాకుండా తగినంత ఉండేలా జాగ్రత్తపడాలి. కృత్రిమంగా తయారు చేసే క్రీములపై ఆధారపడడం కంటే సహజసిద్ధంగా తయారయ్యే పండ్లు, నట్స్‌ తో కాంతివంతమైన చర్మాన్ని పొందేందుకు ప్రయత్నించటం మంచిది.