Banana Leaves
Banana Leaves : అరటాకులో భోజనం చేయటం మన పూర్వికుల నుండి వస్తున్న ఆచారం. అరటి ఆకులలో భోజనం చేయడం మన భారతీయ సంప్రదాయాలలో ఒక భాగం. పూర్వకాలం బ్రాహ్మణులు, అతిథులు ఇంటికి వచ్చినప్పుడు వారికి అరటి ఆకులలో భోజనం పెట్టడం సాంప్రదాయంగా వస్తుంది. అరటాకులో భోజనం చేయటం వల్ల ఆరోగ్యపరమైన ప్రయోజనాలున్నాయి. మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు లేదా వ్రతాలు నిర్వహించినప్పుడు ఈ అరిటాకులను వాడడం ఇప్పటికీ ఆనవాయితీగా వస్తుంది.
అరటి ఆకులో ఆహారం పెట్టుకుని తినడం వల్ల త్వరగా జీర్ణమవుతుంది. ఒకవేళ అన్నంలో విషం ఉంటే ఆ ఆకు నలుపు రంగులోకి మారిపోతుంది. అరటిఆకులో అన్నం పెడితే శత్రువులు కూడా ఎలాంటి భయం లేకుండా తింటారు.అరటి ఆకులపై వడ్డించిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
భోజనం చేసిన తర్వాత ఈ ఆకులను బయట పడేసినా తొందరగా మట్టిలో కలిసిపోతాయి. తద్వారా పర్యావరణానికి మేలు చేసినట్టు కూడా అవుతుంది. ఎన్నో రకలైన జబ్బులను నిరోధించే శక్తి ఈ ఆకులో ఉండటం విశేషం. వేడివేడిగా ఉండే భోజనాన్ని అరటి ఆకుపై పెట్టగానే దానిపై ఉండే ఒక పొర కరిగి అన్నంలో కలిసిపోతుంది. దీంతో అన్నానికి మంచి రుచి వస్తుంది.
అరటి ఆకులో రోజూ భోజనం చేయడం వల్ల చాలా రకాల దీర్ఘాకాలిక వ్యాధులు కూడా నయం అవుతాయి. క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులు కూడా అరటి ఆకులో భోజనం చేయడం వల్ల తగ్గిపోతాయని చెప్తుంటారు. అరటి ఆకులలో ఇతరులకు భోజనం పెడితే వారిపై మనకు ఎంతో గౌరవం ఉన్నట్లు అర్థం చేసుకుంటారు.
అరటిఆకులో భోజనం చేయడం వల్లన ఆకలి పెరుగుతుంది, ఆరోగ్యవంతులుగా ఉంటారు. అరటి ఆకులో భోజనం చేస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. పేగుల్లో ఉండే క్రిములు నశిస్తాయి. అరటి ఆకులో భోజనం చేసిన తృప్తి ప్లాస్టిక్ ప్లేట్ లలో చేస్తే రాదు. అమావాస్య, పౌర్ణమి రోజులలో రాత్రిపూట అరటి ఆకులపై భోజనం చేయరాదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.